AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మగవాళ్ళను కూడా వదలడం లేదు.. బీకేర్‌ఫుల్.. ఇంటి బయట కూర్చొని ఉంటే వెనుక నుంచి వచ్చి..

వరంగల్‌లో చైన్ స్నాచర్లు బరితెగిస్తున్నారు. మహిళలతో పాటు మగవారినీ టార్గెట్ చేస్తూ బంగారు గొలుసులు లాక్కెళ్తున్నారు. ఒక్కరోజులో మూడు చోట్ల జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించాయి. న్యాయవాది మెడలోని గొలుసును సినీ ఫక్కీలో తెంచుకుపోయిన ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

మగవాళ్ళను కూడా వదలడం లేదు.. బీకేర్‌ఫుల్.. ఇంటి బయట కూర్చొని ఉంటే వెనుక నుంచి వచ్చి..
Warangal Crime
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: May 12, 2026 | 4:48 PM

Share

చైన్ స్నాచింగ్ అనగానే సహజంగా మహిళలు గుర్తుకొస్తారు.. ఒంటరి మహిళల మెడలో బంగారు ఆభరణాలు, పుస్తెలతాళ్లు అపహరించుకుపోయిన ఘటనలు నిత్యం చూస్తున్నాం.. కానీ చైన్ స్నాచర్లు ఇప్పుడు మరింత బరితెగించారు. మగవాళ్ళను కూడా వదలడం లేదు.. మెడలో విలువైన బంగారు గొలుసులుంటే చాలు బరితెగించి తెంచుకుపోతున్నారు.. తాజాగా వరంగల్ లో చైన్ స్నాచర్లు ఓ న్యాయవాది మెడలోని బంగారు గొలుసును తెంచుకుపోయిన ఘటన కలకలం రేపింది.. సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన ఆ చైన్ స్నాచింగ్ దృశ్యాలు అంతా షాక్ అయ్యేలా చేశాయి.. పోలీసులు విచారణ చేపట్టారు.

బంగారం ధరలు పెరిగిపోవడంతో దోపిడీ దొంగలు బరితెగిస్తున్నారు. ఒంటరి మహిళలు, వృద్ధులపై దాడిచేసి మెడలో బంగారు పుస్తెలతాళ్లు తెంచుకుపోతున్నారు. రోజుకో చోట చైన్ స్నాచింగ్స్ మహిళలను హడలెత్తిస్తున్నాయి. అయితే.. మెడలో బంగారు గొలుసులు ఉంటే మహిళలే కాదు మగవారికి కూడా ముప్పు తప్పడం లేదు.. చైన్ స్నాచర్లు మగవారిని కూడా వదలడం లేదు.. తాజాగా వరంగల్ నగరంలో జరిగిన ఈ చైన్ స్నాచింగ్ ప్రతిఒక్కరినీ హడలెత్తిపోయేలా చేసింది.

ఒక్కరోజులోనే వరంగల్ నగరంలో మూడు చైన్ స్నాచింగ్స్ జరిగాయి. పల్సర్ బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు మెడలోని బంగారు గొలుసులు తెంచుకుపోయారు.. రెండు ప్రాంతాల్లో మహిళల మెడలో బంగారు పుస్తెలతాడు అపహరించుకుపోయారు. మరోచోట మగవ్యక్తి మెడలో గొలుసు లాక్కెళ్లారు. కాశిబుగ్గలోని సొసైటీకాలనీ రోడ్ నెంబర్ 3 లో దీపశ్రీ అనేమహిళ బయట పిల్లలకు అన్నం తినిపిస్తున్న క్రమంలో పల్సర్ బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు మెడలో చైన్ లాక్కెళ్లారు. హనుమకొండలోని లోటస్ కాలనీలో మరో ఘటన జరిగింది.. ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలో బంగారు పుస్తెల తాడు లాక్కెళ్లారు.

ఈ మహిళల పుస్తెల తాళ్ళకోసం గాలిస్తున్న క్రమంలో మరో ఘటన జరిగింది. క్రిస్టియన్ కాలనీలో మైదం వివేక్ అనే అడ్వకేట్ మెడలో చైన్ స్నాచింగ్ జరిగింది.. ఇంటి బయట ఒంటరిగా కూర్చున్న ఆయన మెడలోని బంగారు గొలుసును దొంగలు తెంచుకుపోయారు.. వాళ్ళను పట్టుకునే క్రమంలో కిందపడ్డ న్యాయవాదికి గాయాలయ్యాయి.

వరంగల్ నగరంలో జరుగుతున్న వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేవలం గంటల వ్యవధిలోనే మూడుచోట్ల చైన్ స్నాచింగ్స్ జరగడం కలకలం రేపుతోంది.. ఆడవాళ్ళకే కాదు బంగారంతో మగవాళ్ళకు కూడా ముప్పు తప్పడంలేదని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us