Aadhaar Card: మరణించిన వ్యక్తి ఆధార్ కార్డును నిమిషాల్లోనే డీయాక్టివేట్ చేయొచ్చు.. ఆన్‌లైన్ ద్వారా ప్రాసెస్ సింపుల్.. ఎలానో చూడండి..
ఓ వ్యక్తి మరణిస్తే అతడి ఆధార్ కార్డు ఏమవుతుంది అనే అనుమానం చాలామందికి ఉంటుంది. అతడి ఆధార్ కార్డు యాక్టివ్‌లోనే ఉంటుందా.. లేదా పనిచేయదా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. అయితే ఇలాంటి కార్డులను కేంద్రం తొలగిస్తుంది. ఈ మేరకు రాష్ట్రాల నుంచి డేటా సేకరిస్తోంది.

ఇటీవల ఆధార్ కార్డుల దుర్వినియోగం ఎక్కువగా జరుగుతోంది. మరణించిన వ్యక్తి కార్డులతో దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. మరణించిన వ్యక్తి ఆధార్ యాక్టివ్‌లో ఉండటం వల్ల వాటి ద్వారా సైబర్ మోసాలు జరుగుతున్నాయి. అలాగే వివిధ సంక్షేమ పథకాలను కూడా వాటి ద్వారా పొందటం కొనసాగిస్తున్నారు. అలాగే సదరు వ్యక్తి పేరు మీద ఉన్న ఆర్ధిక లావాదేవీలను దుర్వినియోగం చేసే అవకాశముంది. ఇంతేకాకుండా చనిపోయిన వ్యక్తి ఐడెంటిటీని దొంగలింవచ్చు. ఇలా అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. దీంతో మరణించిన వ్యక్తి ఆధార్‌ను కుటుంబసభ్యులు డీయాక్టివేట్ చేయాలి. సింపుల్‌గా ఆన్‌లైన్ ద్వారా ఈ ప్రాసెస్ చేయవచ్చు. ఎలా అంటే..?
ఇలా డీయాక్టివేట్ చేయండి
-మైఆధార్ వెబ్‌సైట్లోకి వెళ్లండి
-కుటుంబసభ్యుల ఆధార్ నెంబర్, మొబైల్ ఓటీపీతో లాగిన్ అవ్వండి
-హోమ్ పేజీలో కనిపించే రిపోర్ట్ డెత్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెంబర్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
-మరణించిన కుటుంబసభ్యుడి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
-అనంతరం డెత్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి
-డెత్ సర్టిఫికేట్‌ను అప్ లోడ్ చేయండి
-ఆ తర్వాత యూఐడీఏఐ అధికారులు పరిశీలించి ఆధార్ డీయాక్టివేట్ చేస్తారు
ప్రయోజనాలు ఇవే..
మరణించిన వ్యక్తి ఆధార్ డీయాక్టివేట్ చేయడం వల్ల మోసాలకు చెక్ పడుతుంది. అంతేకాకుండా ఆధార్ డేటాబేస్‌లో ఖచ్చితత్వం, పారదర్శకత లభిస్తుంది. ఇక నకిలీ ఆధార్ కార్డులకు చెక్ పడుతుంది. సైబర్ మోసాలకు తావు ఉండదు. డీయాక్టివేట్ చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, ఆధార్ సెంటర్లు చుట్టూ తిరగాల్సిన పని లేదు. పై విధానంలో ఆన్‌లైన్ ద్వారా మీరే డీయాక్టివేట్ చేయవచ్చు. అయితే 16 ఏళ్ల క్రితం ఆధార్ ప్రొగ్రాంను లాంచ్ చేయగా.. 2025 జూన్ నాటికి 142.39 కోట్ల ఆధార్ కార్డులు ఉన్నాయి. అయితే రాష్ట్రాల నుంచి వచ్చిన డేటా ప్రకారం మరణించిన వ్యక్తుల ఆధార్లను డేటా బేస్ నుంచి యూఐడీఏఐ తొలగిస్తుంది. ఇలా లక్షలాది మంది ఆధార్ కార్డులను ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. మృతి చెందని వ్యక్తుల వివరాలను రాష్ట్రాల నుంచి యూఐడీఏఐ ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. ఆ డేటా ఆధారంగా ఆధార్లను తొలగిస్తోంది. సిటిజన్లు కూడా దీనికి సహకరించాలని, కుటుంబసభ్యులు ఎవరైనా మరణిస్తే వారి ఆధార్‌ను ఆన్ లైన్ ద్వారా డీయాక్టివేట్ చేయాలని సూచిస్తోంది. కాగా దేశంలో నివసించే ప్రతీఒక్కరికీ ఆధార్ అనేది తప్పనిసరి డాక్యుమెంట్‌గా మారిపోయింది. బ్యాంక్ అకౌంట్ పొందటం దగ్గర నుంచి సిమ్ కార్డు పొందటం వరకు ప్రతీ పనికి ఆధార్ తప్పనిసరి అయింది. ఇది లేకపోతే ఏ పని జరగడం లేదు. దీంతో ఆధార్‌ను సురక్షితంగా వినియోగించేందుకు ఇటీవల కొత్త ఆధార్ యాప్‌ను కూడా యూఐడీఏఐ లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
