AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srihari: ఆ హీరో ఫైట్స్ చేస్తుంటే భయమేసేది.. అందుకే అతని బాధ్యత తీసుకున్నా..!

విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీహరి. విలన్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీహరి ఆతర్వాత హీరోగా సినిమాలు చేశారు. ఎన్నో సినిమాల్లో ఆయన వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించాడు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు, సాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి.

Srihari: ఆ హీరో ఫైట్స్ చేస్తుంటే భయమేసేది.. అందుకే అతని బాధ్యత తీసుకున్నా..!
Srihari
Rajeev Rayala
|

Updated on: Apr 16, 2026 | 11:55 AM

Share

తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసి తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు నటుడు శ్రీహరి. విలన్ గా కెరీర్ మొదలుపెట్టి ఆతర్వాత నటుడిగా మెప్పించారు. హీరోగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు నటుడు శ్రీహరి. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా రాణించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ప్రారంభంలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీహరి ఆ తర్వాత ఇతర హీరోల సినిమాల్లోనూ నటించారు. మగధీర, ఢీ, కింగ్, డాన్ శీను, బృందావనం తదితర సూపర్ హిట్ సినిమాల్లో శ్రీహరి పోషించిన పాత్రలకు మంచి పేరొచ్చింది. శ్రీహరి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అనే చెప్పాలి.

వారెవ్వా..! ఏంటి ఈవిడ కమెడియన్ కూతురా.!! స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు గురూ..

శ్రీహరి మరణాన్ని ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సహాయక పాత్రల్లో నటిస్తూ నటించారు. తాజాగా శ్రీహరి ఓ స్టార్ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ హీరో ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రామ్ చరణ్ నటించిన మగధీర, జంజీర్ సినిమాల్లో శ్రీహరి నటించారు. ఓ ఇంటర్వ్యూలో మగధీర సినిమా సమయంలో రామ్ చరణ్ నటన గురించి శ్రీహరి మాట్లాడుతూ..

Jabardasth: అతను నాకు దేవుడితో సమానం.. చందాలు వసూలు చేసి నా కూతురికి పెళ్లి చేశా

రామ్ చరణ్ ఎంతో కష్టపడి, చాలా రిస్క్ తీసుకుని పోరాట సన్నివేశాల్లో నటించేవారని శ్రీహరి తెలిపారు. చరణ్ ఫైట్స్ చేస్తున్న ప్రతిసారీ తనకు బాగా భయం వేసేదని, అందుకే ఆయన ఉన్న ప్రతి షాట్ దగ్గరికి వెళ్లి రోప్‌లన్నింటినీ స్వయంగా టెస్ట్ చేసేవాడినని శ్రీహరి తెలిపారు. ఒక రోజు రామ్ చరణ్, “మీరెందుకు అంకుల్, వాళ్ళున్నారు కదా ఫైటర్స్ చూసుకుంటారు” అని అన్నాడట. దానికి శ్రీహరి బదులిస్తూ, “నాయనా, నేనున్నాను ఇక్కడ స్పాట్ లో.. ఫస్ట్ చిరంజీవి గారు, శ్రీహరి ఉన్నాడు కదా అక్కడ అంటారు” అని పేర్కొన్నారు.  చిరంజీవి గారికి తనపై నమ్మకం ఎక్కువ అని, అందుకే తాను ఆ బాధ్యత తీసుకుని జాగ్రత్తలు చూసుకునేవాడినని శ్రీహరి తెలిపారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

వీడెవడండీ బాబు..! అంత అందమైన అమ్మాయి హాయ్ చెప్తే ఇలా చేశాడు..!! కృతిశెట్టి షాక్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..