ఎండలో శరీరాన్ని వేడెక్కించుకొని, చెట్లు ఎక్కే పాము తెలుసా?
samatha
11 November 2026
Pic credit - Pinterest
పాముల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. భూ ప్రపంచం పై అనేక రకాలైన జాతుల పాములు ఉన్నాయి.
పాములు
అయితే మీకు అన్ని పాముల కంటే శరీరాన్ని వేడెక్కించుకొని, ఆహారం కోసం వెతుకులాడే పాము గురించి తెలుసా?
శరీరం వేడెక్కించుకునే పాము
ఇంతకీ అది ఏ పాము అనుకుంటున్నారా? జెర్రిపోతు. ఇది పొలాల గట్లపై, పాత ఇళ్ల వద్ద ఎక్కువగా కనిపిస్తుంటుంది.
జెర్రిపోతు పాము
మన తెలుగు రాష్ట్రాలలో సర్వసాధారణంగా కనిపించే విషం లేని పాము జెర్రిపోతు. దీని శాస్త్రీయ నామం Ptyas mucosa
విషం లేని పాము
ఇది నాగుపాములా తల పైకెత్తి మెడ భాగాన్ని ఉబ్బించి భయ పెట్టగలిగినా, దీనికి వెడల్పైన పడగ ఉండదు.
పడగ ఉండదు
ఇది విషపూరితం కానప్పటికీ, పట్టుకోవడానికి ప్రయత్నిస్తే స్వీయ రక్షణ కోసం కాటు వేయగలదు కాబట్టి దూరం పాటించడం మంచిది.
కాటు వేయడం
జెర్రిపోతు ప్రధానంగా పగటిపూట ఎలుకలు, కప్పలు, బల్లులు, చిన్న పక్షులను వేటాడుతుంది. ఎలుకలను పట్టి తినడం ద్వారా పంటలను దెబ్బతీసే వాటి సంఖ్యను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పగటి పూట ఎలుకలు
అందుకే దీనిని రైతు నేస్తంగా పిలుస్తారు. రెండు మగ జెర్రిపోతులు ఒకదానికొకటి చుట్టుకుని పోరాడుతాయి.ఇది ఆడ పాము కోసం జరిగే పోటీ తప్ప జతకట్టదు.