అన్ని వ్యాధులకు ఇదొక్కటే మందు.. సర్వరోగ నివారిణి!

02 June 2026

Jyothi Gadda

బొప్పాయి ఆకులలో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ A, C, E లు పుష్కలంగా నిండి వున్నాయి. 

ఎముకలను బలంగా ఉంచే విటమిన్ K, బాడీకి ఎనర్జీ ఇచ్చే B విటమిన్లు ఇందులో ఉంటాయి. అలాగే కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి.

బొప్పాయి ఆకుల్లో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో వచ్చే నొప్పులు, దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి.

యాంటీఆక్సిడెంట్స్ బూస్ట్: శరీర కణాలను డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి ఈ టీ లోని యాంటీఆక్సిడెంట్లు సహాయపడతాయి. ఇది గుండె జబ్బులు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్ల రిస్క్‌ను తగ్గిస్తుంది.

బ్లడ్ షుగర్ నియంత్రణ: ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడం ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ సమతుల్యంగా ఉంచడంలో బొప్పాయి ఆకు రసం చాలా బాగా తోడ్పడుతుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: బొప్పాయి ఆకుల్లో పపైన్ (Papain) అనే ప్రత్యేక ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను సులభంగా బ్రేక్ చేసి కడుపు ఉబ్బరం, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

లివర్ డిటాక్స్, చర్మ సౌందర్యం: ఇందులో ఉండే అసిటోజెనిన్స్ అనే సమ్మేళనాలు లివర్ పనితీరును మెరుగుపరిచి బాడీని డిటాక్స్ చేస్తాయి. అంతేకాక కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని యంగ్‌గా, ముడతలు లేకుండా ఉంచుతాయి.

బొప్పాయి ఆకులను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా  నీటిలో వేయాలి. నీరు గ్రీన్ కలర్‌లోకి మారే వరకు 10-15 నిమిషాలు సిమ్‌లో మరిగించాలి. తర్వాత వడకట్టి, ఒక స్పూన్ తేనె లేదా నిమ్మరసం కలుపుకుని తాగవచ్చు.