కంటి చూపు తగ్గకూడదంటే.. ఈ అలవాట్లు ఈరోజే మొదలుపెట్టండి!
02 August 2026
Rajashekher
కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఏడాదికి ఒకసారి లేదా వైద్యుల సూచన మేరకు కంటి పరీక్షలు చేయించుకోవడం మంచిది.
క్రమం తప్పకుండా కంటి పరీక్షలు..
మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌ను ఎక్కువసేపు ఉపయోగిస్తే కళ్లకు ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి మధ్య మధ్యలో కళ్లకు విశ్రాంతి ఇవ్వండి.
డిజిటల్ స్క్రీన్‌ల వినియోగంలో..
బయటకు వెళ్లేటప్పుడు UV రక్షణ ఉన్న సన్‌గ్లాసెస్ ధరించడం ద్వారా హానికరమైన కిరణాల ప్రభావాన్ని తగ్గించవచ్చు.
సూర్యరశ్మి నుంచి కళ్లను రక్షించండి
ధూమపానం కంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే కళ్లను తాకే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, కాంటాక్ట్ లెన్సులను సరైన విధంగా ఉపయోగించడం అవసరం.
ధూమపానం మానేసి, పరిశుభ్రత..
ఆకుకూరలు, క్యారెట్, చిలగడదుంప, నారింజ, జామ, చేపలు, గుడ్లు, బాదం, వాల్‌నట్ వంటి ఆహారాల్లో ఉండే విటమిన్ A, C, E, ఒమేగా-3, ల్యూటిన్, జెయాక్సాంథిన్ కంటి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
పోషకాహారం తీసుకోండి
శరీరంలో నీటి శాతం సరిపడా ఉంటే కళ్లలో పొడిబారడం తగ్గి, అవి సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
తగినంత నీరు తాగండి
మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు కంటి చూపుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి వాటిని నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం.
దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రణలో..
అకస్మాత్తుగా దృష్టి మసకబారడం, తీవ్రమైన కంటి నొప్పి, ఎరుపు లేదా వాపు, కాంతి చుట్టూ మెరుపులు కనిపించడం, కళ్ల ముందు నల్లటి మచ్చలు.. వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి.