Virat Kohli : విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు.. 24 గంటల్లోనే లక్షన్నర జతలు హాట్ కేకుల్లా సేల్
Virat Kohli : రికార్డులు సృష్టించడంలో టీమిండియా రన్ మెషీన్, కింగ్ విరాట్ కోహ్లీ శైలి లీడరే వేరు.. మైదానంలో బ్యాట్‌తోనే కాకుండా, బిజినెస్ ప్రపంచంలోనూ ఆయన సరికొత్త సంచలనాలు నమోదు చేస్తున్నాడు.. తాజాగా కోహ్లీకి చెందిన లైఫ్‌స్టైల్ బ్రాండ్ వన్8 గ్లోబల్ ప్రీమియర్ వేదికగా సరికొత్త కలెక్షన్ షూస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.. ఈ బూట్లకు మార్కెట్లో ఏ రేంజ్ క్రేజ్ ఉందంటే, లాంచ్ చేసిన కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 1.5 లక్షల జతల బూట్లు అమ్ముడైపోయాయి.

Virat Kohli : టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి మైదానంలోనే కాదు, బయట కూడా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ బ్రాండ్ అయిన వన్8 ఇప్పుడు సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇటీవల ఈ బ్రాండ్ కింద సరికొత్త షూస్ కలెక్షన్‌ను గ్లోబల్ మార్కెట్లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. లాంచ్ చేసిన కేవలం 24 గంటల్లోనే దాదాపు 1,50,000 జతల బూట్లు అమ్ముడైపోయినట్లు మీడియా నివేదికలు వెల్లడించాయి. ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ షూస్ కొనుగోలు చేయడానికి యువత స్టోర్ల ముందు పెద్ద ఎత్తున క్యూ కట్టడం విశేషం.
టెస్ట్ రన్స్‌తో ముడిపడి ఉన్న షూస్ ధర
ఈ వన్8 షూస్ ప్రత్యేకత ఏమిటంటే, వీటి ధరను విరాట్ కోహ్లీ సాధించిన పరుగుల ఆధారంగా నిర్ణయించారు. మార్కెట్లో ఒక జత వన్8 షూస్ ధరను రూ.9,230గా నిర్ణయించారు. విరాట్ కోహ్లీ తన టెస్ట్ క్రికెట్ కెరీర్‌లో సరిగ్గా 9,230 పరుగులు చేశారు. ఆయన టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ పరుగుల సంఖ్య మారే అవకాశం లేదు. అందుకే తన కెరీర్ మైలురాయికి గుర్తుగా షూస్ ధరకు ఈ నంబర్‌ను ఫిక్స్ చేశారు. భవిష్యత్తులో ఈ ధర మారుతుందా లేదా అనేది పక్కన పెడితే, ప్రస్తుతం ఈ వినూత్న ఆలోచన బిజినెస్ పరంగా సూపర్ సక్సెస్ అయింది.
A lap around one8 World!
Plenty of curious looks. Plenty of first reactions. And a pair of shoes that had everyone stopping by. pic.twitter.com/ubfAS2DhlT
— one8 (@one8world) June 21, 2026
రూ. 300 కోట్ల పూమా ఆఫర్‌ను కాదనుకుని..
గతంలో విరాట్ కోహ్లీ ప్రముఖ గ్లోబల్ స్పోర్ట్స్ బ్రాండ్ పూమాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పూమా భాగస్వామ్యంతోనే వన్8 లైన్ ప్రొడక్ట్స్ వచ్చేవి. అయితే, విరాట్ కోహ్లీతో సరికొత్త డీల్ కోసం పూమా ఇండియా ఏకంగా రూ.300 కోట్ల భారీ ఆఫర్‌ను కోహ్లీ ముందు ఉంచింది. కానీ కోహ్లీ ఆ ఆఫర్‌ను తిరస్కరించి, స్వతంత్రంగా తన సొంత బ్రాండ్‌ను పూర్తిగా లీడ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. పూమా ఇండియా మాజీ ఎండీ నేతృత్వంలోని కంపెనీతో చేతులు కలిపి ఈ వన్8 ప్రొడక్ట్స్‌ను ఒంటరిగా మార్కెట్లోకి తెచ్చి తానేంటో నిరూపించుకున్నాడు.
ఒక్క రోజులోనే రూ.140 కోట్ల కలెక్షన్లు
విరాట్ కోహ్లీ స్వయంగా ఈ బ్రాండ్‌కు ఫేస్ కావడంతో, ప్రమోషన్ల కోసం ఎలాంటి అదనపు కష్టాలు పడాల్సి రాలేదు. సోషల్ మీడియాలో వన్8 వరల్డ్ పేరిట విడుదల చేసిన గ్లోబల్ ప్రీమియర్ వీడియోకు కోట్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఈ క్రేజ్ కాస్తా విక్రయాల రూపంలో మారి కేవలం మొదటి రోజే ఏకంగా రూ.140 కోట్ల భారీ రెవెన్యూను తెచ్చిపెట్టింది. అభిమానులు తాము కొనుగోలు చేసిన షూస్ ఫోటోలు, అన్‌బాక్సింగ్ వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. స్పోర్ట్స్, స్ట్రీట్ వేర్ మార్కెట్లో వన్8 బ్రాండ్ ఇప్పుడు సరికొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
