AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లి దండ్రులకు కర్మకాండలు చేయలేకపోయా..! బంధువులందరూ తిట్టారు.. ఎమోష్నల్ అయిన హీరో

చాలా మంది హీరోలు కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత హీరోలుగా అవకాశాలు అందుకున్నారు. వారిలో ఈ హీరో ఒకరు. నటుడిగా కేరీర్ మొదలుపెట్టిన ఆతను ఆతర్వాత హీరోగా సక్సెస్ అయ్యాడు. వరుసగా విజయాలను అందుకుంటూ రాణిస్తున్నాడు.

తల్లి దండ్రులకు కర్మకాండలు చేయలేకపోయా..! బంధువులందరూ తిట్టారు.. ఎమోష్నల్ అయిన హీరో
Hero
Rajeev Rayala
|

Updated on: Apr 17, 2026 | 10:11 AM

Share

సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంత ఈజీ కాదు. ఎంతో మంది సినిమాల్లో నటించాలని, తగిన గుర్తింపు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలను చూసి ఆతర్వాత హీరోలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. ఇంట్లో చెప్పాపెట్టకుండా సినిమాల పై పిచ్చితో పారిపోయి వచ్చిన వారు కూడా ఉన్నారు. అలాగే సినిమాపై ఇష్టంతో ఇంటికి వెళ్లకుండా ఇక్కడే కష్టపడుతున్న వారు ఎందరో ఉన్నారు. ఈ రంగుల ప్రపంచం లో అందరూ సక్సెస్ కాలేరు.. కానీ సక్సెస్ అయినా వారు మాత్రం ఎంతో మందికి ఆదర్శం అవుతారు. ఒక చిరంజీవి, ఒక నాని, ఒక రవితేజ ఇలా స్వయం కృషితో ఇండస్ట్రీలో పైకి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో హీరో చేరిపోయాడు. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కున్నాడు.

Srihari: ఆ హీరో ఫైట్స్ చేస్తుంటే భయమేసేది.. అందుకే అతని బాధ్యత తీసుకున్నా..!

ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. తల్లి దండ్రులకు కర్మకాండలు కూడా చేయలేకపోయా అంటూ ఆ హీరో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ హీరో ఎవరో కాదు.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తిరువీర్. 2016లో వచ్చిన బొమ్మల రామారం సినిమాలో మల్లేష్ పాత్రతో నటుడిగా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు తిరువీర్.  ఆ తరువాత ఘాజీ లో దగ్గుబాటి రానా పక్కన డెప్త్ కంట్రోలర్,  ఏ మంత్రం వేసావె లో హరి, శుభలేఖ+లు పరిమళ్ పాత్రలలో నటించాడు.

ఇవి కూడా చదవండి

అదంతా అబద్దం.. చక్రీ చనిపోవడానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన రఘు కుంచె

2022 సంవత్సరం తిరువీర్ నటనాజీవితంలో మైలురాయిలాంటింది. ఈ సంవత్సరం తిరువీర్ హీరోగా నటించిన తొలి సినిమా మసూద విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. 2023లో తిరువీర్ హీరోగా రెండవ సినిమా పరేషాన్ విడుదలయింది. ఆతర్వాత ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు పాపం ప్రతాప్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో తిరువీర్ మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యాడు. సినిమా కంటిన్యూటీల కారణంగా నేను నా తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలకు హాజరుకాలేకపోయాను అని తెలిపారు. బొమ్మల రామారం చేస్తున్నప్పుడు తన తండ్రి, పలాస చేస్తున్నప్పుడు తన తల్లి చనిపోయారని తిరువీర్ చెప్పాడు. ఇద్దరికీ కర్మకాండలు చేయకేలకపోయా.. అది నన్ను ఎప్పటికీ వెంటాడుతుంది. ఒక్కగాను ఒక్క కొడుకైనా తలిదండ్రులకు కర్మకాండ చేయలేకపోయా అంటూ బంధువులందరూ తిట్టారు అని ఎమోషనల్ అయ్యాడు తిరువీర్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సచిన్‌తో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయణం.. అప్పట్లో తెగ చక్కర్లు.. అసలు విషయం చెప్పిన నటి

View this post on Instagram

A post shared by ETV Win (@etvwin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తక్కువ ధరలో ట్రిగ్గర్‌‌ ట్రేజ్‌2 వైర్‌‌లెస్‌ ఇయర్‌‌ బడ్స్‌
తక్కువ ధరలో ట్రిగ్గర్‌‌ ట్రేజ్‌2 వైర్‌‌లెస్‌ ఇయర్‌‌ బడ్స్‌
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు! వాస్తు ప్రకారం పెంచకూడనివి
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు! వాస్తు ప్రకారం పెంచకూడనివి
మీతో పాటు ట్రైన్‌లో సైకిల్ తీసుకెళ్లవచ్చా..? లగేజీ రూల్స్
మీతో పాటు ట్రైన్‌లో సైకిల్ తీసుకెళ్లవచ్చా..? లగేజీ రూల్స్
బడ్జెట్‌లో స్మార్ట్‌వాచ్‌ నాయిస్‌ఫిట్‌ హలో లిమిటెడ్ ధర ఎంతంటే
బడ్జెట్‌లో స్మార్ట్‌వాచ్‌ నాయిస్‌ఫిట్‌ హలో లిమిటెడ్ ధర ఎంతంటే
 ఇరుముడి' చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
 ఇరుముడి' చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
SLBC టన్నెల్‌లో బిగ్ ప్రోగ్రెస్.. షీర్ జోన్ దాటేశారు.
SLBC టన్నెల్‌లో బిగ్ ప్రోగ్రెస్.. షీర్ జోన్ దాటేశారు.
శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎస్27 అల్ట్రా స్మార్ట్‌ఫోన్.. స్పెషాలిటీస్
శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎస్27 అల్ట్రా స్మార్ట్‌ఫోన్.. స్పెషాలిటీస్
88 నోబాల్స్.. టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే చెత్త రికార్డ్
88 నోబాల్స్.. టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే చెత్త రికార్డ్
తెలంగాణలో మరో కొత్త పథకం.. ఉచితంగా పంపిణీ..
తెలంగాణలో మరో కొత్త పథకం.. ఉచితంగా పంపిణీ..
లావా నుంచి విరాట్ V1 ప్రో 5జీ.. కొత్త మొబైల్​ ఫీచర్లు ఇవే
లావా నుంచి విరాట్ V1 ప్రో 5జీ.. కొత్త మొబైల్​ ఫీచర్లు ఇవే