AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఒక్క ఇటుకతో రాజమహల్ నిర్మించడం ఎలా సాధ్యం..? చిక్కుప్రశ్న

చక్రవర్తి అక్బర్ తన తెలివితేటలతో అందరినీ ఆశ్చర్యపరిచే బీర్బల్‌కు ఓ అసాధ్యమైన సవాల్ విసిరాడు. ఒకే ఒక్క ఇటుకలో పూర్తి రాజమహల్‌ను నిర్మించి మరుసటి రోజు ఉదయానికల్లా చూపించాలని ఆదేశించాడు. బీర్బల్ ఆ సవాలును స్వీకరించాడు. అయితే ఈ పనిలో ఓ వింత రహస్యం బయటపడింది. అంతేకాదు, బీర్బల్‌ను అడ్డుకునేందుకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు లేఖ కూడా వచ్చింది. ఇంతకీ ఆ ఇటుకలో ఏముంది? ఈ రహస్యం వెనుక ఉన్నది ఎవరు?

ఒకే ఒక్క ఇటుకతో రాజమహల్ నిర్మించడం ఎలా సాధ్యం..? చిక్కుప్రశ్న
How To Build A Palace With One Brick
Srilakshmi C
|

Updated on: Nov 11, 2026 | 9:55 AM

Share

ఒకరోజు చక్రవర్తి అక్బర్ తన దర్బార్‌లో మంత్రులు, సభాసదులతో కలిసి కొలువుదీరి ఉన్నాడు. అదే సమయంలో ఓ సేవకుడు కొత్తగా తయారుచేసిన కొన్ని ఇటుకలను తీసుకొచ్చాడు. వాటిలో ఒక ఇటుకను చేతిలోకి తీసుకున్న అక్బర్ దానిని పరిశీలిస్తూ ఓ ప్రశ్న అడిగాడు. ఒకే ఒక్క ఇటుకలో పూర్తి రాజమహల్‌ను నిర్మించగల శిల్పి ఎవరైనా ఉన్నారా? అని సభాసదులను ప్రశ్నించాడు. దీంతో దర్బార్‌లోని వారంతా నవ్వుకున్నారు. మహల్ నిర్మించాలంటే వేలాది ఇటుకలు అవసరమని, ఒక్క ఇటుకలో పూర్తి రాజమహల్ నిర్మించడం అసాధ్యమని ఓ మంత్రి చెప్పాడు. మరొకరు అలా చేయగలిగేవారు మనుషులు కాదు.. మాంత్రికులై ఉండాలని వ్యాఖ్యానించాడు. అప్పుడు అక్బర్ బీర్బల్‌ను పిలిచి, మరుసటి రోజు సూర్యోదయానికి ముందే ఆ ఒక్క ఇటుకలో తలుపులు, గదులు, ఆవరణతో సహా పూర్తి రాజమహల్‌ను నిర్మించి చూపించాలని సవాల్ విసిరాడు. బీర్బల్ కూడా ఆ సవాలును స్వీకరించాడు.

దర్బార్ ముగిసిన వెంటనే బీర్బల్ ఓ ప్రసిద్ధ వృద్ధ శిల్పి దగ్గరకు వెళ్లాడు. రాయి, మట్టిపై అద్భుతమైన శిల్పాలను చెక్కడంలో అతడికి మంచి పేరు ఉంది. బీర్బల్ తనకు ఎదురైన సవాల్ గురించి వివరించి ఇటుకను అతనికి అందించాడు. ఇటుకను పరిశీలించిన శిల్పి.. చాలా జాగ్రత్తగా పని చేస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పాడు. చిన్న పొరపాటు జరిగినా ఇటుక విరిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. బీర్బల్ అతనిపై నమ్మకం ఉంచి పనిని ప్రారంభించమని చెప్పాడు. అయితే వారు పని మొదలుపెట్టిన కొద్దిసేపటికే ఓ అనూహ్య ఘటన జరిగింది. దుకాణం బయట ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. తలుపు కింద నుంచి ఓ లేఖ లోపలికి వచ్చింది. అందులో.. ‘ఈ ఇటుకను తాకడం ఆపండి. లేదంటే ఉదయానికల్లా మీ శ్రమ అంతా బూడిదైపోతుంది’ అని బెదిరింపు రాసి ఉంది.

దీంతో శిల్పి భయపడ్డాడు. ఈ పనిని ఆపేయాలని బీర్బల్‌ను కోరాడు. కానీ బీర్బల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎవరో తమను అడ్డుకోవాలని చూస్తున్నారని, అసలు విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. శిల్పి తన పనిని కొనసాగించాడు. ముందుగా చిన్న ప్రవేశ ద్వారం, ఆ తర్వాత కారిడార్, గదులు, మధ్యలో చతురస్రాకారపు ఆవరణను చెక్కాడు. దాని చుట్టూ సన్నని స్తంభాలను కూడా రూపొందించాడు. అనంతరం పైకప్పు, రెండు చిన్న గోపురాలు, ఆవరణలో ఓ ఫౌంటెన్‌ను తయారుచేశాడు. ఇలా రాత్రంతా శ్రమించి ఇటుకలో పూర్తి రాజమహల్ రూపాన్ని తీసుకొచ్చాడు. అయితే పని చేస్తున్న సమయంలో ఇటుకలోని ఓ భాగాన్ని తట్టినప్పుడు డొల్ల శబ్దం వినిపించింది. ఆ భాగంలో ఇప్పటికే కొంత ఖాళీ స్థలం ఉన్నట్లు శిల్పి గుర్తించాడు. ముందుగా మహల్ పనిని పూర్తి చేయాలని బీర్బల్ సూచించాడు. చివరకు శిల్పి అద్భుతమైన నైపుణ్యంతో ఇటుకలో రాజమహల్‌ను చెక్కడం పూర్తి చేశాడు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఇటుకలోని డొల్ల భాగాన్ని జాగ్రత్తగా పరిశీలించారు. అక్కడ ఓ చిన్న పగులు కనిపించడంతో దాన్ని కొద్దిగా వెడల్పు చేశారు. లోపల గుడ్డలో చుట్టిన ఓ చిన్న కాగితం కనిపించింది. దాన్ని బయటకు తీసి చూడగా ఇటుకల సంఖ్య, నిర్మాణ సామగ్రి, కొన్ని తేదీలు, లెక్కలకు సంబంధించిన వివరాలు అందులో ఉన్నాయి. బీర్బల్ ఆ కాగితాన్ని జాగ్రత్తగా తన సంచిలో పెట్టుకున్నాడు. ఆ లెక్కల వెనుక ఏదో రహస్యం ఉందని అతడికి అర్థమైంది. మరుసటి రోజు ఉదయం బీర్బల్ శిల్పితో కలిసి ఇటుకను తీసుకుని దర్బార్‌కు చేరుకున్నాడు. అక్బర్‌తో పాటు సభాసదులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీర్బల్ ఇటుకపై ఉన్న వస్త్రాన్ని తొలగించి చక్రవర్తి ముందు ఉంచాడు.

ఇటుకలో చెక్కిన ప్రవేశ ద్వారం, గదులు, ఆవరణ, గోపురాలను చూసిన అక్బర్ ఆశ్చర్యపోయాడు. తన సవాల్‌ను బీర్బల్ విజయవంతంగా పూర్తి చేశాడని ప్రశంసించాడు. ఈ అద్భుతమైన పనికి కారణమైన శిల్పిని కూడా అభినందించాడు. అయితే బీర్బల్ తన సంచిలో నుంచి బయటకు తీసిన చిన్న కాగితం అక్బర్ దృష్టిని ఆకర్షించింది. దాని గురించి అడగగా, అందులో ఉన్న లెక్కలను రాజ నిర్మాణ శాఖ రికార్డులతో పోల్చి చూడాలని బీర్బల్ సూచించాడు. అక్బర్ వెంటనే నిర్మాణ శాఖకు సంబంధించిన రికార్డులను తీసుకురావాలని ఆదేశించాడు. వాటిని పరిశీలించగా కొన్ని తేదీల్లో ఇటుకల సంఖ్యలో తేడాలు కనిపించాయి. కార్మికుల వేతనాలు, నిర్మాణ సామగ్రి లెక్కలు కూడా సరిపోలలేదు. దీంతో రాజ నిర్మాణ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానం బలపడింది. రాజ ఖజానాకు నష్టం కలిగిస్తూ, కార్మికుల హక్కులను దోచుకుంటున్న వారిని కఠినంగా శిక్షిస్తానని అక్బర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అయితే ఎవరినీ తొందరపడి నిందించకూడదని బీర్బల్ సూచించాడు. ముందుగా ఆధారాలను పూర్తిగా పరిశీలించి, నిజంగా తప్పు చేసిన వారిని గుర్తించాలని చెప్పాడు. పరిశీలనలో కొన్ని తేదీల్లో ఇటుకల సంఖ్యలో తేడాలు ఉన్నట్లు, కార్మికులకు చెల్లించిన వేతనాల లెక్కల్లోనూ వ్యత్యాసాలు ఉన్నట్లు బయటపడింది. రాజ నిర్మాణ శాఖకు చెందిన ఓ గుమస్తా ఆ ఉదయం నుంచి కనిపించడం లేదని సైనికులు సమాచారం అందించారు. దీంతో అక్బర్ అతన్ని వెతికి దర్బార్‌కు తీసుకురావాలని ఆదేశించాడు. గుమస్తాను ప్రశ్నించగా, తనకు లెక్కల గురించి ఏమీ తెలియదని బుకాయించాడు. అప్పుడు బీర్బల్ అతని ముందు ఆ ఇటుకను ఉంచి ‘ఈ ఇటుకను గుర్తుపట్టగలవా?’ అని అడిగాడు. అది సాధారణ ఇటుక మాత్రమేనని గుమస్తా సమాధానమిచ్చాడు. కానీ ఇటుకలో కాగితం దాచిన విషయం ప్రస్తావించగానే అతని ముఖంలో భయం కనిపించింది. బీర్బల్ కాగితంపై ఉన్న తేదీలు, సంఖ్యలను రాజ నిర్మాణ శాఖ లెక్కలతో పోల్చి చూశాడు. అనేక రవాణాల్లో పంపిన ఇటుకల సంఖ్యను తక్కువగా నమోదు చేసినట్లు, కార్మికుల వేతనాల్లోనూ అక్రమాలు జరిగినట్లు తేలింది. చివరకు గుమస్తా తన తప్పును ఒప్పుకున్నాడు. రాజ నిర్మాణానికి సంబంధించిన ఇటుకలను రహస్యంగా అమ్ముతూ, కార్మికుల కూలీల్లో కొంత మొత్తాన్ని తన వద్దే ఉంచుకునేవాడినని అంగీకరించాడు. ఆ అక్రమాలకు సంబంధించిన లెక్కలు బయటపడకుండా ఉండేందుకు కాగితాన్ని ఇటుకలో దాచాడు. బీర్బల్ ఆ ఇటుకపై పని చేస్తున్నాడని తెలిసి, రహస్యం బయటపడకుండా బెదిరింపు లేఖ కూడా పంపించాడు.

నిజం బయటపడటంతో అక్బర్ ఆగ్రహించాడు. దొంగిలించిన సొమ్మును తిరిగి వసూలు చేయాలని, కార్మికులకు రావాల్సిన బకాయి వేతనాలను చెల్లించాలని, గుమస్తాకు తగిన శిక్ష విధించాలని ఆదేశించాడు. ఆ తర్వాత అక్బర్ బీర్బల్‌తో ‘ఈ రోజు నువ్వు నా సవాల్‌ను నెరవేర్చడమే కాకుండా, రాజ నిర్మాణ శాఖలో జరిగిన దొంగతనాన్ని కూడా బయటపెట్టావు’ అని ప్రశంసించాడు. బీర్బల్ వినయంగా సమాధానమిస్తూ ‘ప్రభూ! ఒకే ఇటుకలో మహల్‌ను నిర్మించడం శిల్పి నైపుణ్యానికి నిదర్శనం. కానీ ఒక మహల్ బలంగా నిలవాలంటే ఇటుకలతో పాటు దాన్ని నిర్మించే కార్మికుల కష్టం, నిజాయితీ కూడా ఎంతో ముఖ్యం’ అని చెప్పాడు. అక్బర్ ఆ మాటలకు అంగీకరించాడు.

ఈ కథలో బీర్బల్ తన తెలివితేటలతో అసాధ్యంగా కనిపించిన పనిని సాధించడమే కాకుండా, దాని వెనుక దాగి ఉన్న అక్రమాల ఆనవాళ్లను కూడా గుర్తించాడు. ఒక చిన్న ఇటుకలో దాచిన కాగితం రాజ నిర్మాణ శాఖలో జరుగుతున్న లెక్కల గోల్‌మాల్‌ను బయటపెట్టేందుకు కీలక ఆధారంగా మారింది. సమస్య ఎంత క్లిష్టంగా ఉన్నా ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. అనుమానంతో ఎవరినీ నిందించకుండా, నిజాలను ఆధారాలతో నిరూపించాలి. తెలివితేటలతో పాటు సహనం, పరిశీలన, న్యాయబద్ధత కూడా విజయానికి అవసరం.

Follow Us
ఒకే ఒక్క ఇటుకతో రాజమహల్ నిర్మించడం ఎలా సాధ్యం..? చిక్కుప్రశ్న
ఒకే ఒక్క ఇటుకతో రాజమహల్ నిర్మించడం ఎలా సాధ్యం..? చిక్కుప్రశ్న
హార్దిక్, అర్ష్‌దీప్ ట్రేడ్ కన్ఫామ్.. బీసీసీఐ కీలక ప్రకటన..!
హార్దిక్, అర్ష్‌దీప్ ట్రేడ్ కన్ఫామ్.. బీసీసీఐ కీలక ప్రకటన..!
ఇక ఈ రైలుకు తత్కాల్ టికెట్లు ఉండవు.. కొత్త రూల్స్ ఇవే!
ఇక ఈ రైలుకు తత్కాల్ టికెట్లు ఉండవు.. కొత్త రూల్స్ ఇవే!
చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరిగా తీసుకోండి..
చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరిగా తీసుకోండి..
బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు.. ఇప్పుడే కొనాలా? ఆగాలా?
బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు.. ఇప్పుడే కొనాలా? ఆగాలా?
Viral Video: న్యూజెర్సీ దీపావళి.. నీళ్లు చల్లడం వెనుక కారణం ఇదే!
Viral Video: న్యూజెర్సీ దీపావళి.. నీళ్లు చల్లడం వెనుక కారణం ఇదే!
ఒక టేబుల్ స్పూన్ ఇవి వేస్తే.. ఇడ్లీలు స్పాంజి మాదిరి మారుతాయ్
ఒక టేబుల్ స్పూన్ ఇవి వేస్తే.. ఇడ్లీలు స్పాంజి మాదిరి మారుతాయ్
సెమీస్‌కు చేరిన 4 జట్లు.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
సెమీస్‌కు చేరిన 4 జట్లు.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన బోగీలు..!
ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన బోగీలు..!
Video: ర్యాపిడో రైడర్‌తో ప్రేమలో పడ్డ యువతి.. ఇప్పుడు స్టార్లు!
Video: ర్యాపిడో రైడర్‌తో ప్రేమలో పడ్డ యువతి.. ఇప్పుడు స్టార్లు!