May 7, 2026
Subhash
70 రోజుల పాటు నిశ్చింతగా ఉండండి. సాధారణంగా ప్రైవేట్ కంపెనీలు 28 లేదా 56 రోజుల వ్యాలిడిటీ ఇస్తుంటే, BSNL ఏకంగా 70 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.
ఈ ప్లాన్ ద్వారా దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా లోకల్, ఎస్టీడీ (Local & STD) కాల్స్ పూర్తిగా ఉచితంగా మాట్లాడుకోవచ్చు.
ఇంటర్నెట్ ఎక్కువగా వాడే వారికి ఇది వరం. ప్రతిరోజూ 3GB డేటా చొప్పున మొత్తం 210GB డేటా ఈ ప్లాన్ ద్వారా లభిస్తుంది. ఇంటర్నెట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఈ ప్లాన్ తీసుకున్న వినియోగదారులకు డేటా, కాలింగ్‌తో పాటు, ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎమ్ఎస్‌ల సౌకర్యం కూడా ఉంది.
197 రూపాయలు రీఛార్జ్ చేస్తే పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. రోజువారీ ఖర్చు పరంగా చూస్తే ఇది చాలా తక్కువ. ఈ ప్లాన్ తీసుకుంటే ఎంతో బెనిఫిట్స్ ఉంటాయి.
సెకండరీ సిమ్ వాడుతున్నారా? తక్కువ ఖర్చుతో తమ సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి, ఎక్కువ డేటా కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
దేశవ్యాప్తంగా BSNL తన 4G సేవలను వేగంగా అందుబాటులోకి తెస్తోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. స్వదేశీ టెక్నాలజీలో 4జీ సేవలను మరింతగా విస్తరిస్తోంది.
మీరు BSNL యూజర్ అయితే ఈ ప్లాన్ మీకు గొప్ప ఎంపిక. మరిన్ని వివరాల కోసం BSNL సెల్ఫ్ కేర్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.