AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీజీపీఎస్సీ బిగ్ అప్డేట్.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఒకేసారి 3 వరుస నోటిఫికేషన్లు విడుదల

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అదిరిపోయే తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE), అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లను విడుదల చేసింది..

టీజీపీఎస్సీ బిగ్ అప్డేట్.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఒకేసారి 3 వరుస నోటిఫికేషన్లు విడుదల
TGPSC Job Notifications
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Jun 02, 2026 | 6:40 PM

Share

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అదిరిపోయే తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE), అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం మూడు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా 290 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు TGPSC సెక్రటరీ ఎం. హరిత ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

టీజీపీఎస్సీ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు ఆన్ లైన్ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇవే..

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) – ఆర్ అండ్ బి శాఖ నోటిఫికేషన్‌

  • మొత్తం ఖాళీలు: 222
  • రోడ్లు, భవనాల శాఖ (Roads & Buildings Department) లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – ఆర్ అండ్ బి శాఖ నోటిఫికేషన్‌

  • మొత్తం ఖాళీలు: 49
  • ఇవి కూడా రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని ఉద్యోగాలే.

అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ నోటిఫికేషన్‌

  • మొత్తం ఖాళీలు: 19
  • తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (Telangana Pollution Control Board) లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు జులై 1, 2026 నాటికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే 44 ఏళ్లకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

టీజీపీఎస్సీ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు ఆన్ లైన్ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముఖ్యమైన తేదీలు

  • AEE (సివిల్) పోస్టులకు జూన్ 06, 2026 నుండి జూలై 13, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • AEE (ఎలక్ట్రికల్) పోస్టులకు జూన్ 08, 2026 నుండి జూలై 15, 2026 వరకు అవకాశం ఉంది.
  • అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టులకు జూన్ 10, 2026 నుండి జూలై 17, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ సందర్శించి ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, సిలబస్, పరీక్షా విధానం వంటి పూర్తి వివరాలతో కూడిన సుదీర్ఘ నోటిఫికేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని కమిషన్ తెలిపింది. ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు ఇదొక సువర్ణావకాశం అని చెప్పవచ్చు.

టీజీపీఎస్సీ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు ఆన్ లైన్ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us