AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: హాట్‌ సమ్మర్‌లో బాడీని కూల్‌గా ఉంచుకోవాలా?.. అయితే ఈ పండ్లు కచ్చితంగా తినాల్సిందే!

మార్చి ప్రారంభంతో వేసవి మొదలైంది. సమ్మర్ స్టార్టింగ్‌లోనే మాడు పడిగే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ వేడిని తట్టుకోవాలంటే మన బాడీని హైడ్రెట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ, డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, అలసట వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో శరీరాన్ని చల్లగా ఉంచడానికి కొన్ని పండ్లు మనకు ఎంతో సహాయపడుతాయి. ఇవి నిర్జలీకరణాన్ని నివారించడమే కాకుండా శరీరాన్ని చల్లగా ఉంచడంలో కూడా సహాయపడుతాయి. కాబట్టి సమ్మర్‌లో బాడీని కూల్‌గా ఉచుకోవాలంలో ఏ పండ్లు తినాలో తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Mar 05, 2026 | 1:17 PM

Share
వేసవిలో బాడీని హైడ్రెట్‌గా ఉంచుకోవాలంటే మనం తినాల్సిన పండు ఏవో చూద్దాం. ముందుగా పుచ్చకాయ, పుచ్చకాయలో దాదాపు 92% నీరు ఉంటుంది, ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, అలాగే నిర్జలీకరణాన్ని నివారిస్తుంది. అలాగే పుచ్చకాయలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి ఈ పండు ఈ వేసవిలో మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

1 / 5
దానిమ్మ: వేసవిలో దానిమ్మ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇందులో ఇనుము పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తహీనతను నివారిస్తుంది. ఈ పండులో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరానికి హైడ్రేషన్ అందిస్తుంది. అదనంగా, దానిమ్మ మలబద్ధకం, కడుపు నొప్పి, వేసవిలో సాధారణంగా వచ్చే ఇతర జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. వడదెబ్బను నివారించడానికి, దానిమ్మ, దానిమ్మ రసం తీసుకోవడం చాలా ఉత్తమం.

2 / 5
నారింజ, ద్రాక్ష: నారింజ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే విటమిన్ సి శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది. నారింజ పండ్లు తినడం వల్ల అలసట తగ్గి శరీరానికి ఉత్తేజం లభిస్తుంది. వేసవిలో శరీరంలో నీటి కొరతను తొలగించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే తీపి, పుల్లని రుచి కలిగి ఉండే ద్రాక్షను వేసవిలో తీసుకోవడం కూడా చాలా మంచిది. ద్రాక్షలో 70 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది, ఇది శరీరానికి హైడ్రేషన్ అందిస్తుంది. హీట్ స్ట్రోక్‌ను నివారించడంలో సహాయపడుతుంది.

3 / 5
 దోసకాయ,  కొబ్బరి నీరు: వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి దోసకాయ తినడం కూడా ఉత్తమ మార్గం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, నిర్జలీకరణాన్ని నివారిస్తుంది. అలాగే, దోసకాయలోని ఎలక్ట్రోలైట్లు శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే శరీరాన్ని సహజంగా చల్లబరచడానికి, హైడ్రేట్ చేయడానికి కొబ్బరి నీరు కూడా ఉత్తమ మార్గం. ఇందులో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ వేడి వాతావరణంలో అలసట నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా సహాయపడుతుంది.

4 / 5
బొప్పాయి, లిచీ: బొప్పాయి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, అలాగే శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఇందులో శరీరాన్ని ఉత్తేజపరిచే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అలాగే లిచీ కూడా వేసవిలో పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో నీరు పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. దీనిలోని విటమిన్ సి, బి-కాంప్లెక్స్ కంటెంట్ శరీరానికి శక్తినిస్తుంది.( Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన మేరకు మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు)

5 / 5
Follow Us