AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. విడుదలకు ముందే అమ్మడు సెన్సేషన్.. కుర్రాళ్లను ఆగం చేస్తున్న హీరోయిన్..

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు ఆమె అందంగా లేదని అందరూ హేళన చేసేవారు. తన లుక్స్, డ్రెస్సింగ్ గురించి ఎగతాళిగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు అదే అమ్మాయి టాలీవుడ్ కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. చేసిందే ఒక్క సినిమా. ఇంకా విడుదల కూడా కాలేదు. కానీ అప్పుడే ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. విడుదలకు ముందే అమ్మడు సెన్సేషన్.. కుర్రాళ్లను ఆగం చేస్తున్న హీరోయిన్..
Divya Bharathi
Rajitha Chanti
|

Updated on: Nov 11, 2026 | 10:41 AM

Share

సినిమా పరిశ్రమలో అడుగుపెట్టడానికి ముందు కొందరు నటీమణులు ఎంతసాధారణంగా ఉంటారో, ఒక్కసారి తెరపైకి వచ్చాక వారి రూపం మారిపోతుంది. కొంతమంది తారల ఒకప్పటి ఫోటోస్ చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతుంటారు. అచ్చం అలాంటి కోవకే చెందుతుంది టాలీవుడ్, కోలీవుడ్ బ్యూటీ దివ్యభారతి. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాలేజీ రోజుల్లో అత్యంత సాధారణంగా, డీగ్లామరస్‌గా కనిపిస్తూ అమాయకంగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు గ్లామర్ వరల్డ్‌లో క్యూట్ అండ్ హాట్ లుక్స్‌తో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్‌గా మారిపోయింది. తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన దివ్యభారతి, జి.వి. ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ‘బ్యాచిలర్’ సినిమాతో నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ చిత్రంలో ‘సుబ్బలక్ష్మి’ పాత్రలో ఒదిగిపోయి నటించిన ఆమె, తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో కొన్ని బోల్డ్ సన్నివేశాలలోనూ నటించి యువతను విపరీతంగా ఆకట్టుకుంది. కేవలం ఒక్క చిత్రంతోనే ఆమెకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతమైంది.

తొలి సినిమా సక్సెస్ తర్వాత వెబ్‌సిరీస్‌లు, తమిళంలో పలు చిత్రాలు చేసిన దివ్యభారతి, ప్రస్తుతం టాలీవుడ్‌లోకి కూడా అడుగుపెడుతోంది. సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న ‘G.O.A.T’ (Greatest Of All Time) చిత్రంలో ఈ అమ్మడు హీరోయిన్‌గా నటిస్తూ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ నవంబర్ 12న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. ప్రస్తుతం ప్రమోషన్లలో పాల్గొంటుంది దివ్య భారతి. అంతేకాకుండా ఇటీవలే కార్తీ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘మహారాజా’ చిత్రంలోనూ మెరిసిన ఈ బ్యూటీ, చేతినిండా ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో ఆమె పంచుకునే గ్లామరస్ ఫోటోషూట్‌లు ఎప్పుడూ ట్రెండింగ్‌లో నిలుస్తుంటాయి.

గోట్ చిత్రం విషయానికి వస్తే.. బుల్లితెర సెన్సేషన్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న ‘G.O.A.T’ చిత్రంతో తెలుగులోకి ప్రవేశిస్తోంది దివ్య భారతి. గ్రామీణ నేపథ్యంలో పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. బెట్టింగ్, జూదం , నాటు కోడి పందాల నేపథ్యాన్ని స్పృశిస్తూనే, మానవ సంబంధాలు మరియు ఒక మంచి సామాజిక సందేశంతో వినోదాత్మకంగా రూపుదిద్దుకుంది. జైష్ణవ్ ప్రొడక్షన్స్ సమర్పణలో మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

దివ్య భారతి..

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Follow Us
IPL 2027లో మోస్గ్ డేంజరస్ టీం ఇదే.. ఆ ఒక్కడి రాకతో మారిపోయిందిగా
IPL 2027లో మోస్గ్ డేంజరస్ టీం ఇదే.. ఆ ఒక్కడి రాకతో మారిపోయిందిగా
అందంగా లేదని రిజెక్ట్ చేస్తే.. కుర్రాళ్లను ఆగం చేస్తున్న హీరోయిన్
అందంగా లేదని రిజెక్ట్ చేస్తే.. కుర్రాళ్లను ఆగం చేస్తున్న హీరోయిన్
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. అదేంటో తెలుసా?
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. అదేంటో తెలుసా?
ఫ్రిజ్‌లో పెట్టకుండానే 25 రోజుల వరకు నిల్వ ఉండే గుడ్డు పచ్చడి..!
ఫ్రిజ్‌లో పెట్టకుండానే 25 రోజుల వరకు నిల్వ ఉండే గుడ్డు పచ్చడి..!
రేషన్ షాపుల్లో తక్కువ ధరకే నిత్యావసరాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ షాపుల్లో తక్కువ ధరకే నిత్యావసరాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
బీరకాయ తొక్కల పచ్చడి ఇలా చేస్తే.. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు!
బీరకాయ తొక్కల పచ్చడి ఇలా చేస్తే.. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు!
గ్రీస్‏లోనే అనిరుధ్, కావ్య పెళ్లి ఎందుకు.. ?
గ్రీస్‏లోనే అనిరుధ్, కావ్య పెళ్లి ఎందుకు.. ?
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్..ప్రారంభించనున్న అమిత్ షా
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్..ప్రారంభించనున్న అమిత్ షా
నిద్ర లేచే సరికి షాకింగ్ సీన్.. అమ్మాయిల జడలు కత్తిరిస్తుందెవరు..
నిద్ర లేచే సరికి షాకింగ్ సీన్.. అమ్మాయిల జడలు కత్తిరిస్తుందెవరు..
ఒకే ఒక్క ఇటుకతో రాజమహల్ నిర్మించడం ఎలా సాధ్యం..? చిక్కుప్రశ్న
ఒకే ఒక్క ఇటుకతో రాజమహల్ నిర్మించడం ఎలా సాధ్యం..? చిక్కుప్రశ్న