AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biryani Business: రూ.99 బిర్యానీ.. ఓనర్‌కు రోజుకు ఎంత లాభం వస్తుంది? ఇలా చేస్తేనే సక్సెస్‌.. లేకుంటే నష్టమే..!

Biryani Business: ఒక ప్రధాన రోడ్డు పక్కన, కళాశాలలు, హాస్టళ్లు ఉన్న ప్రాంతంలో ఉన్న 600 చదరపు అడుగుల బిర్యానీ పాయింట్ నమూనాగా తీసుకుందాం. ఇక్కడ సింగిల్ ప్లేట్ రూ.99కి అమ్ముతారు. స్విగ్గీలో అదే ప్లేట్ రూ.149కి లభిస్తుంది. ఈ పాయింట్‌లో రోజుకు సగటున..

Biryani Business: రూ.99 బిర్యానీ.. ఓనర్‌కు రోజుకు ఎంత లాభం వస్తుంది? ఇలా చేస్తేనే సక్సెస్‌.. లేకుంటే నష్టమే..!
Biryani Business
Subhash Goud
|

Updated on: Nov 11, 2026 | 11:22 AM

Share

Biryani Business: రూ.99 బిర్యానీ ప్లేట్ వెనుక దాగున్న వాస్తవాలను, బిర్యానీ పాయింట్ యజమాని అసలు ఎంత లాభం పొందుతున్నారో ఈ సమగ్ర విశ్లేషణ తెలియజేస్తుంది. హైదరాబాద్‌లో చికెన్ ధర కిలో రూ.270 ఉన్నప్పటికీ, అనేక షాపులు రూ.99కే చికెన్ బిర్యానీని అందిస్తున్నాయి. అమీర్‌పేట్‌లో ఒక షాపు అయితే రూ.99కే అన్‌లిమిటెడ్ బిర్యానీని కూడా అందిస్తోంది. ఈ వ్యాపారంలో నిజమైన లాభం ఎంతో తెలుసుకుందాం.. ఒక ప్రధాన రోడ్డు పక్కన, కళాశాలలు, హాస్టళ్లు ఉన్న ప్రాంతంలో ఉన్న 600 చదరపు అడుగుల బిర్యానీ పాయింట్ నమూనాగా తీసుకుందాం. ఇక్కడ సింగిల్ ప్లేట్ రూ.99కి అమ్ముతారు. స్విగ్గీలో అదే ప్లేట్ రూ.149కి లభిస్తుంది. ఈ పాయింట్‌లో రోజుకు సగటున 400 ప్లేట్లు అమ్ముడవుతాయి. ధరలన్నీ నవంబర్ 10, 2026 నాటివి. అయితే ఈ ధరలు అవగాహన కోసం మాత్రమే. ఎందుకంటే రోజురోజుకు ధరలు పెరిగిపోతున్నాయి. అయితే చికెన్, ఇతర ఖర్చులు ఏరియాను బట్టి మారుతూ ఉంటాయి. అందుకే వచ్చే లాభంలో తేడా ఉండవచ్చని గమనించండి. ఇదే లాభం, ఇదే  ఖర్చులు అని మాత్రం అంచనా వేసుకోకండి.

రోజువారీ ఖర్చులను పరిశీలిస్తే:

తెల్లవారుజాము 5 గంటలకు, 400 ప్లేట్లకు, అదనపు పీస్‌లకు కలిపి 54 కిలోల చికెన్‌ను రూ.230 కిలో చొప్పున రూ.12,500కి కొనుగోలు చేస్తారు. బిర్యానీ బాస్మతి 50 కిలోలకు రూ.4,700, నూనె, నెయ్యి, ఉల్లిపాయలు, పెరుగు, మసాలాలు వంటి వాటికి రూ.5,600 వెచ్చిస్తారు. ఇలా బిర్యానీ ఒక్క ప్లేట్ కూడా అమ్మకముందే సరుకుల కోసం రూ.23,000 ఖర్చు అవుతుంది.

సిబ్బంది ఖర్చులు కూడా గణనీయంగా ఉంటాయి. హెడ్ బావర్చితో సహా ఎనిమిది మంది సిబ్బందికి నెలకు రూ.1,40,000 జీతాలు చెల్లిస్తారు, అంటే రోజుకు రూ.4,600. షాప్ అద్దె నెలకు రూ.75,000, అంటే రోజుకు రూ.2,500. కరెంటు, నీళ్లు, రిపేర్లకు రోజుకు రూ.800. రోజుకు ఒక 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ రూ.3,081 ఖర్చవుతుంది. ఉదయం 11 గంటల సమయానికి, ఒక్క ప్లేట్ కూడా అమ్మకముందే రూ.34,000 వరకు ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఒక ప్లేట్ బిర్యానీ ఖర్చులను విశ్లేషిస్తే, 120 గ్రాముల బియ్యం రూ.11, 110 గ్రాముల చికెన్ పీస్ రూ.25, నూనె, మసాలా, ఉల్లిపాయలు 9, సాలన్, రైతా రూ.4. అంటే ప్లేట్‌లో సరుకుల ఖర్చు రూ.50. దీనికి గ్యాస్ రూ.7, పార్సిల్ అయితే డబ్బా, కప్పు, కవర్ కలిపి రూ.12, GST 5% అదనం. ఇవన్నీ పోగా, రూ.99 ప్లేట్‌పై దాదాపు రూ.30 లాభం మిగులుతుంది. ఇది అద్దె, జీతాలు వంటి స్థిర ఖర్చులను లెక్కించక ముందు.

లంచ్ రష్ తర్వాత, స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు మొదలవుతాయి. యాప్ ఆర్డర్ల వల్ల రూ.149 ప్లేట్‌పై యజమానికి రూ.104 మాత్రమే వస్తుంది. ఎందుకంటే 30% యాప్ కమిషన్ పోతుంది. రోజుకు 100 యాప్ ఆర్డర్లతో, యాప్ వాటా రూ.4,500 అవుతుంది. ప్యాకింగ్ డబ్బాల ఖర్చు కూడా చాలా ఎక్కువ. రోజుకు 280 పార్సిల్‌లకు నెలకు రూ.1,05,000 అవుతుంది. ఇది షాప్ అద్దె కంటే ఎక్కువ.

రోజు చివరిలో రాత్రి 11 గంటలకు షట్టర్ వేసిన తర్వాత లెక్క చూస్తే, కస్టమర్ల నుండి వచ్చిన మొత్తం రూ.49,800. యాప్ వాటా పోగా లాభం వచ్చింది రూ.45,400. సరుకులు, జీతాలు, అద్దె, గ్యాస్, డబ్బాలు, GST, మిగిలిపోయిన బిర్యానీ ఖర్చులు అన్నీ పోగా, యజమాని జేబులో రూ.5,600 మిగులుతుంది. ఆశ్చర్యకరంగా 400 బిర్యానీ ప్లేట్ల నుండి వచ్చిన లాభం రూ.2,700 మాత్రమే (ఒక్క ప్లేట్‌కి రూ.7). మిగతా రూ.2,900 అదనపు చికెన్ పీస్‌ల నుండి వస్తుంది. ఒక్క అదనపు పీస్ రూ.70కి అమ్ముడవుతుంది. దీనిపై రూ.39 లాభం ఉంటుంది. ఇది ఐదు బిర్యానీ ప్లేట్ల లాభంతో సమానం. కాబట్టి, రూ.99 బోర్డు అనేది కస్టమర్లను ఆకర్షించే ఎర అని, అసలు డబ్బు అదనపు పీస్‌లలో ఉందని తేలింది.

నెలకు రూ.1,68,000 లాభం వస్తుంది. కానీ ఇది రోజుకు 400 ప్లేట్లు అమ్మే పాయింట్ లెక్క. కొత్త పాయింట్‌కు రోజుకు 150 ప్లేట్లు మాత్రమే అమ్ముడైతే, నెలకి రూ.1,19,000 నష్టం వస్తుంది. లాభనష్టాలు లేకుండా ఉండాలంటే రోజుకు దాదాపు 260 ప్లేట్లు అమ్మాలి. అందుకే 99 రూపాయల పాయింట్‌కు క్యూ అనేది ఆక్సిజన్ వంటిది. కార్తీక మాసంలో నాన్-వెజ్ అమ్మకాలు తగ్గుతాయి, లాభాలు కూడా తగ్గుతాయి.

చిన్న పట్టణాల్లో, హైదరాబాద్ మోడల్‌ను కాపీ చేయకుండా, అద్దె, జీతాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ప్లేట్ రూ.130కి అమ్మి, రోజుకు 120 ప్లేట్లు అమ్ముకున్నా నెలకు రూ.1,28,000 వరకు లాభం పొందవచ్చు. జాబ్ చేస్తూనే ఆదివారం ఇంటి బిర్యానీ మోడల్ ద్వారా నెలకు రూ.14,000 సంపాదించుకోవచ్చు. అద్దె, స్టాఫ్, మిగిలిపోయే బిర్యానీ లాంటి సమస్యలు లేకుండా. చివరిగా బిర్యానీ పాయింట్ వ్యాపారంలో లాభం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us