AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రై ఫ్రూట్స్ ఇలా తింటే అమృతం కాదు విషం.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

డ్రై ఫ్రూట్స్ అంటేనే పోషకాల పవర్ హౌస్. శరీరానికి కావలసిన విటమిన్లు, ప్రోటీన్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తినడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేడి వాతావరణంలో వీటిని నేరుగా తింటే శరీరంలో ఏం జరుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

డ్రై ఫ్రూట్స్ ఇలా తింటే అమృతం కాదు విషం.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..
Side Effects Of Dry Fruits
Krishna S
|

Updated on: Jun 24, 2026 | 6:55 AM

Share

జీడిపప్పు, బాదం, వాల్‌నట్‌లు, ఖర్జూరాలు.. ఇలా డ్రై ఫ్రూట్స్ అనగానే మనకు గుర్తొచ్చేది బోలెడంత ఆరోగ్యం. శరీరానికి కావలసిన విటమిన్లు, ప్రోటీన్లు, విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఖనిజాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తినడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో వీటిని తినేటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకపోతే శరీరంలో తీవ్రమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆశా ఆయుర్వేదకు చెందిన ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చంచల్ శర్మ అభిప్రాయం ప్రకారం.. డ్రై ఫ్రూట్స్‌కు సహజంగానే వెచ్చదనాన్ని ఇచ్చే గుణం ఉంటుంది. అందుకే వీటిని చలితాకాలంలో ఎక్కువగా తీసుకుంటారు. అయితే వేసవి కాలంలో వీటిని పొడిగా లేదా నేరుగా తినడం వల్ల శరీరంలో పైత్య రసం అసమతుల్యతకు గురవుతుంది. దీనివల్ల ముఖంపై మొటిమలు రావడం, కడుపులో అసౌకర్యం లేదా మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎండ ఎక్కువున్న రోజుల్లో 20 నుండి 30 గ్రాములకు మించి డ్రై ఫ్రూట్స్ తీసుకోకూడదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఈ కాలంలో వీటిని తినే ముందు కచ్చితంగా నానబెట్టాలి. అలా నానబెట్టడం వల్ల వాటిలో ఉండే ఫైటిక్ యాసిడ్ తొలగిపోయి, శరీరంలో అధిక వేడి ఉత్పత్తి కాకుండా ఉంటుంది. అంతేకాదు పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి.

శరీరంలో సెగలు పుట్టించే ఘాటైన డ్రై ఫ్రూట్స్ ఇవే..

ఎండిన ఖర్జూరాలు: ఇవి శరీరానికి విపరీతమైన వేడిని కలిగిస్తాయి. చలికాలంలో జలుబు, కీళ్ల నొప్పుల నివారణకు ఇవి అద్భుతంగా పనిచేస్తాయి కానీ వేసవిలో నేరుగా తింటే శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోతుంది.

వాల్‌నట్స్: మెదడుకు ఎంతో మేలు చేసే వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, భార లోహాలు ఉంటాయి. వీటిని జీర్ణం చేసుకోవడానికి శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. తద్వారా ఒంట్లో వేడి పెరుగుతుంది.

నానబెట్టని బాదం పప్పులు: ఎండిన లేదా వేయించిన బాదం పప్పులు వేడి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వేసవిలో వీటిని నానబెట్టకుండా తింటే కడుపులో మంట, ఎసిడిటీ రావచ్చు.

పిస్తా పప్పులు: ఇవి వగరు, వేడి గుణాన్ని కలిగి ఉండి చలికాలంలో కఫం, జలుబు నుండి కాపాడతాయి. కానీ వేసవిలో వీటి వినియోగాన్ని చాలావరకు పరిమితం చేయాలి.

వేసవిలో డ్రై ఫ్రూట్స్ తినడానికి సరైన ఆయుర్వేద పద్ధతి

ఈ డ్రై ఫ్రూట్స్ వేడి చేసే గుణం ఉన్నవే అయినా, వీటిని తినడానికి చలికాలం వరకు ఆగాల్సిన పనిలేదు. వేసవిలో కూడా వీటిని కొన్ని పద్ధతుల్లో తింటే శరీరానికి చల్లదనం లభిస్తుంది.

నానబెట్టిన బాదం: బాదంపప్పులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే తొక్క తీసి తినాలి. వీటిలోని విటమిన్ ఇ ఎండ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటుంది.

నానబెట్టిన ఎండుద్రాక్షలు: వేసవి కాలంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా ఒంటిని చల్లబరుస్తాయి.

జీడిపప్పు – ఖర్జూరాలు: వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ పొడిగా తినకూడదు. రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది.

మఖానా: మఖానాకు సహజంగానే చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. ఇది వేసవిలో పెరిగే పైత్యరసాన్ని శాంతపరిచి, కడుపులో మంటను నివారిస్తుంది.

కాబట్టి ఎండలు ఎక్కువున్నప్పుడు డ్రై ఫ్రూట్స్‌ను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే తినడం అలవాటు చేసుకుంటే జీర్ణశక్తి బలపడటమే కాకుండా వేసవి తాపం నుండి కూడా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

(గమనిక: ఈ సమాచారం ఆయుర్వేద నిపుణుల సూచనల ప్రకారం అందించబడింది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా అలర్జీలు ఉన్నవారు వైద్యులను సంప్రదించడం మంచిది).

Follow Us
బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన ధరలు
బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన ధరలు
డ్రై ఫ్రూట్స్ ఇలా తింటే అమృతం కాదు విషం.. ఈ విషయాలు కచ్చితంగా..
డ్రై ఫ్రూట్స్ ఇలా తింటే అమృతం కాదు విషం.. ఈ విషయాలు కచ్చితంగా..
ఇంటర్ అర్హత.. అంగన్‌వాడీల్లో 16 వేల ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు
ఇంటర్ అర్హత.. అంగన్‌వాడీల్లో 16 వేల ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు
పెద్ది ఇండస్ట్రీకి ఆక్సిజన్‌లాంటి సక్సెస్..
పెద్ది ఇండస్ట్రీకి ఆక్సిజన్‌లాంటి సక్సెస్..
ఒకప్పుడు సమోసాలు అమ్మాడు.. ఇప్పుడు12,490 కోట్ల ఆస్తులున్న హీరో
ఒకప్పుడు సమోసాలు అమ్మాడు.. ఇప్పుడు12,490 కోట్ల ఆస్తులున్న హీరో
భారత్-అమెరికా-మధ్య ఆసియా సహకారానికి కొత్త దారులు.. కీలక భేటీ
భారత్-అమెరికా-మధ్య ఆసియా సహకారానికి కొత్త దారులు.. కీలక భేటీ
విపరీత వేడి వల్ల యూరిన్ రాని వాళ్ళు తినాల్సిన ఆకుల వడలు..
విపరీత వేడి వల్ల యూరిన్ రాని వాళ్ళు తినాల్సిన ఆకుల వడలు..
జూన్ 24 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు!
జూన్ 24 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు!
ఐర్లాండ్ పోరులో ఆ ఇద్దరు యువకులు అరంగేట్రం..!
ఐర్లాండ్ పోరులో ఆ ఇద్దరు యువకులు అరంగేట్రం..!
రీల్స్ పిచ్చి తెచ్చిన ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు..!
రీల్స్ పిచ్చి తెచ్చిన ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు..!