AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: ఎస్‌బీఐ స్పెషల్ స్కీమ్‌లో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీకి ఎంత వస్తుందో తెలుసా?

SBI: ఈ స్కీమ్ లో చేరాలంటే ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లి నేరుగా లేదా SBI YONO యాప్ / ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా డిపాజిట్ చేయవచ్చు. తక్కువ వ్యవధిలో (సుమారు 14.5 నెలలు) సేఫ్‌గా గ్యారెంటీ రాబడి పొందాలనుకునే..

SBI: ఎస్‌బీఐ స్పెషల్ స్కీమ్‌లో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీకి ఎంత వస్తుందో తెలుసా?
SBI Schemes
Subhash Goud
|

Updated on: Oct 05, 2026 | 9:12 PM

Share

SBI: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తక్కువ వ్యవధిలో ఎక్కువ వడ్డీని అందించే లక్ష్యంతో ‘అమృత్ వృష్టి’ (Amrit Vrishti) పేరిట ఒక ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాన్ని నిర్వహిస్తోంది. 444 రోజుల వ్యవధి కలిగిన ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేయడం ద్వారా సాధారణ పౌరులతో పాటు సీనియర్ సిటిజన్లు ఆకర్షణీయమైన వడ్డీ రాబడిని పొందవచ్చు. మీరు గనుక ఈ స్కీమ్‌లో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి ఎంత చేతికి వస్తుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

వడ్డీ రేట్ల వివరాలు:

SBI సాధారణ ఎఫ్‌డీ రేట్ల కంటే ఈ 444 రోజుల స్కీమ్‌పై అధిక వడ్డీని అందిస్తోంది. సాధారణ పౌరులకు ఏడాదికి 6.45% వడ్డీ రేటు. అలాగే సీనియర్ సిటిజన్లకు 60 ఏళ్లు దాటిన వారికి ఏడాదికి 6.95% వడ్డీ రేటు (అదనంగా 0.50% లభిస్తుంది). సూపర్ సీనియర్ సిటిజన్లకు 80 ఏళ్లు దాటిన వారికి ఏడాదికి 7.05% వడ్డీ రేటు లభిస్తుంది.

ఇది కూడా చదవండి: DMartలో అన్ని ఉన్నా ఇవి మాత్రం ఎందుకు ఉండవు.. వెనుకున్న అసలు బిజినెస్ సీక్రెట్ ఇదే!

రూ.5 లక్షల పెట్టుబడిపై మెచ్యూరిటీ రాబడి ఎంత?

ఈ స్కీమ్‌లో రూ.5 లక్షలు జమ చేసినప్పుడు 444 రోజుల తర్వాత ఎంత రాబడి వస్తుందో చూద్దాం.

1. సాధారణ డిపాజిటర్లకు:

  • పెట్టుబడి మొత్తం: రూ.5,00,000
  • వడ్డీ రేటు: 6.45%
  • సుమారు రాబడే వడ్డీ: రూ.40,000 కంటే ఎక్కువ
  • మొత్తం మెచ్యూరిటీ అమౌంట్: సుమారు రూ.5,40,000పైనే.

2. సీనియర్ సిటిజన్లకు:

  • పెట్టుబడి మొత్తం: రూ.5,00,000
  • వడ్డీ రేటు: 6.95%
  • సుమారు రాబడే వడ్డీ: రూ.43,000 కంటే ఎక్కువ
  • మొత్తం మెచ్యూరిటీ అమౌంట్: సుమారు రూ.5,43,000పైనే.

ఈ స్కీమ్ ముఖ్య ఫీచర్లు:

  • డిపాజిట్ పరిమితి: కనీసం రూ.1,000 నుండి ప్రారంభించి గరిష్టంగా రూ.3 కోట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అత్యవసర సమయాల్లో ఈ ఎఫ్‌డీ పై బ్యాంక్ నుండి లోన్ తీసుకునే అవకాశం ఉంది. మెచ్యూరిటీకి ముందే డబ్బు విత్‌‌డ్రా చేసుకోవచ్చు. కానీ వర్తించే నిబంధనల ప్రకారం కొంత పెనాల్టీ వర్తిస్తుంది.

ఎలా అప్లై చేయాలి?:

ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లి నేరుగా లేదా SBI YONO యాప్ / ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా డిపాజిట్ చేయవచ్చు. తక్కువ వ్యవధిలో (సుమారు 14.5 నెలలు) సేఫ్‌గా గ్యారెంటీ రాబడి పొందాలనుకునే వారికి ఈ ‘SBI అమృత్ వృష్టి’ మంచి ఎంపికగా ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: Cheapest Bikes: దీపావళికి బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? దేశంలో అత్యంత చౌకైన 5 బైక్‌లు ఇవే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us