AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వామ్మో పంతు.. ఏంటా స్ట్రెంతు! సిక్స్ కొడితే ఎక్కడికెళ్లి పడిందో తెలుసా?

Rishabh Pant: కొలంబో టెస్టులో రిషభ్ పంత్ విధ్వంసక బ్యాటింగ్‌తో అదరగొట్టారు. లాహిరు కుమార బౌన్సర్‌కు 95 మీటర్ల భారీ సిక్సర్‌తో బదులిచ్చారు. పంత్ కొట్టిన పవర్‌ఫుల్ షాట్ స్టేడియం పైకప్పుపై ఉన్న సోలార్ ప్యానెల్‌ను పగలగొట్టినట్లు వైరల్ వీడియోలు చెబుతున్నాయి. గాయం తర్వాత మైదానంలోకి వచ్చిన పంత్ తన మార్క్ ఆటతో అభిమానులను అలరించారు.

Video: వామ్మో పంతు.. ఏంటా స్ట్రెంతు! సిక్స్ కొడితే ఎక్కడికెళ్లి పడిందో తెలుసా?
Rishabh Pant
Rakesh
|

Updated on: Aug 24, 2026 | 11:41 AM

Share

Video: కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తన మార్క్ అగ్రెసివ్ బ్యాటింగ్‌తో చెలరేగిపోయారు. తొలిరోజు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లాహిరు కుమార విసిరిన షార్ప్ బౌన్సర్ తగిలి నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగిన పంత్, రెండో రోజు మైదానంలోకి అడుగుపెట్టి ప్రత్యర్థి బౌలర్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. బౌన్సర్‌కే భారీ సిక్సర్‌తో బదులిచ్చి తనను భయపెట్టడం ఎవరి వల్ల కాదని నిరూపించారు.

తొలిరోజు కుమార వేసిన బౌన్సర్ పంత్ మణికట్టుకు బలంగా తాకడంతో భారత అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే ఆ గాయాన్ని లెక్కచేయకుండా రెండో రోజు క్రీజులోకి వచ్చిన పంత్, అదే బౌలర్ బౌలింగ్‌ను టార్గెట్ చేశారు. కుమార లెగ్ సైడ్ దిశగా వేసిన మరో తీవ్రమైన బౌన్సర్‌ను పంత్ ఎంతో సులువుగా పసిగట్టారు. క్షణాల్లో పొజిషన్ తీసుకుని ఫైన్ లెగ్ మీదుగా అద్భుతమైన పుల్ షాట్ ఆడారు.

పంత్ కొట్టిన ఆ షాట్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందంటే.. బంతి నేరుగా ఎస్‌ఎస్‌సి స్టేడియం కప్పుపైకి వెళ్లి పడింది. దాదాపు 95 మీటర్ల సుదూర ప్రాంతంలో పడిన ఈ భారీ సిక్స్ ధాటికి స్టేడియం పైకప్పుపై ఉన్న సోలార్ ప్యానెల్ పగిలిపోయింది. బంతి స్టేడియం దాటి బయటకు వెళ్లిపోవడంతో మైదానంలో ఉన్న అంపైర్లు ఆటను కాసేపు నిలిపివేయాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి: WTC Points Table: బంగ్లా ఓటమితో కలసివచ్చిన అవకాశం.. శ్రీలంక పై గెలిస్తే డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ ప్లేస్ ఇదే

బంతి ఎక్కడికి పోయిందో దొరక్కపోవడంతో నాలుగో అంపైర్ కొత్త బంతులు ఉన్న బాక్స్‌ను మైదానంలోకి తీసుకువచ్చారు. పంత్ ఆడిన ఈ విధ్వంసకర షాట్‌కు స్టేడియంలోని ప్రేక్షకులు, కామెంటేటర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఒక రోజు ముందు తను గాయపడటానికి కారణమైన బౌలర్‌ను అదే రీతిలో దెబ్బకొట్టి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. తన స్టైల్ ఆటతీరుతో రిషభ్ పంత్ శ్రీలంక బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. ఈ సిక్సర్‌తో భారత జట్టు మ్యాచ్‌పై మరింత పట్టు సాధించడమే కాకుండా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

ఎక్కువమంది చదివినది: SL vs IND 2nd Test: శుభ్‌మన్ గిల్ అరుదైన ప్రపంచ రికార్డ్.. ఈ దశాబ్దంలోనే ఎవరికీ సాధ్యం కాలేగా..!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us