AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IAS ట్రిక్కీ ప్రశ్న: ఓ వ్యక్తి 1925లో పుట్టి, 1925లోనే చనిపోయాడు.. అయినా 70 ఏళ్లు బతికాడు! ఇదెలా సాధ్యం?

ఈ కింది ప్రశ్న IAS ఇంటర్వ్యూలో అడిగిన లాజిక్‌ స్టైల్ ట్రిక్ ప్రశ్న. ఈ ప్రశ్న వినగానే చాలామందికి ఇది అసాధ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకే సంవత్సరంలో పుట్టి, అదే సంవత్సరంలో మరణిస్తే వయస్సు 70 ఏళ్లు ఎలా అవుతుందనే సందేహం వస్తుంది. ఈ ట్రిక్కీ ప్రశ్న చాలామందిని కన్‌ఫ్యూజ్ చేస్తుంది. అయితే ఇది లాజిక్ ఆధారిత ప్రశ్న అనే సంగతి మర్చిపోకూడదు. ఇలాంటి లాజిక్ ప్రశ్నలు ఐఏఎస్, యూపీఎస్సీ ఇంటర్వ్యూలలో అభ్యర్థుల ఆలోచనా విధానాన్ని పరీక్షించేందుకు అడుగుతుంటారు..

IAS ట్రిక్కీ ప్రశ్న: ఓ వ్యక్తి 1925లో పుట్టి, 1925లోనే చనిపోయాడు.. అయినా 70 ఏళ్లు బతికాడు! ఇదెలా సాధ్యం?
Brain Teaser
Srilakshmi C
|

Updated on: Jun 01, 2026 | 4:42 PM

Share

ఒక వ్యక్తి 1925లో పుట్టి, 1925లోనే చనిపోయాడు. అయినప్పటికీ మరణించే సమయానికి అతని వయస్సు 70 ఏళ్లు. ఇది ఎలా సాధ్యం?

ఒక వ్యక్తి 19235లో పుట్టి, 1925లోనే చనిపోయాడు. అయినప్పటికీ మరణించే సమయానికి అతని వయస్సు 70 ఏళ్లు.. అంటే ఈ ప్రశ్నలో ఉన్న వ్యక్తి  ‘1925లో పుట్టాడు’, అలాగే ‘1925లో చనిపోయాడు’ అనే వాక్యాలను మనం సహజంగా సంవత్సరంగా భావిస్తాం. కానీ అక్కడ 1925 అనేది ఒక సంఖ్య మాత్రమే. దానిని సంవత్సరంగా అర్థం చేసుకోవడం వల్లే గందరగోళం ఏర్పడుతుంది. ఇలాంటి ప్రశ్నలను IAS, UPSC వంటి పోటీ పరీక్షల ఇంటర్వ్యూలలో అభ్యర్థుల తార్కిక ఆలోచన, పరిశీలనా శక్తి, ప్రశ్నను ఎలా అర్థం చేసుకుంటారో పరీక్షించడానికి అడుగుతుంటారు. సరైన సమాధానం తెలుసుకోవడానికి ప్రశ్నలోని ప్రతి పదాన్ని జాగ్రత్తగా విశ్లేషించాలి.

ఎక్కువ మంది చదివినది: ‘1000లో నుంచి 100 తీసేస్తే ఎంత ఉంటుంది?’ మీ IQకి అగ్నిపరీక్ష.. లాజిక్ కనిపెట్టగలరా ..

దీనికి సమాధానం ఏమిటంటే..

ఇక్కడ ఇచ్చిన 1925 అనేది సంవత్సరం కాదు.. అది ఒక గది నంబర్ లేదా ఇంటి నంబర్ లేదా ఆసుపత్రి గది నెంబర్‌ కూడా కావచ్చు. ఆ వ్యక్తి 1925 నంబర్ గదిలో జన్మించాడు. జీవితాంతం జీవించిన తర్వాత 70 సంవత్సరాల వయస్సులో మళ్లీ అదే 1925 నంబర్ గదిలో మరణించాడు. అంటే 1925 అనేది సంవత్సరం కాదు. అది గది లేద ఇంటి నంబర్ అన్నమాట. అందువల్ల ఆ వ్యక్తి 70 ఏళ్లు జీవించి 1925 నంబర్ గదిలోనే జన్మించి అదే నంబర్ గదిలో మరణించాడు. కాబట్టి అతని వయస్సు 70 సంవత్సరాలు కావడంలో ఈ ప్రశ్నలో ఎలాంటి విరుద్ధత లేదు.

ఇవి కూడా చదవండి

ఎక్కువ మంది చదివినది: ‘1000లో నుంచి 100 తీసేస్తే ఎంత ఉంటుంది?’ మీ IQకి అగ్నిపరీక్ష.. లాజిక్ కనిపెట్టగలరా ..

1925 అనే సంఖ్యను చూసి చాలా మంది దాన్ని సంవత్సరం అని భావిస్తారు. అలా భావిస్తే ఒకే సంవత్సరంలో పుట్టి చనిపోయి 70 ఏళ్లు జీవించడం అసాధ్యం. కానీ ప్రశ్నలో 1925 అనేది సంవత్సరం అని ఎక్కడా చెప్పలేదు. అది ఒక ఇంటి నంబర్, గది నంబర్ లేదా ఆసుపత్రి గది నంబర్ కావచ్చు. అందువల్ల ఆ వ్యక్తి 70 ఏళ్లు జీవించి 1925 నంబర్ గదిలోనే మరణించాడని అర్థం. ఇంటర్వ్యూ లేదా ఎగ్జాంలలోనూ ఇలాంటి తార్కిక ప్రశ్నలు అడుగుతారు. ఇటువంటి ప్రశ్నలను జాగ్రత్తగా చదివి ఆన్సర్‌ ఇవ్వాలేగానీ.. అందులో చెప్పని విషయాలను ఊహించకూడదు. ఈ ట్రిక్కీ క్వశ్చన్‌ను మీ ఫ్రెండ్స్‌ను సరదాగా అడిగి చూడండి. ఎంత మంది ఆన్సర్ కరెక్ట్‌గా చెబుతారో చూద్దాం..

Follow Us