దాల్చిన చెక్కతో మధుమేహానికి కళ్లెం.. ఎలాగంటే?

12 September 2025

TV9 Telugu

TV9 Telugu

దాల్చిన చెక్కలో విటమిన్లతో పాటు ఐరన్‌, జింక్‌, క్యాల్షియం, క్రోమియం, మ్యాంగనీస్‌, మెగ్నీషియం వంటి ఖనిజాలూ ఉంటాయి. దీనిలోని సినమల్‌డిహైడ్‌ అనే వృక్ష రసాయనం మంచి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది

TV9 Telugu

విశృంఖల కణాల పనిపట్టే ఇది క్యాన్సర్‌ నివారణకు తోడ్పడుతుంది. దాల్చిన చెక్క రక్తంలో గ్లూకోజు మోతాదులు తగ్గటానికీ ఉపయోగపడుతుంది

TV9 Telugu

దీనిలో సాలిసైలిక్‌ ఆమ్లం పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది కణాల్లో అంతర్గత వాపు ప్రక్రియ(ఇన్‌ఫ్లమేషన్‌)ను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గించటమే కాదు, మంచి కొలెస్ట్రాల్‌ పెరిగేలా చేయగలదు కూడా

TV9 Telugu

ఇటీవలి రోజుల్లో డయాబెటిస్ వ్యాధి సమస్య చాలా మందిని వేధిస్తోంది. అయితే దాల్చిన చెక్క మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది

TV9 Telugu

కాబట్టి వంటలో దాల్చిన చెక్కను ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంట రుచిని పెంచే దాల్చిన చెక్కలో పొటాషియం, విటమిన్లు, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి

TV9 Telugu

దాల్చిన చెక్క వినియోగం ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది

TV9 Telugu

దాల్చిన చెక్క వినియోగం మధుమేహ వ్యాధిగ్రస్తులలో కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది

TV9 Telugu

దాల్చిన చెక్కతో టీ కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే పాలలోనూ కలిపి తాగవచ్చు. రోజుకు గరిష్టంగా 6 గ్రాముల దాల్చిన చెక్క తినవచ్చు