AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం..! చేతులు ఎలా వచ్చాయి.. జామపండు కోసిన పాపానికి ఇంతటి శిక్షా?

శ్రీ సత్యసాయి జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పక్కింటి పెరట్లో జామపండు కోసిందన్న కోపంతో ఆరేళ్ల చిన్నారిపై ఓ వృద్ధురాలు విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పరిగి మండలం ఊటకూరు గ్రామంలో కలకలం రేపింది.

దారుణం..! చేతులు ఎలా వచ్చాయి.. జామపండు కోసిన పాపానికి ఇంతటి శిక్షా?
Girl Over Guava
Balaraju Goud
|

Updated on: Nov 11, 2026 | 11:09 AM

Share

శ్రీ సత్యసాయి జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పక్కింటి పెరట్లో జామపండు కోసిందన్న కోపంతో ఆరేళ్ల చిన్నారిపై ఓ వృద్ధురాలు విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పరిగి మండలం ఊటకూరు గ్రామంలో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. ఊటకూరు గ్రామానికి చెందిన అల్ఫియా అనే ఆరేళ్ల చిన్నారి తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లారు. ఈ క్రమంలో చిన్నారి ఇంటి పక్కనే ఉన్న పెరట్లో ఆడుకుంటూ జామపండు కోసింది. ఇది గమనించిన పక్కింటి వృద్ధురాలు మంజమ్మ ఆగ్రహంతో చిన్నారిపై దాడి చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాయితో బలంగా కొట్టడంతో చిన్నారికి తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగినట్లు తెలిపారు.

దాడిలో చిన్నారి అపస్మారక స్థితికి చేరుకోవడంతో భయపడిన వృద్ధురాలు కొద్దిసేపు చిన్నారిని తన ఇంట్లోనే ఉంచింది. మరోవైపు అల్ఫియా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు గ్రామమంతా వెతికారు. ఈ క్రమంలో వృద్ధురాలి ఇంటి పెరట్లో రక్తపు మరకలు కనిపించడంతో అనుమానం వచ్చి ఆమెను నిలదీశారు. అయితే చిన్నారిని కుక్క కరిచిందంటూ వృద్ధురాలు సమాధానం చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు.

అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న అల్ఫియాను గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పరిగి పోలీసులు వృద్ధురాలు మంజమ్మపై కేసు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. చిన్నారిపై జరిగిన దాడి స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జామపండు కోసిందని ఆరేళ్ల చిన్నారిపై రాక్షసంగా దాడి!
జామపండు కోసిందని ఆరేళ్ల చిన్నారిపై రాక్షసంగా దాడి!
విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ప్రత్యక్ష ప్రసారం
విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ప్రత్యక్ష ప్రసారం
కంపుకొడుతున్న హైదరాబాద్‌ క్లౌడ్ కిచెన్లు.. లైసెన్సులు సస్పెండ్!
కంపుకొడుతున్న హైదరాబాద్‌ క్లౌడ్ కిచెన్లు.. లైసెన్సులు సస్పెండ్!
IPL 2027లో మోస్గ్ డేంజరస్ టీం ఇదే.. ఆ ఒక్కడి రాకతో మారిపోయిందిగా
IPL 2027లో మోస్గ్ డేంజరస్ టీం ఇదే.. ఆ ఒక్కడి రాకతో మారిపోయిందిగా
అందంగా లేదని రిజెక్ట్ చేస్తే.. కుర్రాళ్లను ఆగం చేస్తున్న హీరోయిన్
అందంగా లేదని రిజెక్ట్ చేస్తే.. కుర్రాళ్లను ఆగం చేస్తున్న హీరోయిన్
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. అదేంటో తెలుసా?
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. అదేంటో తెలుసా?
ఫ్రిజ్‌లో పెట్టకుండానే 25 రోజుల వరకు నిల్వ ఉండే గుడ్డు పచ్చడి..!
ఫ్రిజ్‌లో పెట్టకుండానే 25 రోజుల వరకు నిల్వ ఉండే గుడ్డు పచ్చడి..!
రేషన్ షాపుల్లో తక్కువ ధరకే నిత్యావసరాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ షాపుల్లో తక్కువ ధరకే నిత్యావసరాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
బీరకాయ తొక్కల పచ్చడి ఇలా చేస్తే.. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు!
బీరకాయ తొక్కల పచ్చడి ఇలా చేస్తే.. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు!
గ్రీస్‏లోనే అనిరుధ్, కావ్య పెళ్లి ఎందుకు.. ?
గ్రీస్‏లోనే అనిరుధ్, కావ్య పెళ్లి ఎందుకు.. ?