పిల్లి ఎదురొస్తే నిజంగానే అశుభమా? అసలు రహస్యం ఏంటి?

02 jun 2026

Anand T

ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి దారికి అడ్డంగా వస్తే.. అది అశుభ శకునమని, వెళ్లే పని సరిగ్గా జరగదని చాలామంది నమ్ముతుంటారు.

జ్యోతిష్యం ప్రకారం పిల్లిని రాహు, కేతువుల నీడగా పరిగణిస్తారు. అందుకే పిల్లి సడెన్‌గా ఎదురొస్తే పనిలో ఆటంకాలు లేదా ప్రతికూలత  ఎదురవుతాయని కొందరి నమ్మకం.

నిజానికి ఈ నమ్మకం వెనుక ఒక బలమైన పాతకాలపు కారణం ఉంది. పూర్వ కాలంలో రవాణా సౌకర్యాలు లేనప్పుడు ప్రజలు రాత్రి వేళల్లో గుర్రాలు, ఎద్దుల బండ్లపై ప్రయాణించేవారు.

ఆ రోజుల్లో రోడ్లు చాలా నిర్మానుష్యంగా, చీకటిగా ఉండేవి. అలాంటప్పుడు పిల్లి లాంటి చిన్న జంతువులు అకస్మాత్తుగా అడ్డం వస్తే ప్రయాణంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండేది.

ముఖ్యంగా రాత్రి వేళల్లో పిల్లి కళ్లు చీకట్లో వింతగా మెరుస్తాయి. దీన్ని చూసి గుర్రాలు, ఎద్దులు భయపడి పక్కకు తప్పుకోవడమో లేదా బండిని పడేయడమో చేసేవి.

జంతువులు భయపడకుండా ఉండటానికి, అలాగే ఆ పిల్లి వెనుక ఏదైనా పెద్ద క్రూర జంతువు వస్తుందేమోనని కాసేపు ఆగి, ఆ తర్వాత ప్రయాణం సాగించేవారు.

కాలక్రమేణా వాహనాలు మారిపోయాయి, రోడ్లపై లైట్లు వచ్చాయి. కానీ ఆనాడు ప్రాణరక్షణ కోసం కాసేపు ఆగడం అనే అలవాటు.. కాలక్రమేణా పిల్లి ఎదురొస్తే అశుభం అనే మూఢనమ్మకంగా మారిపోయింది.

ధార్మిక గ్రంథాల ప్రకారం పిల్లి చాలా అప్రమత్తంగా, రహస్య స్వభావంతో ఉంటుంది. అది అకస్మాత్తుగా ఎదురవడం అంటే మనిషిని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండమని చేసే హెచ్చరిక మాత్రమే, అంతే తప్ప అది అశుభం కాదు.