దానిమ్మ ఆరోగ్యానికి వరమే.. కానీ, ఈ రోగులకు మాత్రం శాపం!
15 May 2026
Jyothi Gadda
దానిమ్మ పండును ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి, రోగనిరోధక శక్తిని పటిష్టం చేయడానికి దీనిని మించిన పండు లేదు.
కానీ, కొన్ని నిర్దిష్ట అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు దానిమ్మ తినడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది.
దానిమ్మ ఎవరికి హానికరం?
తక్కువ రక్తపోటు: దానిమ్మ రక్తపోటును తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. లో-బీపీతో బాధపడుతూ మందులు వాడుతున్న వారు దానిమ్మకు దూరంగా ఉండాలి.
మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు దానిమ్మకు దూరంగా ఉండటం మంచిది. ఇందులో ఉండే అధిక పొటాషియం కిడ్నీలపై భారం పెంచుతుంది.
థైరాయిడ్ సమస్య: థైరాయిడ్ మందులు వాడుతున్న వారు దానిమ్మ పండు లేదా దాని రసాన్ని తీసుకున్నప్పుడు, అది మందుల శోషణపై ప్రభావం చూపుతుంది.
జీర్ణ సమస్యలు, అలర్జీ: కొంతమందికి దానిమ్మ పండు తింటే చర్మంపై దద్దుర్లు, దురద లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగవచ్చు.
దానిమ్మ పండును ఒక సూపర్ ఫుడ్ అని పిలుస్తాము, కానీ అది మన శరీర తత్వానికి సరిపోతుందో లేదో చూసుకోవాలి. లేదంటే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
దానిమ్మ పండును ఒక ఔషధ గనిగా భావిస్తారు. ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గించి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.