AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్న తండ్రే అలా చెప్పమన్నాడు.. పల్సర్ బైక్ ఝాన్సీ జీవితంలో ఇంత విషాదం ఉందా..!

తన డాన్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది పల్సర్ బైక్ ఝాన్సీ. కండక్టర్ గా పని చేస్తూనే ఝాన్సీ తన డాన్స్ టాలెంట్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు టీవీ షోలు, డాన్స్ షోలు చేస్తూ బిజీగా ఉంది.

కన్న తండ్రే అలా చెప్పమన్నాడు.. పల్సర్ బైక్ ఝాన్సీ జీవితంలో ఇంత విషాదం ఉందా..!
Conductor Jhansi
Rajeev Rayala
|

Updated on: Apr 15, 2026 | 4:57 PM

Share

పల్సర్ బైక్ ఝాన్సీగా పేరుపొందిన కండక్టర్ ఝాన్సీ. తన డాన్స్ టాలెంట్ తో ఎంతో మందిని అవాక్ అయ్యేలా చేసింది. కండక్టర్ గా పని చేస్తూనే సమయం దొరికినప్పుడల్లా ఈవెంట్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బుల్లితెర పై డాన్స్ షోల్లోనూ పాల్గొంది ఝన్సీ.. కాగా తన జీవితంలో ఎదుర్కొన్న అనేక కష్టాలను, భావోద్వేగ సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. తన తల్లిదండ్రులు ప్రేమించి వివాహం చేసుకున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల విడిపోయారని తెలిపింది. తండ్రి ఉన్నప్పుడు జీవితం ఒకలా, లేనప్పుడు ఇంకోలా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. చదువుకోని తల్లి, తమ్ముడితో కలిసి ఆమె బాల్యంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు తెలిపింది. తల్లి వైపు కుటుంబం మొదట్లో సహాయం చేయడానికి నిరాకరించినప్పటికీ, అమ్మమ్మ దొంగచాటుగా వారికి సహాయం చేస్తూ వచ్చారని తెలిపింది. తన తండ్రితో బంధం తెగిపోవడానికి గల ముఖ్య కారణాన్ని ఝాన్సీ పంచుకుంది.

ఆ స్టార్ హీరోకు అక్కగా అడిగారు.. చేయనని తేల్చి చెప్పా.. అసలు విషయం చెప్పిన ఆమని

ఆమె 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, తల్లిదండ్రుల విడాకులకు సంబంధించి కోర్టులో కౌన్సిలింగ్ జరిగిందని. ఆ ముందు రోజు తండ్రి పాఠశాలకు వచ్చి, చాక్లెట్లు ఇచ్చి, తనను సంతోషపెట్టారని. అయితే, మరుసటి రోజు కోర్టులో జడ్జి పిలిచినప్పుడు నేను మీ నాన్నను కాదు అని చెప్పమని కోరారని తెలిపింది. చిన్నప్పటి నుండి ఎప్పుడూ అబద్ధాలు చెప్పవద్దని చెప్పిన తండ్రి, ఇలా కోరడం ఝాన్సీని తీవ్రంగా కలచివేసిందట. ఆమె ఈ విషయంపై తండ్రిని నిలదీయగా, ఆయన “నాకు మీతో రిలేషన్ అక్కర్లేదు కాబట్టే అలా చెప్పమన్నాను” అని సమాధానమిచ్చారట. ఈ సంఘటనతో తీవ్రంగా బాధపడిన ఝాన్సీ, కోర్టులో తన తండ్రే అని ధైర్యంగా చెప్పి, ఆనాటి నుంచి ఆయనతో అన్ని సంబంధాలను తెంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

అతను నా నెంబర్ బ్లాక్ చేశాడు.. జబర్దస్త్ నుంచి వచ్చేయడానికి కారణం వాళ్లే

అప్పటి నుండి ఝాన్సీ తన జీవితంలో తండ్రి అనే వ్యక్తి లేడని భావిస్తున్నా అని తెలిపింది. తన తల్లి తనకు అమ్మ, నాన్న రెండు అని ఆమె తెలిపింది. చిన్న వయసులోనే తల్లి, తమ్ముడి పోషణ బాధ్యతలను తన భుజాలపై వేసుకుని, అనేక ఎదురుదెబ్బలు, కష్టాలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆమె మధ్యతరగతి జీవితాన్ని గడుపుతున్నారు. తన గత కష్టాలను గుర్తు చేసుకుంటూ, తన పిల్లలు అలాంటి పరిస్థితులను ఎదుర్కోకూడదని ఝాన్సీ దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు. ప్రస్తుతం రెండు వృత్తులలో పనిచేస్తున్న తాను, ఏ ఒక్క దానిలో బ్యాలెన్స్ కోల్పోయినా పడిపోతానేమోనని ఆందోళన చెందుతూనే, తన పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడుతున్నట్లు తెలిపింది ఝాన్సీ. ప్రస్తుతం డాన్స్ షోలు, ఈవెంట్స్ తో బిజీగా ఉంది ఝాన్సీ.

కుర్రాడు భలే చేస్తున్నాడు..! ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా ఎదో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!
షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం
మీరు కారుకు ఇలాంటి డోర్ హ్యాండిల్స్ ఉన్నాయా? అయితే జాగ్రత్త
మీరు కారుకు ఇలాంటి డోర్ హ్యాండిల్స్ ఉన్నాయా? అయితే జాగ్రత్త