పెళ్లి పీటలెక్కబోతున్న పూజా హెగ్డే.. నెట్టింట రూమర్స్ వైరల్..
Rajitha Chanti
Pic credit - Instagram
02 August 2026
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ పూజా హెగ్డే. బుట్టబొమ్మగా అభిమానుల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ.
కొన్నాళ్లుగా సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తుంది పూజా. ఒకప్పుడు వరుస హిట్లు అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు వరుస ప్లాపులతో నెట్టుకోస్తుంది ఈ వయ్యారి.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు పూజా హెగ్డే త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతోందంటూ ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
తన గ్లామర్, అభినయంతో కోట్లాది మంది హృదయాలను దోచుకున్న ఈ పొడుగు కాళ్ల సుందరి, ఈసారి తన పెళ్లి వార్తలతో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న కథనాల ప్రకారం.. పూజా హెగ్డే వివాహం ప్రేమ వివాహం కాదని, పూర్తిగా కుటుంబ సభ్యులు కుదిర్చిన పెళ్లేనని తెలుస్తోంది.
ఇంట్లో వారు చూసిన సంబంధానికి పూజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఆమె చేసుకోబోయే వరుడు సినీ రంగానికి చెందినవారా? లేక వ్యాపార రంగానికి చెందిన బడా వ్యాపారవేత్తా? అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.
ఈ వార్తలపై ఇప్పటివరకు పూజా హెగ్డే లేదా ఆమె టీమ్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, అభిమానులు మాత్రం శుభవార్త కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్