AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehaboob Dil Se: అనాథాశ్రమంలో పుట్టిన రోజు జరుపుకొన్న బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్.. అందరికీ భోజనాలు.. వీడియో

గత కొన్ని గంటలుగా బిగ్ బాస్ ఫేమ్, ఫేమస్ యూట్యూబర్ మెహబూబ్ దిల్ సే పేరు బాగా వినిపిస్తోంది. సోమవారం (జులై 29) తన పుట్టిన రోజు సందర్భంగా తన స్నేహితులందరికీ గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు మెహబూబ్. ఇందుకోసం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో ఉండే కాంటినెంట్ రిసార్ట్‌లో ఘనంగా ఏర్పాట్లు చేశాడు.

Mehaboob Dil Se: అనాథాశ్రమంలో పుట్టిన రోజు జరుపుకొన్న బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్.. అందరికీ భోజనాలు.. వీడియో
Mehaboob Dil Se
Basha Shek
|

Updated on: Jul 31, 2024 | 7:41 PM

Share

గత కొన్ని గంటలుగా బిగ్ బాస్ ఫేమ్, ఫేమస్ యూట్యూబర్ మెహబూబ్ దిల్ సే పేరు బాగా వినిపిస్తోంది. సోమవారం (జులై 29) తన పుట్టిన రోజు సందర్భంగా తన స్నేహితులందరికీ గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు మెహబూబ్. ఇందుకోసం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో ఉండే కాంటినెంట్ రిసార్ట్‌లో ఘనంగా ఏర్పాట్లు చేశాడు. సాధారణంగా బర్త్ డే పార్టీ అంటే విందులు, వినోదాలతో పాటు మద్యం కూడా ఉండాల్సిందే. అయితే ఆ రిసార్ట్ లో మద్యం తాగడానికి అనుమతుల్లేవు. దీనికి సంబంధించి రిసార్ట్ ఓనర్ కూడా సరైన సమాచారం ఇవ్వలేదట. దీంతో బర్త్ డే పార్టీ ఎంజాయ్ చేస్తోన్న మెహబూబ్, అతని స్నేహితులపై పోలీసులు దాడులు నిర్వహించారు. రిసార్టులో భారీ ఎత్తున మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయం బయటకు వేరేలా పొక్కింది. మెహబూబ్ అండ్ కో రిసార్ట్ లో రేవ్ పార్టీ చేసుకున్నారని సోషల్ మీడియలో పుకార్లు షికార్లు వినిపించాయి. దీంతో స్వయంగా మెహబూబ్ నే రంగంలోకి దిగాడు. తన బర్త్ డే పార్టీపై వస్తోన్న అసత్య ప్రచారాన్ని ఖండించాడు. అయితే ఈ తతంగమంతా జరగడానికి ముందు ఈ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ చేసిన ఒక మంచి పని అందరి మనసులను కదలిస్తోంది. అదేంటంటే.. తన పుట్టిన రోజును ఒక అనాథాశ్రమంలో సెలబ్రేట్ చేసుకున్నాడు మెహబూబ్.

ఈ సందర్భంగా అనాథ ఆశ్రమంలోని పిల్లలతో కలిసి తన బర్త్ డే కేక్‌ కట్‌ చేశాడు మెహబూబ్. దానిని అందరికీ పంచి పెట్టాడు. అంతేకాదు అక్కడున్న పిల్లలందరికీ ఒక పూట మంచి భోజనం అందించాడు. అలాగే పిల్లలతో ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ ఎంజాయ్ చేశాడు. వారితో సరదాగా ఫొటోలు కూడా దిగాడు. అనంతరం ఈ మధురమైన క్షణాలకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు.ఇది కాస్తా నెట్టింట వైరల్ గామారింది. ‘మెహబూబ్ దిల్ సే’ పేరుకు తగ్గట్టుగానే అతని మనసు చాలా గొప్పదంటూ దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అనాథాశ్రమంలో బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ దిల్ సే..

రిసార్ట్ లో స్నేహితులతో మెహబూబ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కిటకిటలాడుతున్న తిరుమల శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్
కిటకిటలాడుతున్న తిరుమల శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్
ఈ అన్నాచెల్లెళ్లను గుర్తు పట్టారా? తెలుగులోఫేమస్ హీరో, హీరోయిన్
ఈ అన్నాచెల్లెళ్లను గుర్తు పట్టారా? తెలుగులోఫేమస్ హీరో, హీరోయిన్
మంగళగిరిలో ఎయిర్ పోర్ట్‌ను తలదన్నేలా.. రైల్వే హబ్
మంగళగిరిలో ఎయిర్ పోర్ట్‌ను తలదన్నేలా.. రైల్వే హబ్
భక్తులకు గుడ్‌న్యూస్.. అన్ని టీటీడీ ఆలయాల్లోనూ అన్నప్రసాద వితరణ
భక్తులకు గుడ్‌న్యూస్.. అన్ని టీటీడీ ఆలయాల్లోనూ అన్నప్రసాద వితరణ
డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ కూడా ఫుల్ హ్యాపీ
డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ కూడా ఫుల్ హ్యాపీ
భారత్‌ ఎకానమి రేంజ్‌ ఇదీ.. అంచనాలను పెంచిన ఐఎంఎఫ్‌
భారత్‌ ఎకానమి రేంజ్‌ ఇదీ.. అంచనాలను పెంచిన ఐఎంఎఫ్‌
ఇలా చేస్తే దెబ్బకు డయాబెటిస్‌ రివర్స్..
ఇలా చేస్తే దెబ్బకు డయాబెటిస్‌ రివర్స్..
రాత్రిపూట అకస్మాత్తుగా మేల్కొంటున్నారా..? ప్రమాదంలో ఉన్నట్లే..
రాత్రిపూట అకస్మాత్తుగా మేల్కొంటున్నారా..? ప్రమాదంలో ఉన్నట్లే..
సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? తక్కువ వడ్డీకే రుణాలు
సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? తక్కువ వడ్డీకే రుణాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజర్ పోస్టుల కోసం అప్లై చేయండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజర్ పోస్టుల కోసం అప్లై చేయండి