AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hello Movie : ఏం ఛేంజ్ భయ్యా.. హలో సినిమా చైల్డ్ ఆర్టిస్టును ఇప్పుడు చూస్తే మతిపోవాల్సింది.. డ్యాన్స్ ఇరగదీసింది..

లెనిన్ సినిమా బ్లా్క్ బస్టర్ హిట్టుతో ఫుల్ జోష్ మీదున్నారు అక్కినేని అఖిల్. దాదాపు పదేళ్ల కాలం నుంచి ఎదురుచూస్తున్న అయ్యగారి ఖాతాలో భారీ విజయం పడింది. ఇందులో యాక్టింగ్ చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ఈ క్రమంలోనే ఇప్పుడు అఖిల్ నటించిన చిత్రాలన్ని సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో హలో ఒకటి.

Hello Movie : ఏం ఛేంజ్ భయ్యా.. హలో సినిమా చైల్డ్ ఆర్టిస్టును ఇప్పుడు చూస్తే మతిపోవాల్సింది.. డ్యాన్స్ ఇరగదీసింది..
Hello Movie Child Artist
Rajitha Chanti
|

Updated on: Jul 21, 2026 | 6:40 AM

Share

అక్కినేని అఖిల్ హీరోగా, విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో 2017లో వచ్చిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చిత్రం ‘హలో’. మంచి హైప్ మీద విడుదలైన ఈ సినిమా థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇందులోని సాంగ్స్ మాత్రం ఇప్పటికీ యూట్యూ్బ్, సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో కథానాయకుడు, కథానాయికల చిన్ననాటి సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిన్ననాటి సీను, జున్నుల మధ్య సాగే అమాయకమైన స్నేహం, ప్రేమకథ అందరి హృదయాలను తాకింది. ఇప్పటికీ ఈ సినిమాలోని చైల్డ్ హుడ్ సన్నివేశాలు నెట్టింట షేర్ చేస్తుంటారు. అయితే ఈ చిత్రంలో చిన్ననాటి ‘జున్ను’ (ప్రియ) పాత్రలో కనిపించి, తన ముద్దు ముద్దు ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించిన ఆ చిన్నారి గుర్తుందా? ఆ చైల్డ్ ఆర్టిస్ట్ అసలు పేరు మైరా దాండేకర్ (Myrah Dandekar).

ఎక్కువ మంది చదివినవి : Sudhakar : నేను కోమాలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన హీరో అతడే.. నటుడు సుధాకర్..

మహారాష్ట్రకు చెందిన మైరా దాండేకర్, ‘హలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. మొదటి సినిమాతోనే అమాయకమైన నటనతో అందరి హృదయాలు దొచుకుంది. ఆ తర్వాత హిందీ చిత్రసీమలోనూ బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాణి ముఖర్జీ నటించిన ‘హిచ్కీ’, జాన్ అబ్రహాం ‘సత్యమేవ జయతే’, అజయ్ దేవగణ్ ‘తానాజీ’ వంటి పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో నటించింది. కేవలం సినిమాల్లోనే కాకుండా ఇప్పటివరకు 50కి పైగా టీవీ ప్రకటనలు, మోడలింగ్ ప్రాజెక్ట్లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో చాలా గొప్ప మనిషి.. ఆయన పేరు వినగానే రజినీకాంత్ సిగరెట్ పడేసి నిలబడ్డారు.. తనికెళ్ల భరణి..

అయితే, ‘హలో’ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తుండటంతో ఆ బుజ్జి జున్ను ఇప్పుడు బాగా పెద్దదైపోయింది. ప్రస్తుతం మైరా టీనేజ్ ఏజ్‌లోకి అడుగుపెట్టి, అత్యంత స్టైలిష్‌గా, గ్లామరస్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మైరా, ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటో షూట్ పిక్స్, రీల్స్‌ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమెకు సంబంధించిన లేటేస్ట్ డ్యాన్స్ వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అప్పట్లో చిన్నారిగా చూసిన జున్ను… ఇప్పుడు ఇంత క్యూట్‌గా, గ్లామరస్‌గా తయారైందా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..

జున్ను లేటేస్ట్..

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..

Follow Us