AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఇక ఈ రైళ్లకు తత్కాల్ టికెట్లు ఉండవు.. కొత్త రూల్స్ ఇవే!

Indian Railways: వందే భారత్ స్లీపర్ రైళ్లు ఆధునిక సౌకర్యాలతో రాత్రి ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మార్చే లక్ష్యంతో రూపొందించారు. అయితే సాధారణ రైళ్లతో పోలిస్తే వీటి టికెట్ బుకింగ్ నిబంధనలు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా తత్కాల్ సదుపాయం లేకపోవడం, RAC..

Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఇక ఈ రైళ్లకు తత్కాల్ టికెట్లు ఉండవు.. కొత్త రూల్స్ ఇవే!
Indian Railways
Subhash Goud
|

Updated on: Nov 11, 2026 | 9:39 AM

Share

Vande Bharat Sleeper: దేశంలో రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భారతీయ రైల్వే శాఖ వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాత్రిపూట సుదూర ప్రయాణాలు చేసే ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన ప్రయాణ అనుభూతిని అందించడమే వీటి లక్ష్యం. అయితే ఈ రైళ్లలో టికెట్ బుకింగ్ విషయంలో కొన్ని కీలక నిబంధనలు అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా సాధారణ రైళ్లలో అందుబాటులో ఉండే తత్కాల్ టికెట్ సదుపాయం వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఉండదు. అలాగే RAC, వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు కూడా అనుమతి లేదు. ప్రయాణానికి ముందు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

1. వందే భారత్ స్లీపర్‌లో తత్కాల్ టికెట్లు ఉండవు:

సాధారణ రైళ్లలో ప్రయాణానికి చివరి నిమిషంలో టికెట్ బుక్ చేసుకోవడానికి తత్కాల్ సదుపాయం ఉపయోగపడుతుంది. అయితే వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ సౌకర్యాన్ని రైల్వే శాఖ అందించడం లేదు. ఈ రైళ్లలో ప్రయాణించాలనుకునే వారు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) సమయంలోనే టికెట్లు బుక్ చేసుకోవాలి. అందుబాటులో ఉన్న బెర్తులన్నీ జనరల్ రిజర్వేషన్ కోటాలోనే ఉంటాయి. ముందుగానే ప్రయాణ ప్రణాళిక చేసుకునే వారికి ఎక్కువ అవకాశాలు కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం.

2. RAC, వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు అనుమతి లేదు

వందే భారత్ స్లీపర్ రైళ్లలో మరో కీలక నిబంధన కూడా ఉంది. ఈ రైళ్లలో కేవలం కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికులకు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది.  RAC టికెట్లతో ప్రయాణించడానికి అనుమతి లేదు. వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు అనుమతి లేదు. అలాగే పాక్షికంగా కన్ఫర్మ్ అయిన టికెట్లతో కూడా ప్రయాణించలేరు. అందువల్ల టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే బెర్త్ కన్ఫర్మ్ అయిందో లేదో ప్రయాణికులు తప్పనిసరిగా పరిశీలించాలి. వందే భారత్ స్లీపర్ రైలు మొత్తం 16 కోచ్‌లతో రూపొందించారు. ఇందులో మూడు రకాల ఏసీ ప్రయాణ సదుపాయాలు ఉంటాయి.

  • AC 3 టైర్ – 611
  • AC 2 టైర్ – 188
  • ఫస్ట్ AC – 24
  • మొత్తం – 823

ఈ రైలును గంటకు గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు. BEML సంస్థ, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) సాంకేతిక సహకారంతో దీనిని అభివృద్ధి చేసింది

3 టికెట్ క్యాన్సిలేషన్ చేస్తే ఎంత డబ్బు తిరిగి వస్తుంది?

వందే భారత్ స్లీపర్ రైళ్లలో కన్ఫర్మ్ టికెట్లను రద్దు చేసుకునే విషయంలో కూడా రైల్వే శాఖ ప్రత్యేక నిబంధనలు ప్రకటించింది. ప్రయాణానికి 72 గంటల ముందు టికెట్‌ రద్దు చేసుకున్నట్లయితే టికెట్ ధరలో 25% వరకు రీఫండ్‌ వస్తుంది. అలాగే 72 గంటల నుంచి 8 గంటల మధ్య టికెట్ ధరలో 50% డబ్బు తిరిగి వస్తుంది. ప్రయాణానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు ఎలాంటి రీఫండ్ రాదు.  ఉదాహరణకు.. మీ టికెట్ ధర రూ.2,000 అనుకుందాం. ప్రయాణానికి 72 గంటల కంటే ముందే క్యాన్సిల్ చేస్తే రూ.500 ఛార్జీగా కట్ చేసి మిగిలిన రూ.1,500 తిరిగి ఇస్తారు. 72 గంటల నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే రూ.1,000 కట్ అవుతుంది. 8 గంటల కంటే తక్కువ సమయం ఉంటే ఎలాంటి రీఫండ్ లభించదు.అయితే మీ టికెట్‌ డబ్బులు కోల్పోయినట్లే.

ఇది కూడా చదవండి: Tiffin Centre: టిఫిన్ సెంటర్ పెడితే నెలకు ఎంత మిగులుతుంది..? బిజినెస్‌ చేసే ట్రిక్స్ ఇవే..!

4. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వందే భారత్ స్లీపర్ రైలు మార్గాలు:

ప్రస్తుతం మూడు జతల వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.

1. హౌరా – కామాఖ్య – హౌరా (27575/27576)

2. వారణాసి – న్యూఢిల్లీ – వారణాసి (27421/27422)

3. SMVT బెంగళూరు – CSMT ముంబై – SMVT బెంగళూరు (27651/27652)

ఈ రైళ్లు వివిధ ప్రాంతాల మధ్య రాత్రిపూట ప్రయాణించే వారికి ఉపయోగపడనున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us