AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పులి గర్వం అణచిన రైతు కథ.. అపాయంలో కండ బలం కంటే తెలివితో ప్రవర్తించాలి

Moral Story in Telugu: బలం ఉన్నవాడే గొప్పవాడు కాదని, తెలివిగా ఆలోచించే వాడే నిజమైన విజేత అని చెప్పే ఆసక్తికరమైన జానపద కథ ఇది. తన శక్తిని చూసుకుని గర్వపడిన పులిని ఓ రైతు చాకచక్యానికి మోసపోయి తెలివి విలువను తెలుసుకుంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో బలానికి మించి బుద్ధి, సమయస్ఫూర్తి ఎంత ముఖ్యమో ఈ కథ చక్కగా వివరిస్తుంది. పిల్లలకు ఇటువంటి నీతి కథలు చెబితే చిన్న తనం నుంచే అపాయంలో ఉపాయంతో ఎలా వ్యవహరించాలో తెలుసుకుంటారు..

పులి గర్వం అణచిన రైతు కథ.. అపాయంలో కండ బలం కంటే తెలివితో ప్రవర్తించాలి
Chandamama Kathalu
Srilakshmi C
|

Updated on: May 31, 2026 | 6:07 PM

Share

ఒక దట్టమైన అడవిలో అనేక జంతువులు ప్రశాంతంగా జీవించేవి. అదే అడవిలో ఒక క్రూరమైన పులి కూడా ఉండేది. అది తన బలాన్ని నమ్ముకొని ఇతర జంతువులను భయపెడుతూ ఉండేది. తన బలం చూసుకుని గర్వంతో విర్రవీగేది.దీంతో అడవిలోని ఇతర జంతువులన్నీ దానికి భయపడేవి. ఒక రోజు పులి అడవి అంచున ఉన్న పొలానికి వెళ్లింది. అక్కడ ఓ రైతు తన ఎద్దుతో కలిసి పొలం దున్నుతుండటం చూసింది. పులికి ఒక సందేహం వచ్చింది. “నాకంటే బలమైన జంతువు ఈ అడవిలో లేదు. అయితే ఈ ఎద్దు ఎందుకు మనిషి మాట వింటోంది?” అని ఆశ్చర్యపోయింది. ఇదే విషయం ఎద్దును అడగగా, “మనిషికి శారీరక బలం కాదు, తెలివి ఉంది. ఆ తెలివితోనే మమ్మల్ని నియంత్రిస్తున్నాడు” అని చెప్పింది.

అది విన్న పులి మరుసటి రోజు గొర్రెలను అడవికి తోలుకు వచ్చిన రైతు దగ్గరకు వెళ్లి, “నీ తెలివి నాకు చూపించు” అని కోరింది. రైతు ప్రమాదాన్ని గ్రహించి చాకచక్యంగా ఆలోచించాడు. “నా తెలివి ఇంట్లో ఉంది. నేను తీసుకొస్తాను అంటాడు. అయితే నేను వెళ్లాక నువ్వు నా గొర్రెల్ని తినేస్తావేమో.. అప్పటివరకు నిన్ను ఈ చెట్టుకు కట్టేస్తాను” అని చెబుతాడు. అందుకు పులి అంగీకరిస్తుంది. రైతు వెంటనే ఒక బలమైన తాడుతో పులిని చెట్టుకు కట్టేసి, తన గొర్రెలను తొలుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత గ్రామస్తులను పిలుస్తాడు. అందరూ వచ్చి పులిని చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు రైతు నవ్వుతూ “ఇదే నా తెలివి. బలంతో కాదు, బుద్ధితోనే ప్రమాదాలను ఎదుర్కోవాలి” అని చెప్పాడు.

తాను మోసపోయానని గ్రహించిన పులి సిగ్గుపడుతుంది. బలం ఉన్నా, సరైన ఆలోచన లేకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదని అర్థం చేసుకుంటుంది. కొంతసేపటి తర్వాత గ్రామస్తులు దానిని అడవిలో వదిలిపెడతారు. ఆ రోజు నుంచి పులి గర్వాన్ని విడిచిపెట్టి జాగ్రత్తగా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది. చివరికి అడవిలోని జంతువులన్నీ కలిసి, శక్తి ఉన్నవాడు గొప్పవాడు కాదని, పరిస్థితులను అర్థం చేసుకొని తెలివిగా వ్యవహరించే వాడే నిజమైన విజేత అని తెలుసుకుంటాయి. పులి కూడా తన అహంకారాన్ని విడిచిపెట్టి ఇతరులతో స్నేహంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తుంది.

నీతి:

కష్టమైన పరిస్థితుల్లో భయపడకుండా, కోపంతో కాకుండా తెలివితో ప్రవర్తిస్తే సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుంది. బలం కంటే బుద్ధి గొప్పది.

Follow Us