AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రముఖ ఆసుపత్రికి రూ. 5,000 జరిమానా.. శాఖాహారికి చికెన్ శాండ్‌విచ్ ఇచ్చిన వైనం..

భారతదేశంలో ఆహారపు అలవాట్లకు, మతపరమైన విశ్వాసాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా శాఖాహారాన్ని కచ్చితంగా పాటించేవారికి పొరపాటున కూడా మాంసాహారం అందిస్తే అది వారి మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. తాజాగా ఢిల్లీలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. శాఖాహార రోగికి మాంసాహార శాండ్‌విచ్ అందించిన ఒక ప్రముఖ ఆసుపత్రికి వినియోగదారుల కమిషన్ రూ. 5,000 జరిమానా విధించింది. అసలు ఏం జరిగింది?

ప్రముఖ ఆసుపత్రికి రూ. 5,000 జరిమానా.. శాఖాహారికి చికెన్ శాండ్‌విచ్ ఇచ్చిన వైనం..
Delhi Hospital Fine
Jyothi Gadda
|

Updated on: Nov 11, 2026 | 4:29 PM

Share

ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి వెళ్లిన శాఖాహార రోగికి పొరపాటున చికెన్ శాండ్‌విచ్ అందించిన ఘటనలో వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆసుపత్రికి రూ. 5,000 జరిమానా విధించింది. వెజిటేరియన్, నాన్-వెజ్ శాండ్‌విచ్‌ల బార్‌కోడ్ ఒకే విధంగా ఉండటం వల్ల ఈ పొరపాటు జరిగిందని ఆసుపత్రి అంగీకరించింది. దీనివల్ల తన మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని బాధితుడు ఫిర్యాదు చేయగా, సేవలలో లోపంగా పరిగణించిన కమిషన్ ఈ మేరకు తీర్పు వెలువరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఫిర్యాదుదారుడు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఢిల్లీలోని ఒక ఆసుపత్రికి వెళ్లారు. పరీక్షల అనంతరం ఆసుపత్రి క్యాంటీన్ నుండి ఆయన పన్నీర్ శాండ్‌విచ్ ఆర్డర్ చేశారు. అయితే, ఆసుపత్రి సిబ్బంది పొరపాటున ఆయనకు చికెన్ శాండ్‌విచ్ అందించారు. తిన్న తర్వాత అది చికెన్ శాండ్‌విచ్ అని గ్రహించిన బాధితుడు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

ఆసుపత్రి వివరణ, కమిషన్ తీర్పు

ఈ ఘటనపై బాధితుడు వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. విచారణ సందర్భంగా ఆసుపత్రి వర్గాలు తమ తప్పును అంగీకరించాయి. వెజిటేరియన్, నాన్-వెజ్ శాండ్‌విచ్‌లు రెండింటికీ ఒకే రకమైన బార్‌కోడ్ కేటాయించడం వల్ల ఆపరేషనల్ లోపం తలెత్తిందని, పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చాయి.

ఇవి కూడా చదవండి

అయితే, రోగికి అందించాల్సిన సేవల్లో ఇది స్పష్టమైన లోపమని కమిషన్ స్పష్టం చేసింది. ఆహార ఎంపిక విషయంలో ఆసుపత్రి నిర్వహణ మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. బాధితుడి మతపరమైన మనోభావాలు దెబ్బతినడానికి కారణమైనందుకు గాను, సదరు ఆసుపత్రికి రూ. 5,000 జరిమానా విధిస్తూ కమిషన్ తీర్పు వెలువరించింది. వైద్యం కోసం వచ్చే రోగుల విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం తగదని ఈ తీర్పు మరోసారి గుర్తుచేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆసుపత్రికి రూ. 5వేలు ఫైన్.. శాఖాహారికి చికెన్ శాండ్‌విచ్ ఇవ్వటంతో
ఆసుపత్రికి రూ. 5వేలు ఫైన్.. శాఖాహారికి చికెన్ శాండ్‌విచ్ ఇవ్వటంతో
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో కొత్త బస్సులు
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో కొత్త బస్సులు
ఈ ఒక్క ఆకుతో ఎంత మొండి తామర అయినా మటుమాయం.. మళ్ళీ తిరిగి రాదు!
ఈ ఒక్క ఆకుతో ఎంత మొండి తామర అయినా మటుమాయం.. మళ్ళీ తిరిగి రాదు!
రహస్యం బయటపెడతాడని ఫ్రెండ్‌ను చంపేశాడు.
రహస్యం బయటపెడతాడని ఫ్రెండ్‌ను చంపేశాడు.
పీఎఫ్ వివరాలు తప్పుగా ఉన్నాయా..? సింపుల్‌గా ఇలా మార్చుకోండి..
పీఎఫ్ వివరాలు తప్పుగా ఉన్నాయా..? సింపుల్‌గా ఇలా మార్చుకోండి..
డిసెంబర్‌లో ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
డిసెంబర్‌లో ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
4వ వన్డే కోసం కొత్త ఓపెనింగ్ జోడీ.. ఏకంగా 6 మార్పులతో బరిలోకి..
4వ వన్డే కోసం కొత్త ఓపెనింగ్ జోడీ.. ఏకంగా 6 మార్పులతో బరిలోకి..
బంగారు నాణేలు కొంటే లాభమేనా? అమ్మేటప్పుడు అసలు విషయం తెలుస్తుంది!
బంగారు నాణేలు కొంటే లాభమేనా? అమ్మేటప్పుడు అసలు విషయం తెలుస్తుంది!
నెట్‌ఫ్లిక్స్‌లో అదరగొడుతున్న రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్..
నెట్‌ఫ్లిక్స్‌లో అదరగొడుతున్న రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్..
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన బార్లీ పాయసం..
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన బార్లీ పాయసం..