AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutton : కుక్కర్‌లో మటన్ కర్రీ చాలా రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి..

కుక్కర్ లో రుచికరమైన మటన్ కర్రీని సులభంగా తయారు చేసుకోండి. ఆనియన్స్, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు వేసి మటన్‌ను బాగా వేయించి, ఆపై కారం, ధనియాల పొడి, గరం మసాలా వంటి మసాలాలు కలిపి, నీరు పోసి ప్రెషర్ కుక్ చేయాలి. ఏడు విజిల్స్‌తో మృదువైన మటన్ కర్రీ సిద్ధం.

Mutton : కుక్కర్‌లో మటన్ కర్రీ చాలా రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి..
Mutton Curry
Ram Naramaneni
|

Updated on: Nov 11, 2026 | 4:38 PM

Share

కుక్కర్ లో చాలా రుచిగా మటన్ కర్రీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా, స్టవ్ ఆన్ చేసి కుక్కర్‌ను వేడి చేయాలి. అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత, కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత, సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత, శుభ్రంగా కడిగిన ముప్పావు కేజీ మటన్‌ను కుక్కర్‌లో వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి, మూత పెట్టి నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి. మటన్ బాగా వేగిన తర్వాత, తరిగిన రెండు టమాటాలు, రెండు మూడు పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మరొక నాలుగైదు నిమిషాలు మటన్‌ను ఇలానే వేయించాలి. టమాటాలు బాగా మెత్తబడిన తర్వాత, వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా, పావు టేబుల్ స్పూన్ కసూరి మేతి పౌడర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి కలిపి, ఒక గ్లాస్ నీళ్లు కలుపుకోవాలి.

కర్రీ కొంచెం పల్చగా కావాలంటే ఇంకొంచెం నీరు వేసుకోవచ్చు. పుదీనా, కరివేపాకు వేసి కలిపి, కుక్కర్ మూత పెట్టి విజిల్ అమర్చాలి. ఏడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఏడు విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ చక్కగా ఉడికిపోతుంది. చివరగా, కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన కుక్కర్ మటన్ కర్రీ వడ్డించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ సారి మటన్ తెచ్చినప్పుడు ఇలా ఈజీ పద్ధతిలో ట్రై చేయండి..

Follow Us