AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: అతను నాకు దేవుడితో సమానం.. చందాలు వసూలు చేసి నా కూతురికి పెళ్లి చేశా

జబర్దస్త్ కమెడియన్ రైజింగ్ రాజు గుర్తున్నాడా..? చాలా కాలం అయ్యింది ఆయన తెర పై కనిపించి. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపై తెచ్చుకున్నాడు రాజు. హైపర్ ఆది టీమ్ లో కామెడీ చేసి ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే పలు సినిమాల్లోనూ నటించి ఆకట్టుకున్నాడు.

Jabardasth: అతను నాకు దేవుడితో సమానం.. చందాలు వసూలు చేసి నా కూతురికి పెళ్లి చేశా
Raising Raju
Rajeev Rayala
|

Updated on: Apr 15, 2026 | 7:56 PM

Share

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయినా వారిలో కమెడియన్ రైజింగ్ రాజు ఒకరు. ఈ కమెడియన్ చాలా ఏళ్ల నుంచే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. జబర్దస్త్ లో తన కామెడీతో నవ్వులు పూయించాడు. ఈ మధ్య కాలంలో ఆయన పెద్దగా కనిపించడం లేదు. కెరీర్ బిగినింగ్ లో కొన్ని సినిమాల్లో  సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ పోషించారు. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అదే సమయంలో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాజు తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హైపర్ ఆది తో కలిసి టీమ్ లీడర్ గా వందలాది స్కిట్లు చేశారాయన. జబర్దస్త్ స్టేజ్ పై హైపర్ ఆదితో కలిసి నవ్వులు పూయించాడు రైజింగ్ రాజు.

ఆ స్టార్ హీరోకు అక్కగా అడిగారు.. చేయనని తేల్చి చెప్పా.. అసలు విషయం చెప్పిన ఆమని

ప్రస్తుతం అడపా దడపా సినిమాల్లోనూ నటిస్తున్నారీ సీనియర్ కమెడియన్. తాజాగా ఓ టీవీ షోకు హాజరైన రైజింగ్ రాజు తన కష్టాల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ముఖ్యంగా తన కూతురి పెళ్లి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ‘నేను జబర్దస్త్‌కి వెళ్లకముందు నా బిడ్డ పెళ్లి చేయడానికి కూడా డబ్బుల్లేవు. చందాలు వసూలు చేసి నా కూతురికి పెళ్లి చేశాను. రాకెట్ రాఘవ, తాగుబోతు రమేష్, ధన్‌రాజ్ ఇలా కొందరు తలా ఓ ఐదు వేలు ఇచ్చారు.

అతను నా నెంబర్ బ్లాక్ చేశాడు.. జబర్దస్త్ నుంచి వచ్చేయడానికి కారణం వాళ్లే

ఆ డబ్బులతోనే నా కూతురి పెళ్లి చేశాను’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు రైజింగ్ రాజు. కాగా తనకు హైపర్ ఆది ఎంతో మేలుచేశారంటున్నారు రైజింగ్ రాజు. ‘కరోనా సమయంలో నాకు మనవరాలు పుట్టింది. ఆ సమయంలో నేను బయటికెళ్తే పాపకి లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయేమోనని భయపడి పోయాను. ఎక్కడికి వెళ్లలేక ఇంట్లోనే ఉండిపోయాను. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తాయి. అలాంటి సమయంలో హైపర్ ఆది నాకు చాలా సాయం చేశాడు. ప్రతినెల నా ఇంటికి పేమెంట్ పంపించాడు. నిజంగా హైపర్ ఆది నా దృష్టిలో దేవుడు. నేను స్కిట్స్ చేసినా చేయకపోయినా కూడా పేమెంట్ మాత్రం టైమ్‌కి ఇచ్చాడు’ అని చెప్పుకొచ్చారు రాజు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కుర్రాడు భలే చేస్తున్నాడు..! ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా ఎదో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర