AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.9 కోట్లు పెడితే ఏకంగా రూ. 40కోట్లకు పైగా వసూల్ చేసిన సినిమా.. కథ అదిరిపోతుంది

ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తుంది.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. ఇటీవల తెరకెక్కిన సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేదు. అన్ని సినిమాలు మూడు నాలుగు భాషల్లో విడుదలవుతున్నాయి.

రూ.9 కోట్లు పెడితే ఏకంగా రూ. 40కోట్లకు పైగా వసూల్ చేసిన సినిమా.. కథ అదిరిపోతుంది
Movie
Rajeev Rayala
|

Updated on: Jun 02, 2026 | 6:45 PM

Share

ఇటీవలే కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాలను అందుకుంటున్నాయి. పెద్ద పెద్ద సినిమాలు విడుదలవుతున్నప్పటికీ అన్ని సినిమాలు థియేటర్ లో పెద్దగా విజయాలను అందుకోలేకపోతున్నాయి. అదే సమయంలో చిన్న సినిమాలు థియేటర్స్ లో విడుదలై హిట్స్ అందుకుంటున్నాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాయి. కొన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతున్నాయి. వాటిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా కూడా అదే లిస్ట్ లోకి వస్తుంది. ఈ సినిమా తెరకెక్కింది. కేవలం రూ. 9కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ మూవీ ఏకంగా రూ. 40కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.?

చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయిన సినిమాల్లో మరాఠీలో విడుదలైన దేవూల్‌ బంద్‌ 2 సినిమా ఒకటి. ఇటీవలే విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు మరాఠీలో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే రూ. 40కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ సినిమా.. డైరెక్టర్ ప్రవీణ్ తార్డే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మొదటి షో నుంచే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. స్నేహల్ తార్డే, సీనియర్ నటుడు మోహన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కథ విషయానికొస్తే..  ఈ సినిమా కథ కష్టజీవి అయిన మహిళా రైతు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆమె రోజు ఎన్నో కష్టాలు బాధలను అనుభవిస్తూ ఉంటుంది.. రోజు దేవుడిని వేడుకుంటుంది..  కానీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురై, నది సమీపంలోని ఒక చీమల పుట్టపై రాయి విసురుతుంది. ఆ సమయంలో  శ్రీస్వామి సమర్థ్ ప్రత్యక్షం అవుతాడు. ఆమె స్వామివారిని తన గ్రామానికి తీసుకువస్తుంది. అయితే, ఆ స్వామి కేవలం స్నేహల్‌కు మాత్రమే కనిపిస్తూ, మాట్లాడుతుంటారు. దాంతో ఊర్లో ఉన్నవారు ఆమెకు పిచ్చిపట్టిందనుకుంటారు’.. ఆతర్వాత ఏం జరిగింది.? ఆతర్వాత ఆమె జీవితం ఎలా మారింది అనేది సినిమాలో చూడాల్సిందే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us