AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ షాంపూ చేస్తే జుట్టు ఊడిపోతుందా? హెయిర్ ఎక్స్‌పర్ట్ జావేద్ హబీబ్ షాకింగ్ చిట్కాలు!

జుట్టు సంరక్షణలో అందరినీ వేధించే ప్రధాన అనుమానం రోజూ తలస్నానం చేయవచ్చా? షాంపూ రోజూ వాడితే కుదుళ్లు బలహీనపడతాయా?. సాధారణంగా ప్రతిరోజూ షాంపూ చేయడం వల్ల జుట్టు పొడిబారి ఊడిపోతుందని అనుకుంటారు. అయితే, దీనిపై ప్రముఖ హెయిర్ కేర్ నిపుణుడు జావేద్ హబీబ్ కీలక విషయాలు వెల్లడించారు.

రోజూ షాంపూ చేస్తే జుట్టు ఊడిపోతుందా? హెయిర్ ఎక్స్‌పర్ట్ జావేద్ హబీబ్ షాకింగ్ చిట్కాలు!
Shampoo Every Day
Jyothi Gadda
|

Updated on: Oct 05, 2026 | 9:13 PM

Share

రోజూ షాంపూతో తలస్నానం చేయడం వల్ల జుట్టు ఊడిపోతుందనే భయం చాలామందిలో ఉంటుంది. అయితే ఈ అభిప్రాయం తప్పు అని ప్రముఖ హెయిర్ ఎక్స్‌పర్ట్ జావేద్ హబీబ్ స్పష్టం చేశారు. తలపై పేరుకుపోయే జిడ్డు, దమ్ము, చెమట వల్ల కుదుళ్లు బలహీనపడతాయి.. కాబట్టి, అవసరాన్ని బట్టి క్రమం తప్పకుండా జుట్టును శుభ్రం చేసుకోవాలని ఆయన సూచించారు. జుట్టు రాలకుండా ఆరోగ్యంగా పెరగడానికి స్కాల్ప్ పరిశుభ్రత అత్యంత కీలకమని హబీబ్ స్పష్టం చేశారు.

స్కాల్ప్ పరిశుభ్రతే జుట్టు ఆరోగ్యానికి మూలం:

మన శరీరాన్ని, ముఖాన్ని రోజూ ఎలా శుభ్రం చేసుకుంటామో, తల పైభాగాన్ని కూడా అలాగే శుభ్రంగా ఉంచుకోవాలని హబీబ్ తెలిపారు. రోజువారీ దుమ్ము, ధూళి, చెమట, సహజమైన సెబమ్ కుదుళ్లలో పేరుకుపోవడం వల్ల జుట్టు ఊడిపోవడం మొదలవుతుంది. కాబట్టి జుట్టు రాలిపోతుందనే భయంతో తలస్నానం చేయకుండా ఉండటం సరైన పద్ధతి కాదని, అవసరాన్ని బట్టి రోజూ కూడా స్వల్ప పరిమాణంలో షాంపూ వాడవచ్చని ఆయన చెప్పారు.

ఆయిల్ అప్లై చేసే సరికొత్త పద్ధతి:

చాలామంది పొడి జుట్టుపైనే నేరుగా నూనె రాస్తుంటారు. అయితే జావేద్ హబీబ్ సూచించిన ప్రత్యేక పద్ధతి ప్రకారం.. తలస్నానానికి ముందుగా జుట్టును బాగా తడిపి, ఆ తర్వాత మాత్రమే నూనె రాయాలి. జుట్టు పొడవుగా ఉంటే చిక్కులు లేకుండా తేలికగా దువ్వుకోవాలి. నూనె రాసిన తర్వాత కేవలం 5 నిమిషాలు ఉంచి వెంటనే షాంపూతో కడిగేయాలి. రోజంతా లేదా రాత్రంతా నూనెను తలలో ఉంచుకోవడం వల్ల దుమ్ము ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఖరీదైన ప్రాడక్ట్స్ అవసరం లేదు:

జుట్టు సంరక్షణ కోసం మార్కెట్లో దొరికే అత్యంత ఖరీదైన నూనెలు లేదా బ్రాండెడ్ షాంపూలు వాడాల్సిన పనిలేదని హబీబ్ స్పష్టం చేశారు. ఇంట్లో ఉండే సాధారణ కొబ్బరి నూనె లేదా ఆవనూనెను ఉపయోగించవచ్చని, మనకు అలవాటైన సాధారణ షాంపూ, కుంకుడుకాయలు లేదా రీఠా పొడితో తలస్నానం చేసినా సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. తల చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఆరోగ్యకరమైన, దృఢమైన జుట్టుకు అసలైన రహస్యమని ఆయన తేల్చి చెప్పారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us