AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. కిలో కందిపప్పు రూ.100కే.. పామాయిల్, గోధుమపిండి ఎంతంటే..

ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఊరట కల్పించనుంది. రేషన్ దుకాణాల ద్వారా కిలో కందిపప్పు రూ.100, గోధుమపిండి రూ.25, లీటరు పామాయిల్ రూ.125కే అందించాలని నిర్ణయించింది. మార్కెట్ జోక్య పథకం కింద మూడు నెలలకు రూ.300.60 కోట్ల సబ్సిడీ భరించనుంది. ఈ నిర్ణయంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసరాల ఖర్చు తగ్గే అవకాశం ఉంది.

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. కిలో కందిపప్పు రూ.100కే..  పామాయిల్, గోధుమపిండి ఎంతంటే..
Tur Dal, Palm Oil, Wheat Flour Prices
Shaik Madar Saheb
|

Updated on: Nov 11, 2026 | 10:19 AM

Share

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణతో పాటు పేదలకు ఆర్థిక ఊరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు రేషన్ దుకాణాల (PDS) ద్వారా సబ్సిడీ ధరలకే కందిపప్పు, పామోలిన్ ఆయిల్, గోధుమపిండిని పంపిణీ చేయాలని నిశ్చయించింది. ఓపెన్ మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని మరియు వాటిని రాయితీపై పేదలకు అందించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించగా, ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో ఆమోదం తెలిపారు.

సబ్సిడీ ధరల వివరాలు ఇవే..

రేషన్ కార్డుదారులకు మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే ఈ క్రింది నిత్యావసరాలను అందించనున్నారు:

  • కందిపప్పు: కిలో రూ. 100
  • గోధుమపిండి: కిలో రూ. 25
  • పామోలిన్ ఆయిల్: లీటరు రూ.125

మూడు నెలలకు రూ.300.60 కోట్ల రాయితీ:

మార్కెట్ జోక్య పథకం (Market Intervention Scheme) ద్వారా ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా రూ. 100.20 కోట్ల చొప్పున, రాబోయే మూడు నెలల కాలానికి రూ. 300.60 కోట్లు సబ్సిడీగా భరించనుంది.

ఈ మేరకు ధరల స్థిరీకరణ నిధి కింద 1.20 లక్షల టన్నుల కందులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించగా, ప్రాథమికంగా 40,338 టన్నులను కేంద్రం కేటాయించింది. ముడికందుల లభ్యతకు అనుగుణంగా సేకరణ చేపట్టడం, పప్పు తయారీ మిల్లులతో ఒప్పందాలు చేసుకోవాలని పౌరసరఫరాల సంస్థ ఎండీ, వీసీలకు ఆ శాఖ కమిషనర్ హెచ్.కన్నబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

పామోలిన్ ఆయిల్‌ను పారదర్శకమైన పోటీ టెండర్ ప్రక్రియ ద్వారా సేకరించాలని సూచించారు. ఈ పథకాన్ని మూడు నెలల పరిమితి తర్వాత కూడా పొడిగించాల్సి వస్తే ముందస్తుగా ప్రభుత్వ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది మంది పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసరాల ఖర్చు తగ్గడమే కాకుండా, పెరిగిన ధరల నుంచి పెద్ద ఎత్తున ఉపశమనం లభించనుంది.

Follow Us
రేషన్ షాపుల్లో తక్కువ ధరకే నిత్యావసరాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ షాపుల్లో తక్కువ ధరకే నిత్యావసరాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
బీరకాయ తొక్కల పచ్చడి ఇలా చేస్తే.. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు!
బీరకాయ తొక్కల పచ్చడి ఇలా చేస్తే.. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు!
గ్రీస్‏లోనే అనిరుధ్, కావ్య పెళ్లి ఎందుకు.. ?
గ్రీస్‏లోనే అనిరుధ్, కావ్య పెళ్లి ఎందుకు.. ?
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్..ప్రారంభించనున్న అమిత్ షా
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్..ప్రారంభించనున్న అమిత్ షా
నిద్ర లేచే సరికి షాకింగ్ సీన్.. అమ్మాయిల జడలు కత్తిరిస్తుందెవరు..
నిద్ర లేచే సరికి షాకింగ్ సీన్.. అమ్మాయిల జడలు కత్తిరిస్తుందెవరు..
ఒకే ఒక్క ఇటుకతో రాజమహల్ నిర్మించడం ఎలా సాధ్యం..? చిక్కుప్రశ్న
ఒకే ఒక్క ఇటుకతో రాజమహల్ నిర్మించడం ఎలా సాధ్యం..? చిక్కుప్రశ్న
హార్దిక్, అర్ష్‌దీప్ ట్రేడ్ కన్ఫామ్.. బీసీసీఐ కీలక ప్రకటన..!
హార్దిక్, అర్ష్‌దీప్ ట్రేడ్ కన్ఫామ్.. బీసీసీఐ కీలక ప్రకటన..!
ఇక ఈ రైలుకు తత్కాల్ టికెట్లు ఉండవు.. కొత్త రూల్స్ ఇవే!
ఇక ఈ రైలుకు తత్కాల్ టికెట్లు ఉండవు.. కొత్త రూల్స్ ఇవే!
చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరిగా తీసుకోండి..
చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరిగా తీసుకోండి..
బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు.. ఇప్పుడే కొనాలా? ఆగాలా?
బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు.. ఇప్పుడే కొనాలా? ఆగాలా?