AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ దగ్గర ఉన్నది అసలైన నాణెమా..? లేదా నకిలీదా..? ఈ పనులతో ఇంటి వద్దనే ఈజీగా పసిగట్టేయండి..

ప్రస్తుతం మార్కెట్లో నకిలీ నాణెంలు చలామణి అవుతున్నాయి. దీంతో మీరు కాయిన్స్ వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిందే. మీరు ఉపయోగించేంది అసలైనదా లేదా నకిలీదా అనేది తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీరు మోసానికి గురి కావొచ్చు. వీటిని మీ ఇంటి వద్దనే సులువుగా గుర్తించవచ్చు.

మీ దగ్గర ఉన్నది అసలైన నాణెమా..? లేదా నకిలీదా..? ఈ పనులతో ఇంటి వద్దనే ఈజీగా పసిగట్టేయండి..
Fake Coins
Venkatrao Lella
|

Updated on: Nov 11, 2026 | 4:49 PM

Share

ఒకప్పుడు నకిలీ కరెన్సీ నోట్లను అక్రమార్కులు ఎక్కువగా చలామణిలో తీసుకొచ్చేేేేేవారు. దీంతో పోలీసులు తరచూ ఎక్కడో ఒకచోట నకిలీ నోట్లను పట్టుకునేవారు. ఏటీఎంల్లో కూడా నకిలీ నోట్లు బయటపడ్డ సంఘటనలు దేశవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. ప్రజలు కూడా తమ వద్ద ఉన్నది అసలైనా నోటా? లేదా నకిలీ నోటా? అనేది అనుమానపడేవారు. ఒకప్పుడు నకిలీ నోట్ల బెడద ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు నకిలీ నాణేలు కూడా తయారుచేసి చలామణిలోకి తెస్తున్నారు కొంతమంది అక్రమార్కులు. నకిలీ నోట్లను సులువుగా గుర్తు పట్టవచ్చు. కానీ నకిలీ నాణేలను గుర్తుపట్టడం కాస్త కష్టతరంగా ఉంటుంది. దీంతో మీ దగ్గర ఉన్నది నకిలీ నాణేమా..? లేదా అసలైన నాణేమా? అనేది కొన్ని సులభమైన పద్దతుల ద్వారా తెలుసుకోవచ్చు.

నకిలీ రూ.20 నాణేలు ఎలా గుర్తుపట్టాలి..?

ఆర్బీఐ తయారుచేసే అసలైన రూ.20 నాణెంకు 12 అంచులు, బయోమోటాలిక్ ఆకృతి, 8.4 గ్రామలు బరువు కలిగి ఉంటుంది. అసలైన రూ.20 నాణెం పూర్తిగా గుడ్రంగా ఉండదు. అంచులు సాదాగా, స్పష్టంగా ఉంటాయి. ఇక ఆర్బీఐ నిబంధనల ప్రకారం అసలైన రూ.20 నాణెం బరువు 8.54 గ్రాములుగా ఉంటుంది. ఇంతకంటే తక్కువ లేదా ఎక్కువ బరువు ఉంటే అది నకిలీ నాణెంగా మీరు గుర్తుపట్టవచ్చు. ఇక నిజమైన నాణెం వ్యాసం 27 మిల్లీమీటర్లుగా ఉంటుంది. ఈ నాణెం బయటి భాగం నికెల్ సిల్వర్‌తో తయారుచేస్తే.. మధ్యలో ఉన్న గుండ్రని భాగాన్ని నికెల్ బ్రాస్‌తో తయారుచేస్తారు. దీంతో వెండి తెలుపు, బంగారు అనే రెండు రంగు రూపంలో ఉంటుంది. అసలు కాయిన్‌పై అశోక స్తంభం, సత్యమేవ జయతేతో పాటు 20 అనే నెంబర్ చాలా ఉబ్బెత్తుగా, లోతుగా ఉంటుంది.

నకిలీ నాణెం ఎలా ఉంటుందంటే..?

నకిలీ నాణెంలో డిజైన్లు, అక్షరాలు అస్పష్టంగా, గరుకుగా, తక్కువ ఉబ్బెత్తు కలిగి ఉంటాయి. ఇక నకిలీ నాణెలను బలంగా రుద్దినప్పుడు వాటి రంగు వెలిసిపోతుంది. వీటిని నాసిరకమైన లోహలు ఉపయోగించి రసాయనాలతో పాలిష్ చేస్తారు. దీంతో వాటిని రుద్దినప్పుడు ఒకరకమైన వింత రసాయన వాసవన వస్తుంది. దీంతో ఇలాంటి లక్షణాల ద్వారా మీరు నకిలీ నాణెలను సులువుగా గుర్తుపట్టవచ్చు. ఇటీవల పలుచోట్ల పోలీసులు నకిలీ నాణేలను చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. దీంతో నకిలీ నాణెలు కూడా మార్కెట్లోకి వచ్చాయనే విషయం దీని ద్వారా అర్థమవుతుంది. ప్రస్తుతం ప్రజలు కాయిన్స్ వాడటం తగ్గించేశారు. కరెన్సీ నోట్ల వినియోగమే ఎక్కువగా జరుగుతుంది. నకిలీ కరెన్సీ నోట్లను సులువుగా ఎవరైనా గుర్తు పట్టవచ్చు. దీంతో అక్రమార్కులు నాణెలను ఎంచుకుంటున్నారు. మీరు నాణెలను ఉపయోగించేటప్పుడు ఈ సులభ పద్దతుల ద్వారా నిజమైనదా.. కాదా అనేది తనిఖీ చేసుకోవడం మంచిది.

Follow Us