Rice for Breakfast: బ్రేక్ ఫాస్ట్ గా అన్నం తినవచ్చా.. తింటే ఏం జరుగుతుంది?

అల్పాహారంగా అన్నం తినొచ్చా.. తింటే ఏం జరుగుతుంది. చాలా మందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది. ఇప్పుడంటే టిఫిన్లు వచ్చాయి. కానీ పూర్వం అయితే ఉదయం అన్నమే తినేవారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న చాలా మంది పెద్ద వారు కూడా ఉదయం అన్నం తినడాన్ని గమనించే ఉంటారు. గంజి అన్నం, మజ్జిగ అన్నం ఇలా తింటూ ఉంటారు. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా అన్నం తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇది శక్తివంతమైనది. ఇది శరీరాన్ని కూడా చురుకుగా..

Rice for Breakfast: బ్రేక్ ఫాస్ట్ గా అన్నం తినవచ్చా.. తింటే ఏం జరుగుతుంది?
Rice For Breakfast
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 10, 2023 | 9:00 PM

అల్పాహారంగా అన్నం తినొచ్చా.. తింటే ఏం జరుగుతుంది. చాలా మందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది. ఇప్పుడంటే టిఫిన్లు వచ్చాయి. కానీ పూర్వం అయితే ఉదయం అన్నమే తినేవారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న చాలా మంది పెద్ద వారు కూడా ఉదయం అన్నం తినడాన్ని గమనించే ఉంటారు. గంజి అన్నం, మజ్జిగ అన్నం ఇలా తింటూ ఉంటారు. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా అన్నం తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇది శక్తివంతమైనది. ఇది శరీరాన్ని కూడా చురుకుగా ఉంచుతుంది.  ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. బీన్స్, క్యారెట్లు, బచ్చలి కూర, బఠానీలు వంటి కూరగాయలు యాడ్ చేసుకుని తింటే అనేక ప్రయోజనాలు ఉంటాయి.

డయాబెటీస్ పెరిగే అవకాశం:

అయితే ఉదయం అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి పెరుగుతాయి. దీని వల్ల మధు మేహం వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా మీరు ఎంచుకునే బియ్యాన్ని బట్టి కూడా ఉంటాయి. అలాగే వెనిగర్ లేదా కొబ్బరి నూనెతో తయారు చేసిన అన్నం తినడం వల్ల జీర్ణ క్రియ మరింత నెమ్మదించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉదయం అన్నం తినాలి అనుకుంటే మితంగా తీసుకుంటే చాలా మంచిది.

వెయిట్ పెరుగుతారు:

అలాగే బరువు తగ్గాలి అనుకునే వారు కూడా బ్రేక్ ఫాస్ట్ గా అన్నాన్ని తీసుకోకూడదు. మితంగా తీసుకుంటే పర్వాలేదు కానీ.. ఎక్కువగా తింటే మాత్రం బరువు పెరుగుతారు. దీనికి కారణం అన్నంతో కార్బోహైడ్రేట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే అన్నం తినే వారు.. తినని వారి కంటే ఎక్కువ బరువు తగ్గుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఎందుకంటే బియ్యం తక్కువ కొవ్వ, చక్కెర, సోడియం ఉన్న ఆహారం. కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారు తక్కువ మోతాదులో అన్నం తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

జీర్ణ క్రియకు మేలు:

ఉదయం అల్పాహారంగా అన్నం తినడం వల్ల జీర్ణ క్రియకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతే కాకుండా సులభంగా జీర్ణం అవుతుంది. అదే విధంగా అతిసారం వంటి సమస్యను కూడా తగ్గిస్తుంది. అలాగే పేగుల్లో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పెంచడానికి హెల్ప్ చేస్తుంది.

మితంగా తీసుకుంటే బెస్ట్:

ఎలాంటి సందేహాలు లేకుండా అన్నాన్ని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. మరి ఎక్కువ మోతాదులో కాకుండా.. మితంగా తీసుకుంటే చాలా మంచిది. ఉదయం పూట యాక్టీవ్ గా ఉంటారు కాబట్టి.. శక్తి ఎక్కువగా కావాలి. ఉదయం అన్నం తినడం వల్ల ఈ సమస్యల నుంచి బయట పడొచ్చు. ఉదయం, మధ్యాహ్నం అన్నం తినే వారు.. రాత్రి భోజనం చేయడం మానుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్