27 December 2025

 కిచెన్‏లో ఉండే ఈ రెండు నా అందానికి రహస్యం.. కృతి ఏం చెప్పిందంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్న బ్యూటీ కృతి శెట్టి. ఇప్పుడు తమిళంలో బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి ఉప్పెన సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్ స్టాలో 41 లక్షల మంది పైగా ఫాలోవర్స్ ఉన్నరు. తాజాగా తన బ్యూటీ సీక్రెట్స్ రివీల్ చేస్తూ ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఇంట్లోనే వంటగదిలో ఉండే పలు పదార్థాలే తన అందానికి రహాస్యమని చెప్పుకొచ్చింది. సహజ సిద్ధంగా తన చర్మం మెరిచేందుకు కారణం ఇదేనట.

ఇంట్లోనే తన స్వయంగా ఓ ఫేస్ ప్యాక్ వేసుకుంటుంది. వాటితో ఎవరైనా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చని తెలిపింది.  ప్యాక్ కోసం శనగ పిండి ఉపయోగిస్తుందట.

అలాగే పసుపు, నిమ్మరసం, తేనె, పచ్చిపాలు అన్నింటిని కలిపి ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుంటానని తెలిపింది. ఈ ప్యాక్ చర్మాన్ని మరింత మెరిచేలా చేస్తుందట. 

ఈ ఫేస్ ప్యాక్ రెండుసార్లు అప్లై చేయడం కొన్ని నెలల్లోనే రిజల్ట్ కనిపిస్తుందని చెప్పుకొచ్చింది. వంటగదిలోని  పదార్థాలు అందానికి ఉపయోగిస్తుందట. 

ఈ ఫేస్ ప్యాక్ రెండుసార్లు అప్లై చేయడం కొన్ని నెలల్లోనే రిజల్ట్ కనిపిస్తుందని చెప్పుకొచ్చింది. వంటగదిలోని  పదార్థాలు అందానికి ఉపయోగిస్తుందట.