Brahmamudi, August 1st Episode: కళ్యాణ్‌ని ఘోరంగా అవమానించిన కనకం.. రుద్రాణి మరో స్కెచ్..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అప్పూ పెళ్లికి దుగ్గిరాల కుటుంబంలోని అందర్నీ పిలవడానికి వస్తుంది కనకం. ముందుగా ధాన్య లక్ష్మికి పెళ్లి కార్డు ఇచ్చి.. నా కూతురి కళ్యాణం కల్లారా చూసి.. మనసులో ఆ దృశ్యాన్ని శాశ్వతంగా ముద్రించుకుని.. నిందలు వేయకుండా ఆశీర్వదించాలని చెబుతుంది. ఆ తర్వాత పెద్దాయన, పెద్దావిడకు పెళ్లి కార్డు ఇస్తూ.. ఈ ఇంట్లో ఒకే కార్డు ఇవ్వాల్సింది. కానీ మూడు కార్డులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో..

Brahmamudi, August 1st Episode: కళ్యాణ్‌ని ఘోరంగా అవమానించిన కనకం.. రుద్రాణి మరో స్కెచ్..
Brahmamudi
Follow us

|

Updated on: Aug 01, 2024 | 1:15 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అప్పూ పెళ్లికి దుగ్గిరాల కుటుంబంలోని అందర్నీ పిలవడానికి వస్తుంది కనకం. ముందుగా ధాన్య లక్ష్మికి పెళ్లి కార్డు ఇచ్చి.. నా కూతురి కళ్యాణం కల్లారా చూసి.. మనసులో ఆ దృశ్యాన్ని శాశ్వతంగా ముద్రించుకుని.. నిందలు వేయకుండా ఆశీర్వదించాలని చెబుతుంది. ఆ తర్వాత పెద్దాయన, పెద్దావిడకు పెళ్లి కార్డు ఇస్తూ.. ఈ ఇంట్లో ఒకే కార్డు ఇవ్వాల్సింది. కానీ మూడు కార్డులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఆ నెక్ట్స్ రుద్రాణి దగ్గరకి వెళ్లి.. మీలాంటి వారు, మీలా అనుమానించే వారు.. ఇక నుంచైనా నా కుటుంబం, నా కూతురి పెళ్లి మీద దృష్టి పెట్టకుండా.. పెళ్లికి వచ్చి చెడగొట్టే ఆలోచనలు పెట్టకుండా.. అక్షింతలు వేసి ఆశీర్వదించాలని కోరుతున్నా అని పెళ్లి కార్డు ఇస్తుంది కనకం.

కళ్యాణ్‌ని పెళ్లి రావద్దన్న కనకం..

మీలాంటి వారు మా లాంటి పేదల పెళ్లికి వస్తే.. ఎంతో సంతోషిస్తాను అని పెద్ద వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది కనకం. ఇంతకీ ఈ పెళ్లి అయినా సక్రమంగా జరుగుతుందా? అని రుద్రాణి పుల్ల పెడుతుంది. దీంతో రెచ్చిపోయిన కనకం.. సీరియస్‌గా చూస్తుంది. చివరి నిమిషంలో పెళ్లి కొడుకు లేడని.. పెళ్లి ఆగిపోయిందని మా కళ్యాణ్‌కే కట్టబెట్టాలనే ఆలోచన ఏమీ లేదు కదా అని రుద్రాణి అంటే.. నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదని మరోసారి రుజువు చేశావని స్వప్న గడ్డి పెడుతుంది. నువ్వూ, నేను చచ్చేదాకా నిన్ను మాత్రం రుద్రాణి గారూ అని పిలవను. ఏదో అన్నావు ఏంటి? దానికి సమాధానం చెప్పడానికే వచ్చాను అని కళ్యాణ్ దగ్గరకు వెళ్తుంది కనకం. చూడండి బాబూ మీరు గొప్పవారు.. పైగా కవిగారు మీలాంటి వాళ్లు నా ఇంటికి వస్తే కాళ్లు కడిగి ఆహ్వానించాల్సిన నేను.. తలుపు మూసి అవమానించాను. కానీ అందుకు కారణం ఎవరో మీకు తెలుసు. ఇప్పుడు మా ఇంట్లో మీ స్నేహితురాలి పెళ్లి జరుగుతుంది. ఈ సందర్భంగా మీరు నాకు మాట ఇవ్వాలి. ఈ పెళ్లికి మీరు రావద్దు అని దణ్ణం పెట్టి అడుగుతుంది కనకం.

అప్పూ బాధ.. కనకం కన్నీళ్లు..

ఎందుకు.. ఏంటి.. అనేది మీతో పాటు ఇక్కడున్న అందరికీ తెలుసు. నా కూతురి పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని కోరుకుంటున్నా. కాబట్టి మిమ్మల్ని రావద్దని హక్కు లేకపోవచ్చు. కానీ మా కుటుంబానికి ఎలాంటి మచ్చ రాకూడదంటే.. ఆ పెళ్లిలో మీరు ఉండకూడదు. అర్థం చేసుకోండి అని కనకం చెప్పగానే కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కనకం కూడా వెళ్తుంది. మరోవైపు అప్పూ ఎంతో దిగాలుగా కూర్చుని ఉంటుంది. ఏంటే ఇంత రాత్రి అయినా నిద్ర రావడం లేదా.. పెళ్లి తర్వాత మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోవాలనే కదా ఆలోచిస్తున్నావ్ అని అనగానే అప్పూ ఏడుస్తుంది. ప్రతీ ఆడపిల్లకు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది. కన్నవాళ్లను, పుట్టింటిని వదిలి వెళ్లక తప్పదు. రేపు నువ్వు నీ మొగుడితో కలిసి సంతోషంగా ఉన్నప్పుడు.. మేము ఫోన్ చేసినా బిజీగా ఉన్నానని పెట్టేస్తావు. ఇక కనకం, కృష్ణమూర్తిలు ఇద్దరూ అప్పూని ఓదార్చుతారు.

ఇవి కూడా చదవండి

కావ్యతో రాజ్ పందెం..

ఈ సీన్ కట్ చేస్తే.. కావ్య బెడ్‌ రూమ్‌లో ఆలోచిస్తూ నడుస్తుంది. అప్పుడే రాజ్ వచ్చి.. ఏం అనుకుంటుంది మీ అమ్మ. శుభలేఖ ఇచ్చాక రావాలి అనుకున్న వాళ్లు వస్తారు. ఇష్టం లేని వాళ్లు ఆగిపోతారు. మా తమ్ముడిని రావద్దని అనడం ఏంటి? మా తమ్ముడిని దారుణంగా అవమానించిందని రాజ్ అంటే.. దానికి అర్థం ఏంటో మీకు అర్థం కాలేదా? మా అమ్మ సంస్కారం కూడా మర్చిపోయి.. పెళ్లికి రావద్దు అని అందంటే.. తల్లిగా మాత్రమే ఆలోచించదని అర్థం అని కావ్య అంటుంది. అది చూసి కూడా నువ్వు ఏమీ మాట్లాడలేదు. అప్పూ కోసం మా తమ్ముడు ఎన్ని చేశాడు.. ఎన్ని అవమానాలు పడ్డాడు మర్చిపోయారా అని రాజ్ అంటే.. ఏదీ మర్చిపోలేదు. ఎక్కడి వాళ్లు అక్కడ ఉంటేనే మర్యాద. ఒకవేళ కవి గారు పెళ్లికి వస్తే.. రుద్రాణి లాంటి వాళ్లు ఏమన్నా అంటే.. ఆయన బాధ పడరా అని కావ్య అంటుంది. వాడు అసలు ఏం కోరుకుంటున్నాడో నీకు తెలిసినా.. వాళ్ళిద్దరినీ విడదీస్తున్నావని రాజ్ సీరియస్ అవుతాడు. మా ఇంటి పరువు కాపాడుతున్నా. మా చెల్లెలి మీద పడ్డ నింద నిజం కాదని రుజువు చేయాలి అనుకుంటున్నా అని కావ్య అంటే.. అప్పూ కళ్యాణ్‌ని ప్రేమిస్తుందని రాజ్ అంటుంటే.. కావ్య కాదని వాదిస్తుంది.

రుద్రాణి మరో స్కెచ్..

మొత్తానికి అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేశావు. ధాన్య లక్ష్మి అత్తయ్యని అడ్డు పెట్టుకుని.. ఆ కావ్య చేతనే అప్పూకి వేరే వ్యక్తితో పెళ్లి జరిగేలా చేస్తున్నావ్ అని రాహుల్ అంటే.. ఇల్లు అలకగానే సరిపోదు.. ఇది అనుకున్నది అనుకున్నట్టుగా జరిగాలి. ఆ కావ్య ఈ పెళ్లి ఆపకుండా చూడాలి. వెనుక ఏదన్నా ప్లాన్ వేసి.. అప్పూకి, కళ్యాణ్‌కి పెళ్లి జరిగేలా చేస్తే.. అప్పుడు ఏం చేస్తావ్? అందుకే ఆ కళ్యాణ్ అసలు పెళ్లి మండపానికి రాకుండా చేయాలని రుద్రాణి అంటుంది. నాకు ఎందుకో నువ్వు కావ్యకి లేనిపోని ఐడియాలు ఇస్తున్నావ్ అనుకుంటున్నా. దీన్ని ఇలా వదిలేస్తేనే మంచిదని రాహుల్ అంటే.. అవకాశం ఎప్పుడూ మన చేతుల్లోనే ఉండాలి. ఆ అవకాశం కావ్యకు ఇవ్వను. ఇప్పుడే వెళ్లి ధాన్య లక్ష్మిని వాడుకుని కళ్యాణ్‌ని మండపానికి రాకుండా ఆపుతానని రుద్రాణి.. ధాన్య లక్ష్మి దగ్గరకు వెళ్తుంది.

ధాన్యలక్ష్మితో ఆడుకుంటున్న రుద్రాణి..

నీ కొడుకు గురించి ఆలోచిస్తున్నావా? అని రుద్రాణి అడుగుతుంది. ఇంకేంటి.. తెల్లవారితే అప్పూ పెళ్లి. ఓ నాలుగు రోజులు బాధ పడి ఆ తర్వాత పట్టించుకోవడం మానేస్తాడని ధాన్య లక్ష్మి అంటే.. ఇదంతా మనం అనుకున్నదే. కానీ అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందనే నమ్మకం ఉందా? కళ్యాణ్ మనసు మార్చి అప్పూతో పెళ్లి జరిపించాలని కావ్య అనుకుంటే.. అప్పుడు ఏం చేస్తావ్? అని రుద్రాణి అంటుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావ్? అని ధాన్య లక్ష్మి అడుగుతుంది. అప్పూ పెళ్లి జరిగేంత వరకూ నీ కొడుకు ఇక్కడ ఉండకూడదు. వెంటనే వేరే ఊరు పంపించేయ్ అని రుద్రాణి అంటే.. నువ్వు అన్నది నిజమే.. వాడిని వెంటనే బెంగుళూరు పంపిస్తాను అని ధాన్య లక్ష్మి.. కళ్యాణ్ దగ్గరకు వెళ్తుంది.

కళ్యాణ్‌ని బెంగుళూరు పంపిస్తున్న ధాన్య లక్ష్మి..

పెళ్లి కార్డు చూస్తూ ఉంటాడు కళ్యాణ్. వెంటనే ఆ పెళ్లి కార్డును చించేస్తుంది ధాన్య లక్ష్మి. కళ్యాణ్ వెంటనే సీరియస్ అవుతాడు. దొంగలా పక్క నుంచి అంతా చూస్తుంది రుద్రాణి. నా కొడుకుని ఇలా బాధలోకి నెట్టేసే మనిషి ఏం అయితే నాకెందుకు? నాకు నీ సంతోషం, ఆనందం ముఖ్యం. ఇంకా ఎందుకు దాని గురించి ఆలోచించి బాధ పడుతున్నావ్? ఈ తల్లి బాధను అర్థం చేసుకో అని ధాన్యం అంటే.. కళ్యాణ్ పట్టించుకోడు. నా మాట వినరా.. మీ అమ్మమ్మకి ఫోన్ చేసి చెప్పాను. నువ్వు వస్తున్నావు అని.. కొన్ని రోజులు బెంగుళూరు వెళ్లు.. అని ధాన్య లక్ష్మి అంటే.. నేను వెళ్లను.. నా ఇష్టాలను అస్సలు పట్టించుకున్నావా? అని కళ్యాణ్ అంటాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.