నేటి కాలంలో ఫ్యాటీ లివర్ సమస్య సర్వాంతర్యామిగా మారింది. రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు కూడా కాలేయ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తాయి
TV9 Telugu
నేటి కాలంలో ఫ్యాటీ లివర్ సమస్య సర్వాంతర్యామిగా మారింది. రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు కూడా కాలేయ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తాయి
TV9 Telugu
కాఫీ తాగే వ్యక్తుల్లో ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే ప్రమాదం తక్కువగా ఉండటంతోపాటు, ఇప్పటికే ఈ సమస్య ఉన్నవారిలో వ్యాధి పురోగతి నెమ్మదిగా సాగుతుందట
TV9 Telugu
అలాగే కాలేయంలో మచ్చలు ఏర్పడే ఫైబ్రోసిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా కాఫీ ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
కాఫీ కాలేయానికి మేలు చేసే ప్రధాన కారణం దీనిలో ఉండే సహజ సమ్మేళనాలే. ముఖ్యంగా క్లోరోజెనిక్ యాసిడ్, కెఫిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపులను తగ్గిస్తాయి
TV9 Telugu
కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు వాపును నియంత్రించడం, జీవక్రియలను మెరుగుపరచడం ద్వారా కాలేయ ఆరోగ్యానికి పరోక్షంగా మద్దతు ఇస్తాయి
TV9 Telugu
అందుకే బ్లాక్ కాఫీని లివర్-ఫ్రెండ్లీ పానీయంగా పరిగణిస్తారు. అయితే కాఫీ మాత్రమే ఫ్యాటీ లివర్ సమస్యకు పరిష్కారం కాదని తెలుసుకోవాలి
TV9 Telugu
ముఖ్యంగా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మధుమేహం వంటి కారణాలతో ముడిపడి ఉంటుంది