AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గివేం పనులు సారూ.. విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!

రాజస్థాన్‌లో విద్యార్థినులతో కలిసి డ్యాంలోకి దిగిన ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్‌ లాల్‌చంద్‌ మీనాపై విద్యాశాఖ సస్పెన్షన్‌ వేటు వేసింది. ఆగస్టు 15న 200 మందికిపైగా విద్యార్థులను డ్యాం వద్దకు తీసుకెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గివేం పనులు సారూ.. విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!
Principal Bathing With Girl Students
SN Pasha
|

Updated on: Aug 24, 2026 | 9:22 AM

Share

రాజస్థాన్‌లోని అల్వర్‌ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్‌ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. 11, 12వ తరగతి విద్యార్థినులతో కలిసి డ్యాంలోకి దిగి స్నానం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పడక్‌ ఛాప్లీ ప్రాంతంలోని ప్రభుత్వ సీనియర్‌ సెకండరీ పాఠశాల ప్రిన్సిపల్‌ లాల్‌చంద్‌ మీనాను తక్షణమే సస్పెండ్‌ చేస్తూ బీకానేర్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటన ఆగస్టు 15న చోటుచేసుకున్నట్లు అధికారిక సమాచారం. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం ప్రిన్సిపల్‌ 200 మందికిపైగా విద్యార్థులను పాఠశాలకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని భరాజ్‌ డ్యాం వద్దకు తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఈత నేర్పించే ఉద్దేశంతో అక్కడికి తీసుకెళ్లినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

అయితే డ్యాంలోకి విద్యార్థులను దింపే సమయంలో తగిన భద్రతా ఏర్పాట్లు లేవన్న ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా డ్యాంలో సుమారు 11 అడుగుల మేర నీరు ఉన్నట్లు, అక్కడ ఈత కొట్టడం ప్రమాదకరమని, స్నానానికి అనుమతి లేదని నివేదికలు వెల్లడించాయి. విద్యార్థులకు లైఫ్‌ జాకెట్లు వంటి రక్షణ పరికరాలు అందుబాటులో లేవన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో విద్యార్థుల భద్రత విషయంలో పాఠశాల యాజమాన్యం వ్యవహరించిన తీరుపై ప్రశ్నలు తలెత్తాయి. ఇదే సమయంలో విద్యార్థినులతో కలిసి ప్రిన్సిపల్‌ నీటిలోకి దిగిన దృశ్యాలను కొందరు వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో ఆయన విద్యార్థినుల సమక్షంలో దుస్తులు లేకుండా నీటిలో ఉన్నట్లు కనిపించిందని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. వీడియో సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ కావడంతో స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై విద్యాశాఖ తీవ్రంగా స్పందించింది.

ప్రిన్సిపల్‌ ప్రవర్తన ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నట్లు సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజస్థాన్‌ సివిల్‌ సర్వీసెస్‌ (క్లాసిఫికేషన్‌, కంట్రోల్‌ అండ్‌ అప్పీల్‌) రూల్స్‌, 1958లోని రూల్‌ 13(1) కింద శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. సస్పెన్షన్‌ కాలంలో మీనా ప్రధాన కార్యాలయం బీకానేర్‌లోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌గా నిర్ణయించారు. వైరల్‌ వీడియోపై పోలీసులు కూడా పరిశీలన ప్రారంభించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఘటనకు సంబంధించిన వాస్తవాలు, వీడియో నిజస్వరూపం, విద్యార్థులను డ్యాం వద్దకు తీసుకెళ్లిన పరిస్థితులు, భద్రతా చర్యలు వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంపై మూడు సభ్యుల కమిటీ కూడా విద్యార్థుల వాంగ్మూలాలను నమోదు చేసి నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం.

Follow Us