Cinema : ఒకే రంగు షర్ట్‌లో హీరో సినిమా మొత్తం.. హిట్ కాదన్నారు.. కట్ చేస్తే.. థియేటర్లు షేక్ అయ్యాయి..
హీరో సినిమా మొత్తం ఒకే రంగు షర్ట్ లో ఉంటాడు. అంతేకాదు.. హీరోయిన్ ఉన్నా ఆమెతో గ్లామరస్ సీన్స్ ఉండవు. అసలు హీరో, హీరోయిన్ మధ్య ర్యాపో ఉండదు. దీంతో ఈ మూవీ హిట్ కాదని చాలా మంది భావించారు. కానీ కథనంపై నమ్మకంతో ఓ స్టార్ హీరో ఆ సినిమా చేయగా.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్ చేసింది. అటు మ్యూజిక్ పరంగానూ సూపర్ హిట్అయ్యింది. ఇప్పటికీ ఈ మూవీ సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు దర్శకుడు సముద్ర. ఒకప్పుడు స్టార్ హీరోలతో అనేక హిట్స్ రూపొందించారు. డైరెక్టర్ సముద్ర తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ సినిమాలలో ‘సింహరాశి’ ఒకటి. యాక్షన్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా తెరకెక్కడానికి ముందు ఎన్నో ఆసక్తికరమైన పరిణామాలు, సవాళ్లు ఎదురయ్యాయని దర్శకుడు సముద్ర ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ కథను ముందుగా చాలా మంది ప్రముఖ హీరోల దగ్గరకు తీసుకెళ్లినప్పటికీ, కొన్ని కారణాల వల్ల వారు చేయడానికి ముందుకు రాలేదని ఆయన తెలిపారు. ఈ కథను రాజశేఖర్ కంటే ముందు నాగార్జున, వెంకటేష్, విజయకాంత్ వంటి పలువురు స్టార్ హీరోలకు వినిపించినట్లు దర్శకుడు వెల్లడించారు. అయితే కథలోని ఇంటెన్స్ యాక్షన్, ఇతర కారణాల వల్ల ఎవరూ దీనిని చేయడానికి సాహసించలేకపోయారని చెప్పారు. ఆ తర్వాత తమిళంలో శరత్ కుమార్ హీరోగా వచ్చిన ‘మాయి’ సినిమా చూసిన తర్వాత తనకు ఈ కథపై పూర్తి స్పతత వచ్చిందని తెలిపారు. అప్పట్లో నరసింహనాయుడు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో బాలకృష్ణతో ఈ సినిమా చేయాలని అనుకున్నప్పటికీ, చివరికి ఈ ప్రాజెక్ట్ రాజశేఖర్ దగ్గరకు వెళ్లిందని ఆయన గుర్తుచేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..
దర్శకుడు సముద్రను పరిచయం చేయడానికి రాజశేఖర్ చూపిన చొరవను ఆయన ఎంతో కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు. అయితే సినిమా షూటింగ్ సమయంలో హీరో మొత్తం ఒకే రంగు షర్ట్‌లో కనిపించడం, హీరోయిన్‌ను పెద్దగా పట్టించుకోకపోవడం వంటి అంశాలపై అప్పట్లో కొద్దిగా సందేహాలు వ్యక్తమయ్యాయని, సినిమా చూసిన తర్వాత ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనే టెన్షన్ ఉండేదని తెలిపారు. కానీ అన్ని అడ్డంకులను దాటుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సింహరాశి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించి, రాజశేఖర్ కెరీర్‌లో ప్రత్యేక చిత్రంగా నిలిచింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..
2001 సంవత్సరం జూలై 6న విడుదలైన ‘సింహరాశి’ సినిమా, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. రాజశేఖర్ మార్కెట్‌కు తగ్గట్టుగా పక్కా మాస్ సెంటిమెంట్, కుటుంబ అనుబంధాలతో తెరకెక్కిన ఈ చిత్రం బిచ్చమెత్తే సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. అప్పట్లో ఈ చిత్రం కలెక్షన్ల పరంగా మంచి లాభాలను ఆర్జించి, రాజశేఖర్ కెరీర్‌లో మరో నిలిచిపోయే చిత్రంగా నిలిచింది.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..
