AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్ది ఇండస్ట్రీకి ఆక్సిజన్‌లాంటి సక్సెస్.. చరణ్ కష్టానికి హ్యాట్సాఫ్ : అనిల్ రావిపూడి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘పెద్ది’. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 04న విడుదలైన పెద్ది సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

పెద్ది ఇండస్ట్రీకి ఆక్సిజన్‌లాంటి సక్సెస్.. చరణ్ కష్టానికి హ్యాట్సాఫ్ : అనిల్ రావిపూడి
Peddi
Rajeev Rayala
|

Updated on: Jun 24, 2026 | 6:36 AM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. 2026 సౌత్ ఇండియా నంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా మేకర్స్ పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ ని నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, టీమ్ సభ్యులకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ చేతుల మీదుగా షీల్డ్స్ బహుకరించారు. అలాగే ఈ వేడుకగా అనిల్ రావిపూడి గెస్ట్ గా హాజరయ్యారు .

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ముందుగా పెద్ది చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి గారు మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంతో సందడి చేస్తే, సరిగ్గా నాలుగు నెలల తర్వాత రామ్ చరణ్ గారు ‘మస్సా మస్సా’ అంటూ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఇది ఇండస్ట్రీకి ఆక్సిజన్‌లాంటి సక్సెస్. థియేటర్లు మళ్లీ ప్రేక్షకులతో కళకళలాడేలా చేసింది. అందుకు చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ అభినందనలు.రెహమాన్ గారు అద్భుతమైన పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కూడా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. మిగతా సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరూ అద్భుతంగా పనిచేశారు అని అన్నారు.

అలాగే బుచ్చిబాబు లాంటి దర్శకుడు ఇలాంటి సబ్జెక్ట్‌ను ఇంత స్టార్‌డమ్ ఉన్న హీరోతో చేయడం మామూలు విషయం కాదు. ఆయన నమ్మిన కథకు ప్రేక్షకులు ఇంత పెద్ద విజయాన్ని అందించడం చాలా గొప్ప విషయం. మెగాస్టార్ చిరంజీవి గారి రాకతో ఈ విజయోత్సవం మరింత పరిపూర్ణమైంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ గారు ఎంతో కష్టపడ్డారు. కొండలు ఎక్కారు, కండలు పిండారు, దుమ్ములో దొర్లారు… చివరికి బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్ము లేపారు. సినిమాలో ఒక పోస్టర్ ఉంది. అది చూస్తే నాకు హనుమంతుడు గుర్తొచ్చారు. ఆ స్థాయిలో ఆ పాత్రను ఆయన తెరపై ఆవిష్కరించారు. నిజంగా రామ్ చరణ్ గారికి హ్యాట్సాఫ్. పెద్ది పాత్రలో ‘తండ్రికి మించిన తనయుడు’ అన్నట్టుగా అద్భుతంగా నటించారు. ఆయనకు మరిన్ని గొప్ప విజయాలు రావాలని కోరుకుంటున్నాను. అలాగే నిర్మాత సతీష్ గారు చేసిన తొలి చిత్రమే ఇంత భారీ విజయాన్ని సాధించడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us