AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరటి పండు, బొప్పాయి కలిపి తింటున్నారా? అయితే జరిగేదిదే.. జాగ్రత్త!

రోజువారీ ఆహారంలో పండ్లను చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. అయితే పండ్లను తినే విధానంపై కూడా అవగాహన ఉండటం అత్యంత అవసరం. చాలామంది ఫ్రూట్ సలాడ్ పేరుతో లేదా అలవాటుగా రకరకాల పండ్లను ఒకేసారి తింటుంటారు. కానీ, కొన్ని రకాల పండ్ల కాంబినేషన్లు మేలు చేయకపోగా శరీరానికి హాని కలిగిస్తాయి. అటువంటి విరుద్ధమైన కలయికల్లో అరటిపండు, బొప్పాయి కాంబినేషన్ ఒకటి. ఈ కాంబినేషన్ ఆరోగ్య లాభాలకు బదులు మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Jyothi Gadda
|

Updated on: Oct 05, 2026 | 6:58 PM

Share
వేర్వేరు స్వభావాలు - జీర్ణ వ్యవస్థపై ప్రభావం: ఆయుర్వేదం, పోషకాహార నిపుణుల ప్రకారం అరటిపండు, బొప్పాయి విభిన్న తత్వాలు కలిగిన పండ్లు. అరటిపండు శరీరాన్ని చల్లబరిచే స్వభావాన్ని కలిగి ఉంటే, బొప్పాయి శరీరాన్ని వేడిచేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇలా పరస్పర విరుద్ధ లక్షణాలు ఉన్న ఆహారాలను ఒకేసారి తినడం వల్ల శరీరంలో రసాయన సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా జీర్ణ వ్యవస్థ బలహీనపడి ఆహారం సరిగ్గా అరగదు.

1 / 5
ఉత్పన్నమయ్యే అనారోగ్య సమస్యలు: ఈ రెండు పండ్లను కలిపి తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అజీర్ణం, కడుపులో ఉబ్బరం, గ్యాస్, వాంతులు, వికారం వంటి ఇబ్బందులు వస్తాయి.  జీర్ణవ్యవస్థలో అసమతుల్యత వల్ల తీవ్రమైన తలనొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

2 / 5
శ్వాసకోశ ఇబ్బందులు: శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ రెండు పండ్లను కలిపి తినడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఇదివరకు ఆస్తమా లేదా ఇతర శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఈ పండ్ల కలయిక అలర్జీలను తెచ్చిపెట్టి ఇబ్బందులను మరింత తీవ్రం చేస్తుంది. అరటిపండు, బొప్పాయి పండు కలిపి తినడం వల్ల ఆస్తమాతో పాటు ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయని, ఇబ్బంది పడాల్సి ఉంటుందని చెబుతున్నారు.

3 / 5
విడివిడిగా తింటేనే అద్భుతమైన ప్రయోజనాలు: ఈ రెండు పండ్లను విడివిడిగా తీసుకుంటే శరీరానికి అపరిమితమైన పోషకాలు లభిస్తాయి. అరటిపండులో క్యాల్షియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉండి కండరాల బలానికి, గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. మరోవైపు బొప్పాయిలో విటమిన్-A, విటమిన్-C, విటమిన్-Eతో పాటు కొలెస్ట్రాల్‌ను అదుపు చేసే గుణాలు ఉన్నాయి.

4 / 5
ఈ రెండు పండ్లను కలిపి తినడం వల్ల తలనొప్పి వస్తుంది. కళ్ళు తిరగడం కూడా జరుగుతుంది. అయితే బొప్పాయి పండులోను, అరటి పండులోను మన ఆరోగ్యానికి దోహదం చేసే ఎన్నో గుణాలు ఉంటాయి. కాబట్టి, ఈ రెండింటిలోని ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే ఒకేసారి కలిపి తినకుండా, రోజులోని వేర్వేరు సమయాల్లో కనీసం 2-3 గంటల వ్యవధితో విడివిడిగా తీసుకోవడమే ఉత్తమమైన మార్గం.

5 / 5
Follow Us