పెద్ద మోసం.. జాగ్రత్త స్టార్ హీరో హెచ్చరిక
సోషల్ మీడియాలో మోసాలు పెరుగుతున్నాయి. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ పేరుతో కొందరు అమాయకులను మోసం చేస్తున్నారని నటుడు శివకార్తికేయన్ హెచ్చరించారు. నటీనటుల ఎంపికకు తమ సంస్థ ఎవరినీ నియమించలేదని స్పష్టం చేశారు. కేవలం అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చే ప్రకటనలనే నమ్మాలని, నకిలీ ప్రచారాలను పట్టించుకోవద్దని, మోసగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.
సోషల్ మీడియాలో మోసాలు నానాటికి పెరిగిపోతున్నాయే తప్ప.. తగ్గడం లేదు. ప్రముఖుల పేర్లతోనో, సంస్థల పేరుతోనో కొందరు ఇప్పటికీ మోసాలకు పాల్పడుతున్నారు.అమాయకుల డబ్బులను కాజేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి మోసమే.. హీరో శివకార్తికేయన్ ప్రొడక్షన్ పేరుతో జరిగింది. దీంతో ఈ హీరో రంగంలోకి దిగి.. అందర్నీ హెచ్చరించాడు. 2018లో శివకార్తికేయన్ SK ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి, పలువురు నూతన దర్శకులకు అవకాశాలు కల్సిస్తూ చిత్రాలను నిర్మిస్తున్నారు. అదేవిధంగా మంచి కథలతో రూపొందిన చిన్న చిత్రాలను విడుదల చేస్తున్నారు.ప్రస్తుతం అమ్మాముత్తు సూర్య డైరెక్షన్లో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాల్లో ఉండగానే.. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్న విషయం శివకార్తికేయన్ దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన ఆయన మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో తమ సంస్థ నిర్మించే చిత్రాల కోసం నటీనటులను ఎంపిక చేయడానికి దర్శకులనో, నిర్వాహకులనో, కాస్టింగ్ ఏజెంట్‌లనో, మరెవరినో ఏర్పాటు చేయమన్నారు. కాబట్టి ఎస్‌కే ప్రొడక్షన్స్ పేరుతో విడుదలయ్యే వివరాలతో కూడిన ప్రకటనలను తమ అధికారిక సామాజిక మాధ్యమాలతో ద్వారానే వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇతర ఏ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దని శివకార్తికేయన్ పేర్కొన్నారు. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ పేరును మోసపూరితంగా ఉపయోగిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విజయ్ CM అయిన వేళ..త్రిషకు రూ. 12 కోట్ల జాక్ పాట్
TOP 9 ET: CM అయ్యారేమో కానీ.. అక్కడ మాత్రం ఓడిపోయారు..! | లైన్ క్లియర్ అవ్వలే
Trisha Tattoo: త్రిష చేతిపై ఉన్న టాటూకు.. విజయ్‌కు సంబంధం ఏంటి ??
Trisha: ‘ప్రేమ ఎప్పుడూ గొప్పదే..’ అంటూ త్రిష క్రేజీ ట్వీట్ !!
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు
ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !
ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు
భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పాము..
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత

