ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. వీటిల్లో విటమిన్ ఎ, డి, ఇ, కె లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్ వంటి పోషకాలు దండిగా ఉంటాయి
TV9 Telugu
ముఖ్యంగా గుడ్డును ఉడికించి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే గుడ్డులోని పచ్చసొనను తీసుకోవాలా? వద్దా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది
TV9 Telugu
నిజానికి పచ్చసొనలో కూడా అనేక రకాల పోషకాలు ఉంటాయి. పచ్చసొనలో విటమిన్ ఎ, డి, ఇ వంటి పోషకాలు ఉంటాయి. సెలీనియంతో పాటు ఇతర ఖనిజాలు ఉంటాయి
TV9 Telugu
గుడ్డులోని పచ్చసొనలో కోలిన్ ఉంటుంది. ఇది మెదడు అభివృద్దికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పచ్చసొనలో లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి
TV9 Telugu
ఇవి కంటిచూపును మెరుగుపరుస్తాయి. గుడ్డు పచ్చసొనలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో శరీర బరువు నియంత్రణలో ఉంటుంది
TV9 Telugu
గుడ్డు పచ్చసొన తీసుకుంటే ఒంట్లో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీనిలో ఉండే విటమిన్ డి క్యాల్షియం శోషణలో సహాయపడుతుంది. ఎముకలు ధృడంగా బలంగా తయారవుతాయి
TV9 Telugu
అయితే గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. ఇప్పటికే ఒంట్లో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు దీనిని తీసుకోకపోవడమే మంచిది
TV9 Telugu
అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు వంటి అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. అలాగే పూర్తిగా ఉడకని పచ్చసొనలో అస్సలు తీసుకోకూడదు. ఇందులోని సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది