AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: కెప్టెన్‌గా శ్రేయాస్.. తెలుగోడితోపాటు మరో ఇద్దరికి పిలుపు.. చివరి రెండు వన్డేలకు భారత జట్టు ఇదే..!

IND vs NZ ODI Series: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తిలక్ వర్మ, యశ్ ఠాకూర్, కుమార్ కుశాగ్రలకు జట్టులో చోటు దక్కింది. టెస్ట్ సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించే ఉద్దేశంతో బీసీసీఐ ఈ మార్పులు చేసింది. ఈ ముగ్గురిలో ఇద్దరికి వన్డేల్లో ఇదే తొలి అవకాశం కావడం విశేషం.

IND vs NZ: కెప్టెన్‌గా శ్రేయాస్.. తెలుగోడితోపాటు మరో ఇద్దరికి పిలుపు.. చివరి రెండు వన్డేలకు భారత జట్టు ఇదే..!
Ind Vs Nz 4th, 5th T20is Team India Squad
Venkata Chari
|

Updated on: Nov 10, 2026 | 2:09 PM

Share

IND vs NZ ODI Series: న్యూజిలాండ్‌ పర్యటనలో భారత జట్టు బిజీ షెడ్యూల్‌ను ఎదుర్కొంటోంది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే మూడో వన్డే వర్షం కారణంగా రద్దు కావడంతో చివరి రెండు మ్యాచ్‌లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో నాలుగో, ఐదో వన్డేల కోసం భారత జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి.

తిలక్ వర్మ (Tilak Varma), యశ్ ఠాకూర్ (Yash Thakur), కుమార్ కుశాగ్ర (Kumar Kushagra)లకు చివరి రెండు మ్యాచ్‌ల జట్టులో అవకాశం లభించింది. వీరిలో తిలక్ ఇప్పటికే భారత్ తరఫున ఐదు వన్డేలు ఆడాడు. అయితే యశ్, కుమార్ కుశాగ్రలకు భారత వన్డే జట్టులో ఇదే తొలి పిలుపు.

మార్పులకు కారణం ఇదే..!

భారత్‌ న్యూజిలాండ్‌ పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్‌లు కూడా ఆడనుంది. ఈ సిరీస్ నవంబర్ 19న ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో నిలవాలంటే ఈ టెస్ట్ మ్యాచ్‌లు భారత్‌కు కీలకం. వన్డే సిరీస్ ముగిసిన మూడు రోజులకే తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: Video: 3.2 ఓవర్లలో 7 పరుగులు.. హ్యాట్రిక్‌తోపాటు 6 వికెట్లు.. టీమిండియా బౌలర్ నయా రికార్డ్ గుర్తుందా..?

ఈ కారణంగా టెస్ట్ జట్టులో ఉన్న శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, అన్షుల్ కాంబోజ్ వంటి ఆటగాళ్లకు తొలి మూడు వన్డేల వరకే అవకాశం కల్పించారు. చివరి రెండు మ్యాచ్‌లకు వీరి స్థానాల్లో కొత్త ఆటగాళ్లను చేర్చారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ మార్పులు బీసీసీఐ ప్రకటించిన రెండు వేర్వేరు వన్డే జట్లలో భాగం.

చివరి రెండు వన్డేలకు భారత జట్టు ఇదే..!

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో బరిలోకి దిగనున్న భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు కొనసాగుతున్నారు. ఇషాన్ కిషన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

జట్టులోని మిగతా ఆటగాళ్లు: తిలక్ వర్మ, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, నామన్ ధీర్, ఔకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, కుమార్ కుశాగ్ర, మహమ్మద్ సిరాజ్, యశ్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్.

ఎక్కువమంది చదివినది: 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ప్రపంచ రికార్డుతో తొలి టీంగా జింబాబ్వే సంచలన రికార్డ్..!

నాలుగో వన్డే నవంబర్ 13న, ఐదో వన్డే నవంబర్ 15న మౌంట్ మాంగనూయ్‌లోని బే ఓవల్ మైదానంలో జరగనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో యువ ఆటగాళ్లకు తుది జట్టులో అవకాశం దక్కుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us