AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponnaganti Kura Uses: ఈ ఆకుకూర వారంలో ఒక్కసారి తిన్నా.. రోగాలే రావు!

ఆకుకూరల్లో చాలా రకాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ ఆకు కూరలు మన ముందుకు వస్తున్నాయి. ఆకు కూరలు ఏవైనా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని రోజూ తినకపోయినా వారంలో ఒక్కసారి అయినా మీ డైట్‌లో చేర్చుకుంటే ఎన్నో రకాల దీర్ఘకాలిక, అనారోగ్య సమస్యలకు బైబై చెప్పొచ్చు. ఆకు కూరల్లో పొన్నగంటి ఆకుకూర కూడా ఒకటి. చాలా మంది కేవలం పాలకూర, తోట కూర, గోంగూర మాత్రమే..

Ponnaganti Kura Uses: ఈ ఆకుకూర వారంలో ఒక్కసారి తిన్నా.. రోగాలే రావు!
Ponnaganti Kura
Chinni Enni
|

Updated on: Jun 14, 2024 | 6:30 PM

Share

ఆకుకూరల్లో చాలా రకాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ ఆకు కూరలు మన ముందుకు వస్తున్నాయి. ఆకు కూరలు ఏవైనా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని రోజూ తినకపోయినా వారంలో ఒక్కసారి అయినా మీ డైట్‌లో చేర్చుకుంటే ఎన్నో రకాల దీర్ఘకాలిక, అనారోగ్య సమస్యలకు బైబై చెప్పొచ్చు. ఆకు కూరల్లో పొన్నగంటి ఆకుకూర కూడా ఒకటి. చాలా మంది కేవలం పాలకూర, తోట కూర, గోంగూర మాత్రమే తీసుకుంటారు. కానీ పొన్నగంటి కూర తీసుకుంటే ఉండే బెనిఫిట్స్ అన్నీ ఇన్నీ కావు. ఈ ఆకుకూరను పోషకాలకు నిధిగా చెబుతారు. ఈ ఆకు కూరలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకు కూర ఏడాది పొడవునా లభిస్తుంది. ఈ ఆకు కూర తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

పొన్నగంటి కూరలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది బాగా బల పడుతుంది. దీంతో రోగాలు, ఇన్ఫెక్షన్లు, వైరస్‌లతో పోరాడే శక్తి లభిస్తుంది. సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.

రక్త హీనత సమస్య ఉండదు:

పొన్నగంటి కూరలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి రక్త హీనత సమస్య ఉన్నవారు ఈ ఆకు కూర తింటే ప్రాబ్లమ్ నుంచి బయట పడొచ్చు. ఐరన్ లోపం కూడా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

డయాబెటీస్‌ కంట్రోల్:

ఈ ఆకు కూర తినడం వల్ల షుగర్ వ్యాధి కూడా నియంత్రణలోకి వస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు తరచూ మీ డైట్‌లో పొన్నగంటి కూరను యాడ్ చేసుకోవాలి. ఇందులో ఫైబర్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి కంట్రోల్ అవుతుంది.

చర్మానికి మేలు:

పొన్నగంటి కూర తినడం వల్ల చర్మానికి కూడా మేలు జరుగుతుంది. ఈ ఆకుల్లో విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

క్యాన్సర్ కణాలు నశిస్తాయి:

ఈ పొన్నగంటి కూరలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ ఆకు కూర తింటే శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలు అనేవి నశిస్తాయి.

కంటి ఆరోగ్యం:

పొన్నగంటి కూరలో విటమిన్ ఎ కూడా లభ్యమవుతుంది. ఈ విటమిన్ కంటి ఆరోగ్యాన్ని పెంచడంలో చక్కగా హెల్ప్ చేస్తుంది. కంటికి సంబంధించిన అన్ని సమస్యలను తగ్గిస్తుంది. కంటి చూపు కూడా మెరుగు పడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
ఫేస్‌బుక్ ప్రేమ.. పెళ్లి చేసుకున్న తర్వాత అసలు నిజం తెలిసి..
ఫేస్‌బుక్ ప్రేమ.. పెళ్లి చేసుకున్న తర్వాత అసలు నిజం తెలిసి..
విద్యార్థులకు టీజీఎస్‌ఆర్టీసీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య
విద్యార్థులకు టీజీఎస్‌ఆర్టీసీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య
మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్.. తిన్నారంటే ఆ సమస్యల ఊసే ఉండదు
మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్.. తిన్నారంటే ఆ సమస్యల ఊసే ఉండదు
ఈ రొమాంటిక్ సాంగ్ కు ఫిదా కాని వారుండరు.. యూట్యూబ్ లో సెన్సేషన్
ఈ రొమాంటిక్ సాంగ్ కు ఫిదా కాని వారుండరు.. యూట్యూబ్ లో సెన్సేషన్
టీమిండియా తదుపరి సూపర్ స్టార్ ఓపెనర్ ఎవరు..?
టీమిండియా తదుపరి సూపర్ స్టార్ ఓపెనర్ ఎవరు..?
పెళ్లైన ఏడాదికే మృతి.. చనిపోయిన 2 నెలల తర్వాత రీపోస్ట్‌మార్టం
పెళ్లైన ఏడాదికే మృతి.. చనిపోయిన 2 నెలల తర్వాత రీపోస్ట్‌మార్టం
తెలివైన అమ్మాయిల సీక్రెట్ పవర్స్..ఈ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
తెలివైన అమ్మాయిల సీక్రెట్ పవర్స్..ఈ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ..
మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ..
వన్డే అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించిన గుర్నూర్ బ్రార్
వన్డే అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించిన గుర్నూర్ బ్రార్
ఫెయిల్ అయిన బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. అసలు కథ ఏంటంటే..
ఫెయిల్ అయిన బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. అసలు కథ ఏంటంటే..