AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కల్ట్ బాయ్స్ మళ్లీ వచ్చేస్తున్నారు.. రెట్టింపు ఫన్, ఫుల్ మ్యాడ్‌నెస్‌తో ‘హుషారు 2’.. రిలీజ్ ఎప్పుడంటే?

2018లో విడుదలైన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'హుషారు' సినిమా సంచలన విజయం సాధించింది. చిన్న సినిమా ట్యాగ్ తో రిలీజైన బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడీ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కూడా వస్తోంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

కల్ట్ బాయ్స్ మళ్లీ వచ్చేస్తున్నారు.. రెట్టింపు ఫన్, ఫుల్ మ్యాడ్‌నెస్‌తో ‘హుషారు 2’.. రిలీజ్ ఎప్పుడంటే?
Husharu 2 Movie
Basha Shek
|

Updated on: Oct 05, 2026 | 9:26 PM

Share

కుర్రకారులో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపిన ఐకానిక్ ఫ్రాంచైజీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. 2018లో విడుదలై యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ‘హుషారు’ చిత్రం ఎంత‌టి ఘన విజయాన్ని అందుకుందో మ‌నంద‌రికీ తెలుసు. ఆ స‌క్సెస్ తర్వాత..తాజాగా అంద‌రిలో ఆస‌క్తిని పెంచుతూ దర్శకుడు శ్రీ హర్ష ‘హుషారు 2’ను సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. దీని టైటిల్ అనౌన్స్మెంట్ పోస్ట‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు. టైటిల్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. మొద‌టి భాగంలో ఐదుగురు స్నేహితులు రూపొందించిన క‌బూమ్ బీరు ఓ ట్ర‌క్కులో ఉంది. ఆ ట్ర‌క్కుకు రెండు వైపులా కొంద‌రు ప‌ట్టుకుని బ‌లంగా లాగుతున్నారు. వారికి తాడులా పాము క‌నిపిస్తోంది. పాము మ‌ధ్య‌లో స్నేహితులు చిక్కుకుని భ‌యప‌డుతున్నారు. ట్ర‌క్కు కింద తాబేలు ఉంది. కాస్త దూరంలో బంగారు న‌గ‌లుతో ఉన్న పెట్టె ఉంది. పోస్ట‌ర్ వెనుక ఫ్యాక్ట‌రీ ఉంది. పోస్ట‌ర్‌ను చూస్తుంటే.. దేవ‌త‌లు, రాక్ష‌సులు క‌లిసి అమృత మ‌థ‌నం చేసిన క‌థ మ‌న‌కు గుర్తుకు వ‌స్తుంది. ఆ క‌థ‌కు, ఈ సీక్వెల్‌కు ఉన్న లింకేంటి? అనే విష‌యం తెలియాలంటే హుషారు 2 సినిమా వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే. రెట్టింపు ఫన్, మ్యాడ్‌నెస్, నాన్‌స్టాప్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ‘హుషారు 2’ తెరకెక్కనుంది. ఒరిజినల్ ‘హుషారు’ను తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో కల్ట్ హిట్‌గా నిలిపిన ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఈ సీక్వెల్ మరోసారి అందించనుంది.

ఒరిజిన‌ల్ క్రియేట‌ర్ రిట‌ర్న్స్‌

2018లో వచ్చిన ‘హుషారు’ చిత్రానికి కథ రాసి దర్శకత్వం వహించిన డైనమిక్ డైరెక్టర్ శ్రీ హర్ష కోనుగంటి మరోసారి మెగాఫోన్ పట్టుకోనున్నారు. యూత్ కల్చర్, ఆధునిక సంబంధాలు, కామెడీ టైమింగ్‌పై మంచి పట్టున్న శ్రీ హర్ష.. మరింత భారీగా, మరింత కొత్తగా రూపొందనున్న ‘హుషారు 2’కు దర్శకత్వం వహించనున్నారు.

శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడక్ష‌న్‌.. ఏడాది చివర్లో గ్రాండ్ రిలీజ్

సినిమా ప్రధాన షూటింగ్ షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రేక్షకులకు అత్యున్నత స్థాయి సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు చిత్ర యూనిట్ సిద్ధ‌మ‌వుతోంది. ఏడాది చివర్లో సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమాలో రాహుల్ రామ‌కృష్ణ‌, అశోక్ గ‌ల్లా, ర‌వి అంథోని, దినేష్ తేజ్‌, శ‌శిధ‌ర్ కోచ‌ర్ల‌కోట‌, విధి యాద‌వ్‌, అభిజ్ఞ ఉతులూరు, భ‌గ‌వాన్ తివారి, జతిన్ గోసామి, ర‌జ‌య్ రోవన్ త‌దిత‌రులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మూగజీవిపై ఇంతటి ప్రేమా.. పెంపుడు కుక్క చనిపోతే ఈ ఫ్యామిలీ..
మూగజీవిపై ఇంతటి ప్రేమా.. పెంపుడు కుక్క చనిపోతే ఈ ఫ్యామిలీ..
రెట్టింపు ఫన్, ఫుల్ మ్యాడ్‌నెస్‌తో ‘హుషారు 2’.. రిలీజ్ ఎప్పుడంటే?
రెట్టింపు ఫన్, ఫుల్ మ్యాడ్‌నెస్‌తో ‘హుషారు 2’.. రిలీజ్ ఎప్పుడంటే?
నోట్లో వేస్తే ఐస్‌క్రీమ్‌లా కరిగిపోయే పాతకాలం నాటి బలమైన స్వీట్
నోట్లో వేస్తే ఐస్‌క్రీమ్‌లా కరిగిపోయే పాతకాలం నాటి బలమైన స్వీట్
రోజుకో ముక్క తింటే చాలు బారులు తీరే ఒత్తైన జుట్టు మీ సొంతం
రోజుకో ముక్క తింటే చాలు బారులు తీరే ఒత్తైన జుట్టు మీ సొంతం
SBIలో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీకి ఎంత వస్తుంది?
SBIలో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీకి ఎంత వస్తుంది?
రోజూ షాంపూ చేస్తే జుట్టు ఊడిపోతుందా? హెయిర్ ఎక్స్‌పర్ట్ సూచన ఇదే!
రోజూ షాంపూ చేస్తే జుట్టు ఊడిపోతుందా? హెయిర్ ఎక్స్‌పర్ట్ సూచన ఇదే!
బెండకాయ గింజలు తింటే కడుపులో ఏమవుతుంది..?
బెండకాయ గింజలు తింటే కడుపులో ఏమవుతుంది..?
రాత్రిపూట ఆలస్యంగా తింటున్నారా? గుండె ఆరోగ్యానికి పొంచి ఉన్న
రాత్రిపూట ఆలస్యంగా తింటున్నారా? గుండె ఆరోగ్యానికి పొంచి ఉన్న
ఇలాంటోడు టీమిండియాలో అస్సలు వద్దు.. పీకిపారేయండి.!
ఇలాంటోడు టీమిండియాలో అస్సలు వద్దు.. పీకిపారేయండి.!
తెలంగాణ ఏసీబీ చరిత్రలో అతి పెద్ద అవినీతి తిమింగలం..!
తెలంగాణ ఏసీబీ చరిత్రలో అతి పెద్ద అవినీతి తిమింగలం..!