AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027లో మోస్గ్ డేంజరస్ టీం ఇదే.. ఆ ఒక్కడి రాకతో ప్రత్యర్థులకు సుస్సు పడిపోతుందిగా..!

Mumbai Indians 2027 Squad: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్ వేసింది. పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ట్రేడ్ ద్వారా సొంతం చేసుకుంది. దీంతో ఇప్పటికే బుమ్రా, బౌల్ట్, దీపక్ చాహర్‌లతో ఉన్న ముంబై బౌలింగ్ దళం మరింత ప్రాణాంతకంగా మారింది.

IPL 2027లో మోస్గ్ డేంజరస్ టీం ఇదే.. ఆ ఒక్కడి రాకతో ప్రత్యర్థులకు సుస్సు పడిపోతుందిగా..!
Mumbai Indians 2027 Squad
Venkata Chari
|

Updated on: Nov 11, 2026 | 10:41 AM

Share

Mumbai Indians 2027 Squad: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ అంటేనే ఓ బ్రాండ్. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆ జట్టు గత కొన్ని సీజన్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఆరో టైటిల్ లక్ష్యంగా యాజమాన్యం ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగానే టీమిండియా స్టార్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది.

ఈ వార్తను అర్ష్‌దీప్ తండ్రి స్వయంగా ధృవీకరించడంతో ముంబై అభిమానుల్లో సంబరాలు మిన్నంటాయి. కుడిచేతి పేసర్లే కీలకంగా ఉన్న ముంబైకి చాలా కాలంగా ఓ నాణ్యమైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. జహీర్ ఖాన్, మిచెల్ జాన్సన్, ట్రెంట్ బౌల్ట్ తొలి దశ తర్వాత ఆ లోటును అర్ష్‌దీప్ రాక పూడ్చనుందని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.

ఎక్కువమంది చదివినది: Video: 3.2 ఓవర్లలో 7 పరుగులు.. హ్యాట్రిక్‌తోపాటు 6 వికెట్లు.. టీమిండియా బౌలర్ నయా రికార్డ్ గుర్తుందా..?

ఇవి కూడా చదవండి

వాస్తవానికి చెప్పాలంటే, ప్రస్తుత ముంబై పేస్ త్రయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డెత్ ఓవర్ల మాంత్రికుడు జస్ప్రీత్ బుమ్రా, స్వింగ్ సుల్తాన్ ట్రెంట్ బౌల్ట్, పవర్‌ప్లే స్పెషలిస్ట్ దీపక్ చాహర్… వీరికి ఇప్పుడు అర్ష్‌దీప్ తోడయ్యాడు. ముఖ్యంగా కొత్త బంతితో ఇన్‌స్వింగ్, కట్టర్లు, స్లోయర్ యార్కర్లతో అర్ష్‌దీప్ ప్రత్యర్థి ఓపెనర్లకు ముచ్చెమటలు పట్టిస్తాడు. 2024 టీ20 ప్రపంచకప్ విజయంలో అతని పాత్ర మరువలేనిది. పవర్‌ప్లేలో వికెట్లు తీయడం, చివరి ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయడంలో అతనికి అతనే సాటి.

అర్షదీప్ రాకతో..

అర్ష్‌దీప్ రాకతో ముంబైకి మరో వెసులుబాటు కూడా లభించింది. బుమ్రాపై భారం తగ్గనుంది. ఇన్నాళ్లూ బుమ్రా లేకపోతే ముంబై బౌలింగ్ వెలవెలబోయేది. కానీ ఇకపై ఒకవైపు బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుంటే, మరోవైపు అర్ష్‌దీప్ దూకుడుగా విరుచుకుపడతాడు. ఎడమ-కుడి చేతి వాటం కాంబినేషన్‌తో కెప్టెన్‌కు వ్యూహరచనకు ఎంతో అవకాశం లభిస్తుంది. వాంఖడే పిచ్ పేసర్లకు అనుకూలించడం ముంబైకు కలిసొచ్చే అంశం.

ఇక స్పిన్ విభాగం బాధ్యతను న్యూజిలాండ్ అనుభవజ్ఞుడు మిచెల్ శాంట్నర్ మోయనున్నాడు. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, రయాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ వంటి విధ్వంసకారులు ఉండటం ముంబైకి అదనపు బలం.

ఎక్కువమంది చదివినది: 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ప్రపంచ రికార్డుతో తొలి టీంగా జింబాబ్వే సంచలన రికార్డ్..!

అయితే, ఇక్కడే ముంబై ముందు ఓ చిన్న సవాల్ కూడా ఉంది. బౌల్ట్, రికెల్టన్, రూథర్‌ఫర్డ్, శాంట్నర్… నలుగురు విదేశీ ఆటగాళ్ల కోటాలో ఎవరిని ఆడించాలన్నది టీమ్ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారనుంది. అయినప్పటికీ, కాగితంపై చూస్తే మాత్రం ఈసారి ముంబై లైనప్ లోపం లేకుండా కనిపిస్తోంది. అర్ష్‌దీప్ రాక ఆ జట్టును టైటిల్ ఫేవరేట్‌గా నిలబెడుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మొత్తానికి, అనుభవం, యువరక్తం, పేస్, స్వింగ్… అన్నీ కలగలిసిన ముంబై ఈసారి ఎలా చెలరేగుతుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IPL 2027లో మోస్గ్ డేంజరస్ టీం ఇదే.. ఆ ఒక్కడి రాకతో మారిపోయిందిగా
IPL 2027లో మోస్గ్ డేంజరస్ టీం ఇదే.. ఆ ఒక్కడి రాకతో మారిపోయిందిగా
అందంగా లేదని రిజెక్ట్ చేస్తే.. కుర్రాళ్లను ఆగం చేస్తున్న హీరోయిన్
అందంగా లేదని రిజెక్ట్ చేస్తే.. కుర్రాళ్లను ఆగం చేస్తున్న హీరోయిన్
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. అదేంటో తెలుసా?
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. అదేంటో తెలుసా?
ఫ్రిజ్‌లో పెట్టకుండానే 25 రోజుల వరకు నిల్వ ఉండే గుడ్డు పచ్చడి..!
ఫ్రిజ్‌లో పెట్టకుండానే 25 రోజుల వరకు నిల్వ ఉండే గుడ్డు పచ్చడి..!
రేషన్ షాపుల్లో తక్కువ ధరకే నిత్యావసరాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ షాపుల్లో తక్కువ ధరకే నిత్యావసరాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
బీరకాయ తొక్కల పచ్చడి ఇలా చేస్తే.. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు!
బీరకాయ తొక్కల పచ్చడి ఇలా చేస్తే.. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు!
గ్రీస్‏లోనే అనిరుధ్, కావ్య పెళ్లి ఎందుకు.. ?
గ్రీస్‏లోనే అనిరుధ్, కావ్య పెళ్లి ఎందుకు.. ?
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్..ప్రారంభించనున్న అమిత్ షా
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్..ప్రారంభించనున్న అమిత్ షా
నిద్ర లేచే సరికి షాకింగ్ సీన్.. అమ్మాయిల జడలు కత్తిరిస్తుందెవరు..
నిద్ర లేచే సరికి షాకింగ్ సీన్.. అమ్మాయిల జడలు కత్తిరిస్తుందెవరు..
ఒకే ఒక్క ఇటుకతో రాజమహల్ నిర్మించడం ఎలా సాధ్యం..? చిక్కుప్రశ్న
ఒకే ఒక్క ఇటుకతో రాజమహల్ నిర్మించడం ఎలా సాధ్యం..? చిక్కుప్రశ్న