June 02, 2026
Subhash
బీఎస్‌ఎన్‌ఎల్ తన యూజర్ల కోసం అద్భుతమైన ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది. తక్కువ ధరల్లో ఎక్కువ వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్స్ ఎన్నో ఉన్నాయి.
ప్రీపెయిడ్ వినియోగదారులకు రూ.51 ప్లాన్‌ను అందిస్తోంది. దీనికి 'స్మార్ట్ స్టార్ట్ ప్లాన్' అని పేరు పెట్టారు. కంపెనీ ఈ ప్లాన్‌ను కేవలం కొత్త కస్టమర్ల కోసం మాత్రమే తెచ్చింది.
మీరు BSNLకు మారాలనుకున్నా లేదా వారి సేవను ట్రయల్ చేయాలనుకున్నా, ఇప్పుడు మంచి అవకాశం.కేవలం రూ. 51 ప్లాన్‌తో రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, ఉచిత SMS సౌకర్యాన్ని అందిస్తోంది.
ఈ బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్‌తో పాటు కస్టమర్లకు ఉచితంగా ఒక సిమ్ కార్డ్ కూడా లభిస్తోంది. ఈ ప్లాన్ ఇతర ప్రయోజనాలను తెలుసుకోండి.
కేవలం 51 రూపాయలతోనే 28 రోజుల పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. ఇందులో అపరిమిత కాలింగ్‌తో పాటు మరెన్నో సదుపాయాలను కూడా అందిస్తోంది.
వినియోగదారులకు ప్రతిరోజూ 2GB మొబైల్ డేటా లభిస్తోంది. ఇది కాకుండా, ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఉచిత SMSలు కూడా లభిస్తాయి. దీని చెల్లుబాటు 28 రోజుల వరకు ఉంటుంది.
ఈ బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్ మే 22, 2026 నుండి జూన్ 30, 2026 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని గమనించండి.
ప్రస్తుత BSNL వినియోగదారులు ఈ రీఛార్జ్ ఆఫర్‌కు అర్హులు కారు. కొత్త కస్టమర్లు మాత్రమే రూ. 51కి సిమ్ కొనుగోలు చేయడం ద్వారా 28 రోజుల పాటు డేటా, అపరిమిత కాలింగ్ ఇతర బెనిఫిట్స్ పొందవచ్చు.